Pawan Kalyan : ఇది కూటమి ప్రభుత్వం తీసుకువస్తున్న విప్లవాత్మక మార్పులకు నిదర్శనం
- 2027 జూన్ నాటికి పూర్తి లక్ష్యం
- కేంద్రం నుంచి రూ.3,300 కోట్ల అదనపు నిధులు
- న్యూఢిల్లీలో ఉన్నత స్థాయి సమీక్ష సమావేశం
- పునరావాసం, నిర్మాణ పనులకు వేగం
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Pawan Kalyan : ఆంధ్రప్రదేశ్ పదవ తరగతి ఫలితాల్లో విద్యార్థులు సాధించిన అద్భుత ప్రతిభపై ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ హర్షం వ్యక్తం చేశారు. ఉత్తీర్ణత సాధించిన విద్యార్థినీ విద్యార్థులందరికీ ఆయన తన హృదయపూర్వక శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ ఫలితాలు రాష్ట్ర విద్యాశాఖలో కూటమి ప్రభుత్వం తీసుకువస్తున్న విప్లవాత్మక మార్పులకు నిదర్శనమని ఆయన కొనియాడారు.
గత ఏడాదితో పోలిస్తే ఈ ఏడాది ఉత్తీర్ణత శాతం సుమారు 4 శాతం పైగా మెరుగుపడడం విశేషమని పవన్ కళ్యాణ్ పేర్కొన్నారు. గౌరవ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు నాయకత్వంలోని కూటమి ప్రభుత్వం విద్యా వ్యవస్థలో ప్రవేశపెట్టిన సంస్కరణల వల్లే ఇది సాధ్యమైందని ఆయన విశ్లేషించారు. విద్యార్థుల భవిష్యత్తును దృష్టిలో ఉంచుకుని ప్రభుత్వం తీసుకుంటున్న నిర్ణయాలు క్షేత్రస్థాయిలో అద్భుత ఫలితాలను ఇస్తున్నాయని ఆనందం వ్యక్తం చేశారు.
Also Read
- Veligonda Project Phase 1: వెలిగొండ ఫేజ్-1 ప్రారంభం.. 10.70 టీఎంసీల కృష్ణా జలాలు విడుదల చేసిన సీఎం చంద్రబాబు
- Veligonda Project: నేడే సీఎం చంద్రబాబు చేతులమీదుగా వెలిగొండ ప్రాజెక్టు ఫేజ్-1 ప్రారంభం.!
- Veligonda Project: 30 ఏళ్ల కల సాకారం.. రేపు వెలిగొండ ప్రాజెక్టు ఫేజ్-1 ప్రారంభించనున్న సీఎం..
- Vijaysai Reddy: సొంత కారణాలతోనే విజయసాయి రెడ్డి బయటకు వెళ్లారు.. పబ్లిసిటీ కోసం ప్రయత్నిస్తున్నారు!
విద్యాశాఖ మంత్రిగా నారా లోకేష్ అమలు చేస్తున్న కార్యాచరణను డిప్యూటీ సీఎం ప్రత్యేకంగా ప్రశంసించారు. ముఖ్యంగా పరీక్షలకు ముందు విద్యార్థులను సన్నద్ధం చేసేందుకు తీసుకువచ్చిన ‘100 రోజుల ప్రణాళిక’ , తల్లిదండ్రులను విద్యా ప్రక్రియలో భాగస్వాములను చేసేందుకు నిర్వహించిన ‘మెగా పేరెంట్ టీచర్స్ మీట్’ వంటి కార్యక్రమాలు విద్యార్థుల విజయంలో కీలక పాత్ర పోషించాయని ఆయన కొనియాడారు.
ముఖ్యంగా ప్రభుత్వ యాజమాన్య పాఠశాలల్లో ఉత్తీర్ణత శాతం గణనీయంగా పెరగడం పట్ల పవన్ కళ్యాణ్ సంతృప్తి వ్యక్తం చేశారు. గత ఏడాది ప్రభుత్వ పాఠశాలల్లో 72.8 శాతం ఉత్తీర్ణత నమోదు కాగా, ఈ ఏడాది అది 78.39 శాతానికి పెరగడం గమనార్హం. ఈ విజయానికి కారకులైన ఉపాధ్యాయులకు, విద్యాశాఖ అధికారులకు ఆయన అభినందనలు తెలియజేశారు. విద్యార్థుల చదువుల పట్ల ప్రభుత్వం నిరంతరం అండగా ఉంటుందని ఆయన ఈ సందర్భంగా భరోసా ఇచ్చారు.
తాజావార్తలు
-
Honda UC3 Electric Scooter: 122KM రేంజ్, 3.2kWh బ్యాటరీతో హోండా UC3 ఎలక్ట్రిక్ స్కూటర్.. భారత్‌లో రిలీజ్ కు రెడీ..!
-
Hatha: పిల్లి చుట్టూ తిరిగే మిస్టరీ!.. ఇంటెన్స్ గా కిరణ్ అబ్బవరం కొత్త సినిమా గ్లింప్స్
-
Veligonda Project Phase 1: వెలిగొండ ఫేజ్-1 ప్రారంభం.. 10.70 టీఎంసీల కృష్ణా జలాలు విడుదల చేసిన సీఎం చంద్రబాబు
-
Tukkuguda Nurse Mu*rder: తుక్కుగూడ నర్సు హ*త్యకేసు.. సీన్ టు సీన్.. అసలేం జరిగిందంటే.!
-
NBK111 : బాలయ్య – గోపీచంద్ మలినేని సినిమా టైటిల్ అనౌన్స్మెంట్ డేట్ ఫిక్స్
ట్రెండింగ్
-
క్రిస్టల్స్‌తో మెరిసిపోనున్న Motorola కొత్త ఫోల్డబుల్ ఫోన్.. IFA 2026లో సరికొత్త స్వరోవ్స్కీ ఎడిషన్.!
-
Viral Video : గుండెలను పిండేస్తున్న దృశ్యం.. చెల్లెలితో చిన్నారి.. తల్లిదండ్రుల కోసం వెతుకులాట.!
-
Mouth Ulcer: చిన్న నోటిపుండే కదా అని లైట్ తీసుకుంటున్నారా? ఈ మార్పులు కనిపిస్తే తప్పక డాక్టర్‌ను సంప్రదించాల్సిందే.!
-
Rose Water: ముఖానికి ఫ్రెష్‌నెస్, హైడ్రేషన్ కావాలా.? అయితే ఇంట్లోనే రోజ్ వాటర్ ఇలా తయారు చేసుకోండి..!
-
మార్కెట్లో కిలో రూ.1500.. ఇంట్లోనే కేవలం 15 నిమిషాల్లో ‘కాజూ కట్లీ’ తయారీ చేయండి ఇలా.!