Vijaysai Reddy: సొంత కారణాలతోనే విజయసాయి రెడ్డి బయటకు వెళ్లారు.. పబ్లిసిటీ కోసం ప్రయత్నిస్తున్నారు!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
సొంత కారణాలతోనే మాజీ ఎంపీ విజయసాయిరెడ్డి వైసీపీ నుంచి బయటకు వెళ్లారని వైసీపీ స్టేట్ కో ఆర్డినేటర్ సజ్జల రామకృష్ణారెడ్డి అన్నారు. వైసీపీని వీడిన వారిపై తాము ఎప్పుడూ పెద్దగా విమర్శలు చేయలేదని.. 40 ఏళ్లుగా వైఎస్ జగన్ వెంట ఉన్న వ్యక్తి ఆరోపణలు చేయడం సరికాదన్నారు. పార్టీ నుంచి వెళ్లిన వారి గురించి జగన్ ఎప్పుడూ నెగెటివ్‌గా మాట్లాడలేదని, జగన్ మతమార్పిడులను ప్రోత్సహించారని సాయిరెడ్డి అనడం దారుణం అని ఫైర్ అయ్యాడు. విజయసాయి రెడ్డి పబ్లిసిటీ కోసం ప్రయత్నిస్తున్నారు అని సజ్జల చెప్పుకొచ్చారు.
‘కాంగ్రెస్ పార్టీతో ములాఖత్ అయిన టీడీపీ.. వైఎస్ జగన్ వ్యక్తిత్వాన్ని టార్గెట్ చేసింది. జగన్ అన్ని వర్గాల మనసులు గెలుచుకుని అధికారాన్ని తీసుకువచ్చారు. ఐదేళ్లలో 15 ఏళ్ల స్థాయి అభివృద్ధి చేశారు. అప్పటి నుంచి ఇప్పటివరకు జగన్‌పై మాటల దాడి ఆగలేదు. మనుషులు మారినా వాళ్ళ టార్గెట్ మాత్రం జగన్. చంద్రబాబు వాళ్ళ ముఠా రంగప్రవేశం చేయకుండా బయట వ్యక్తులను ప్రోత్సహిస్తారు. ఉభయతారకంలా పని గడిచి పోతుంది. ఇప్పటికీ రెస్పాండ్ కాకపోతే సాధారణ ప్రజలకు ఇది నిజమే ఏమో అనిపించే అవకాశం ఉంది. సీఎం చంద్రబాబు ఏ రోజు ప్రజల గురించి అవసరం లేదు. కొత్తగా పాత్రలోకి వచ్చింది విజయసాయిరెడ్డి. ఆయన వ్యక్తిగత కారణాల వల్ల సాయిరెడ్డి బయటకు వెళ్ళారు. ఇప్పుడు రాజకీయ పార్టీ పెడతా అంటున్నారు. జగన్ ఎక్కడికి వెళ్లినా వారి గురించి నెగెటివ్‌గా మాట్లాడలేదు, మేము మాట్లాడలేదు’ అని సజ్జల అన్నారు.
Also Read
- AP Municipality Reservations 2026: మున్సిపల్ ఎన్నికలకు కీలక అప్డేట్.. 106 పట్టణాలకు రిజర్వేషన్లు ఖరారు.. పూర్తి జాబితా ఇదే!
- India Retail Inflation Rises: సామాన్యులకు ధరల సెగ.. సెప్టెంబర్‌లో పెరిగిన రిటైల్ ద్రవ్యోల్బణం..
- Hyderabadi Dalcha Recipe: అన్నంలోకి అదిరిపోయే సైడ్ డిష్.. ఇంట్లోనే అసలైన హైదరాబాదీ దాల్చా..
