AP Assembly Sessions 2024 LIVE UPDATES: మూడో రోజు ఏపీ అసెంబ్లీ సమావేశాలు ప్రారంభమయ్యాయి. సమావేశాల్లో ప్రశ్నోత్తరాలతో పాటు ఏపీలో గత ప్రభుత్వంలో ఎక్సైజ్ శాఖలో జరిగిన అక్రమాలపై ప్రస్తుత ప్రభుత్వం శ్వేతపత్రం విడుదల చేసేందుకు రెడీ అయింది. ఇందులో భాగంగానే సభలో శ్వేతపత్రాన్ని సీఎం చంద్రబాబు విడుదల చేయనున్నారు. ఏపీ అసెంబ్లీ సమావేశాలు.. లైవ్ అప్‌డేట్స్ మీ కోసం..
తెలంగాణ అసెంబ్లీ రేపటికి వాయిదా. రేపు తెలంగాణ బడ్జెట్.
మద్యం శ్వేత పత్రంపై చర్చ సందర్భంగా కీలక అంశం ప్రస్తావించిన ఎమ్మెల్యే కూన రవి. మద్యం ఉత్పత్తి కంపెనీల నుంచి డిపోలకు వెళ్లకుండా నేరుగా మద్యం దుకాణాలకే మద్యం వెళ్లింది. వారంలో ఒకటి రెండు రోజుల్లో అడ్డదారిలో మద్యాన్ని ప్రభుత్వ దుకాణాలకు వెళ్లాయి. ఇలా వెళ్లిన మద్యం అమ్మకాల సొమ్ము ప్రైవేట్ వ్యక్తులకే వెళ్లాయి. మద్యం ఆదాయం తగ్గడానికి ఇదీ ఓ కారణంగా పేర్కొన్న కూన రవి..
లిక్కర్ స్కామ్‌పై సంచలన నిర్ణయం తీసుకున్నారు.. వైసీపీ సర్కార్ హయాంలో జరిగిన మద్యం కుంభకోణంపై సీఐడీ దర్యాప్తుకు ఆదేశాలు జారీ చేశారు సీఎం చంద్రబాబు.. నగదు లావాదేవీలు పెద్ద ఎత్తున జరిగింది కాబట్టి ఈడీకి రిఫర్ చేస్తామని స్పష్టం చేశారు. ఏపీలో జరిగిన మద్యం కుంభకోణం ఈడీ దర్యాప్తుకు అర్హమైన కేసుగా పేర్కొన్న ఆయన.. మద్యం విషయంలో మరింత దర్యాప్తు చేయాల్సిన అవసరం ఉందన్నారు. ఐదేళ్లల్లో లక్ష కోట్ల నగదు అమ్మకాలు జరిగాయి.. ఇది భయంకరమైన స్కామ్‌గా అభివర్ణించారు..
మద్య నిషేధం అని హామీ ఇచ్చారు.. ప్రభుత్వ మద్యం దుకాణాలు పెట్టారు. మద్యం పాలసీలో అడుగడుగునా తప్పులు చేశారు అని ఫైర్ అయ్యారు సీఎం చంద్రబాబు... వైసీపీ హయాంలోని మద్యం పాలసీ వల్ల నేరాలు పెరిగాయని విమర్శించారు. గత ప్రభుత్వం మద్యం ధరలను 75 శాతం పెంచింది. మైండ్ ఉండే ఎవ్వడూ ఈ తరహాలో ఎక్సైజ్ పాలసీ రూపొందించరు. ఏం చేసినా జరిగిపోతోందనే అహకారంతో ఇష్టానుసారంగా వ్యవహరించారు. పాత బ్రాండ్లను తప్పించారు.. కొత్త బ్రాండ్లను తెచ్చారు. పేదలు తాగే తక్కువ ధర మద్యం బ్రాండ్లు లేకుండా చేశారు. నాకు మద్యం తాగే అలవాటు లేదు.. కానీ, ఏదేదో బ్రాండ్లు తెచ్చారని మా వాళ్లు కొందరు చెబుతున్నారన్నారు.
ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రంలో గత ఐదేళ్లలో వాళ్లకు నచ్చిన బ్రాండ్లనే అమ్ముకున్నారు..
పక్క రాష్ట్రంలో ఆదాయం పెరిగింది.. ఏపీలో ఆదాయం తగ్గిపోయింది.. వైసీపీ నేతల జేబుల్లోకి డబ్బులు వెళ్లాయి.. అందుకే ఆదాయం తగ్గింది..
