ఏపీలో పోలీసుల తీరుపై తీవ్రంగా మండిపడ్డారు బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు సోము వీర్రాజు. ఏపీ పోలీసులు ప్రభుత్వానికి తాబేదార్లా?.. బీజేపీ నేతలపై అక్రమ కేసులు బనాయిస్తున్నారు..పోలీసు వ్యవస్థ ఎందుకు దిగజారిపోతోంది అని ప్రశ్నించారు, రాజమండ్రిలో సోము వీర్రాజు సంచలన వ్యాఖ్యలు చేశారు. జగన్ ముఖ్యమంత్రి కానప్పుడు విశాఖలో నేను ముఖ్యమంత్రిని అవుతాను, మీ సంగతి తేల్చుతా అన్నట్టే చేస్తున్నారు. రావులపాలెంలో నాపై ఒక కానిస్టేబుల్ దుర్భాషలాడారు.
Read Also:Charmy Kaur: ఇది చిన్న బ్రేక్ మాత్రమే.. ముందుంది మొసళ్ల పండగ
విజయవాడలో ఓ వ్యక్తి కన్ను పొడిచేశారు.ఎవరి కోసం పోలీసులు ఈ విధంగా వ్యవహారిస్తున్నారు. ఆత్మకూరులో కూడా మా పార్టీ అభ్యర్థిపై ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసు పెట్టారు. పోలీసు వ్యవస్థ ఎందుకు ఇలా దిగజారిపోతుంది.అధికార పార్టీకి తొత్తులుగా మారిపోతున్నారు.
ఇది ప్రజాస్వామ్యానికి విఘాతం. రాష్ట్ర ప్రభుత్వ వ్యతిరేక చర్యలపై బీజేపీ వీధి మీటింగ్ లు పెడుతుందన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా 5వేల మీటింగ్ లు పెడతాం. రేషన్ బియ్యం అక్రమ రవాణా ద్వారా 5 వేల కోట్ల రూపాయలు అవినీతి జరుగుతోంది. కాకినాడ పోర్ట్ నుండి అక్రమ రేషన్ బియ్యం బియ్యం విదేశాలకు తరలిపోతున్నాయి. ఈనెల 17 నుండి అక్టోబర్ 2 వరకు పెద్ద ఎత్తున పుట్టిన రోజు వేడుకలు జరుగుతాయన్నారు. అవినీతి పెరిగిపోతోంది….మట్టి దోచేస్తున్నారు.. గ్రావెల్ దోచేస్తున్నారు.. రైతు భరోసా కేంద్రాల పేరుతో రవాణా ఖర్చుల కింద కోట్లు కొట్టేశారని ఆరోపించారు సోము వీర్రాజు.
ఫ్యామిలీ పార్టీలకు బిజెపి వ్యతిరేకం.జనసేనతో కలిసి వెళ్ళతాం.. జూనియర్ ఎన్టీఆర్ కు ప్రజాదరణ ఎక్కువ ఎక్కడ ఉంటే అక్కడే ఉపయోగించుకుంటాం. చంద్రబాబుపై నా వైఖరి మారలేదు..ఫ్యామిలీ పార్టీలకు దూరమని మా అధిష్ఠానమే చెప్పిందన్నారు సోము వీర్రాజు.
Read Also: VishnuVardhan Reddy: కేంద్ర నిధులు వద్దంటూ లేఖలు రాసింది ఎవరు?