- Srisailam Reservoir: వరల్డ్ బుక్ ఆఫ్ రికార్డ్స్‌లో శ్రీశైలం జలాశయం.. దేశంలోనే తొలి ప్రాజెక్టుగా గుర్తింపు
‘2024 ఎన్నికల్లో పెద్ద ఎదురుదెబ్బ పడ్డా నిలదొక్కుకున్నాం. స్థానిక సంస్థల ఎన్నికలకు సిద్ధంగా ఉన్నాం. సీఎం చంద్రబాబు చేస్తున్న తప్పుడు పనులు అడ్డుకోవటానికి కోర్టుకు వెళ్ళాం. 44 లక్షల ఓటర్లను లిస్ట్ నుంచి తీసేసారు. లేని ఓటర్లతో ఎన్నికలకు ఎలా వెళ్తారు. మాకు ఎన్నికలంటే భయం లేదు. ఎలక్షన్ కమిషన్ క్లియర్ చేసిన తర్వాత ఎన్నికలకు సిద్ధం. జగన్ మత మార్పిడులు చేయించారు అని సాయిరెడ్డి మాట్లాడటం కరెక్ట్ కాదు. మార్చాలి అనుకుంటే ఈయనను మార్చేవారు కదా. ఇతర మతాలు అంటే వైఎస్ రాజశేఖర్ రెడ్డి, జగన్ కు గౌరవం. చంద్రబాబు అంటున్నారు అంటే అందరికీ తెలుసు.. జగన్ గురించి అన్నీ తెలిసి సాయిరెడ్డి ఎలా మాట్లాడుతారు. కేవలం అటెన్షన్ తన వైపు తిప్పుకోవడానికి ఇలా మాట్లాడుతున్నారు. ఆయనకు ఇలాంటి అవకాశం ఇవ్వకూడదు అని ఇప్పటివరకు మాట్లాడలేదు. ఇప్పటికీ రియాక్ట్ కావటం లేదు అని మళ్ళీ కొత్తగా ఇంకొక మెసేజ్ పెట్టారు. కోటరీ.. నంబర్ 1, నంబర్ 2 అంటూ బహిరంగ లేఖ రాశారు. మొత్తం నా గురించే పెట్టారు. క్రియాశీలకంగా ఉన్న వ్యక్తి అలాంటి వ్యాఖ్యలు చేస్తే పార్టీలో రాంగ్ ఇండికేషన్ పోతుంది అని మాట్లాడాల్సి వస్తుంది. నేను పదవుల గురించి ఎప్పుడూ పట్టించుకోలేదు.. పదవులు అంటే బాధ్యతగా భావించా. ఆయన కామెంట్స్ మీద అపోహలు వచ్చే అవకాశం ఉందని భావించే మాట్లాడుతున్నా. వైసీపీ ఆవిర్భావం నుంచి కర్త, కర్మ జగన్. తన తండ్రి ఆలోచనలు.. తన ఆలోచనల నుంచి వైసీపీ పుట్టింది. అడ్మినిస్ట్రేషన్ విత్ హ్యూమన్ టచ్. సమాజం అభివృద్ధి చెందటానికి అడుగులు వేశారు’ అని సజ్జల క్లారిటీ ఇచ్చారు.
తాజావార్తలు
-
India Post GDS Result 2026: జీడీఎస్ 1వ మెరిట్ లిస్ట్ విడుదల.. రాష్ట్రాల వారీగా PDF డౌన్లోడ్ చేసుకోండి
-
Jr. Doctors Protest : నెలకు రూ.5 వేలేనా? వైద్యుల ఆందోళన.. సిరిసిల్లలో ఓపీ బంద్.!
-
AP Municipality Reservations 2026: మున్సిపల్ ఎన్నికలకు కీలక అప్డేట్.. 106 పట్టణాలకు రిజర్వేషన్లు ఖరారు.. పూర్తి జాబితా ఇదే!
-
Bloody Romeo: నాని ‘బ్లడీ రోమియో’.. షూటింగ్ డేట్ ఫిక్స్!
-
Volvo EX90 India Launch: భారత్‌లో Volvo EX90 లాంచ్.. ధర రూ.1.26 కోట్లు, రేంజ్ 625 కి.మీ.!
ట్రెండింగ్
-
Prince Yadav: 6 బంతులు.. 3 ఫోర్లు.. 13 పరుగులు.. ప్రిన్స్ యాదవ్ అరుదైన రికార్డు!
-
T20 Captain Record: ధోనీ, కోహ్లీని వెనక్కి నెట్టి అరుదైన రికార్డు కొల్లగొట్టిన టీమిండియా కెప్టెన్..!
-
Ranji Trophy: బ్యాట్‌తో మోత మోగించిన రవీంద్ర జడేజా.. ఫస్ట్ క్లాస్ క్రికెట్లో 16వ సెంచరీ నమోదు..!
-
iPhone 17 Pro vs iPhone 18 Pro.. కేవలం ఈ అప్డేట్స్ కోసం కొత్త ఫోన్ అవసరమా.?
-
Arshdeep Singh: టీ20ల్లో ఇదే నాకు అసలైన ఛాలెంజ్.. అర్ష్‌దీప్ కామెంట్స్ వైరల్..!