ఏపీ అసెంబ్లీలో ఎక్సైజ్ పాలసీపై శ్వేతపత్రం.. గత ప్రభుత్వం అడుగడుగునా తప్పిదాలు చేసింది.. గడిచిన ఐదేళ్లలో రాష్ట్రానికి తీవ్ర నష్టం జరిగింది.. మద్యం షాపులను తగ్గించినా, మళ్లీ పెంచారు.. మద్యం ధరలను 75 శాతం పెంచారు- సీఎం చంద్రబాబు
ఏపీ అసెంబ్లీకి స్వల్ప విరామం.. విరామం తర్వాత మద్యంపై అసెంబ్లీలో శ్వేతపత్రం విడుదల.. గత ప్రభుత్వంలో మద్యం అవినీతిపై సీఎం చంద్రబాబు పవర్ పాయింట్ ప్రజెంటేషన్..
ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ రద్దు బిల్లుకు ఏపీ అసెంబ్లీ ఆమోదం.. ఈ చట్టం అమలులోకి వస్తే ప్రజల ఆస్తులు దోచేసేవారు.. ఇచ్చిన హామి ప్రకారం చట్టాన్ని రద్దు చేస్తున్నాం- సీఎం చంద్రబాబు
ఇంగ్లీష్ విద్యకు ఎన్డీయే ప్రభుత్వం వ్యతిరేకం కాదు.. కానీ ఉపాధ్యాయులకు సరైన ట్రైనింగ్ లేకుండా ఇంగ్లీష్ విద్య అమలు సాధ్యం కాదు.. మూడో తరగతి నుంచి పదవ తరగతి వరకు విద్యార్థులకు టోఫెల్ శిక్షణ, పరీక్షలు వల్ల పిల్లలపై ఎక్కువ ఒత్తిడి పడుతుంది.. టోఫెల్ శిక్షణలో అమెరికన్ యాక్సెంట్ వల్ల విద్యార్థులు కన్ఫ్యూజ్ అవుతున్నారు- మంత్రి నారా లోకేశ్
హెల్త్ యూనివర్శిటీకి ఎన్టీఆర్ పేరును పునరుద్దరిస్తూ సవరణ బిల్లును ప్రవేశపెట్టిన మంత్రి సత్య ప్రసాద్.. మహనీయుడైన ఎన్టీఆర్ పేరు మార్చాలనే ఆలోచన గత ప్రభుత్వానికి ఎలా వచ్చిందో.. గత ప్రభుత్వం అడ్డగోలుగా ఎన్టీఆర్ పేరు తొలగించి వైఎస్సార్ పేరు పెట్టింది- మంత్రి సత్యప్రసాద్ యాదవ్
ఎస్సీ సబ్ ప్లాన్ నిధుల మళ్లింపుపై అధికారుల సమాచారంపై అసంతృప్తి.. ఎస్సీ సబ్ ప్లాన్ నిధుల్లో ఎంత మాత్రం మళ్లించ లేదని అధికారుల సమాచారం.. అధికారుల సమాచారానికి భిన్నంగా సభలో మంత్రి డోలా సమాధానం.. నిధుల మళ్లింపుపై పూర్తి సమాచారం ఇవ్వాలని మంత్రి డోలా ఆదేశం..
గతంలో ఉన్న రైతు భరోసా కేంద్రాలను రైతు సహయ కేంద్రాలుగా మార్చుతున్నాం.. రాష్ట్రంలో త్వరలోనే రూ. 674 కోట్లు ధాన్యం బకాయిలు రైతులకు అందిచాలని నిర్ణయం: మంత్రి నాదెండ్ల మనోహార్
అసెంబ్లీ ప్రశ్నోత్తరాల్లో కృష్ణపట్నం పోర్టు అంశంపై చర్చ.. కృష్ణపట్నంలో కంటైనర్ పోర్టును అదానీ తొలగించడంపై సీనియర్ ఎమ్మెల్యే సోమిరెడ్డి ఆవేదన.. కృష్ణపట్నంలో కంటైనర్ పోర్టు కోసం అదానీ కాళ్లు పట్టుకుంటాను: ఎమ్మెల్యే సోమిరెడ్డి
ప్రస్తుతం ఉచిత గ్యాస్ సిలిండర్లను రాష్ట్ర ప్రభుత్వం అందించడం లేదు.. అయితే 2016 నుంచి 24 వరకూ ప్రధాన మంత్రి ఉజ్వల యువజనం పథకం కింద కొంత మందికి ఇస్తున్నారు.. ఉచిత గ్యాస్ సిలిండర్ల గురించి త్వరలో నిర్ణయం తీసుకొని వివిధ శాఖలతో చర్చించి సభా ముఖంగా మరోసారి వివరాలు తెలియజేస్తాం- మంత్రి నాదెండ్ల మనోహర్
అధికారుల తీరుపై అసెంబ్లీ లాబీల్లో చర్చ.. మంత్రులను మాయ చేసేలా సమాచారం ఇస్తున్నారని విమర్శలు.. ప్రశ్నలకు సరైన సమాధానాలు ఇవ్వడం లేదంటోన్న మంత్రులు.. గ్రామ పంచాయతీల నిధుల మళ్లింపుపై అధికారుల సమాచారంపై డిప్యూటీ సీఎం పవన్ అసంతృప్తి