Gadikota Srikanth Reddy: రాష్ట్ర రవాణా శాఖ మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి పై వైసీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి, మాజీ ఎమ్మెల్యే గడికోట శ్రీకాంత్ రెడ్డి తీవ్ర వ్యాఖ్యలు చేశారు. ఇష్టానుసారం ఆరోపణలు చేయడం, ప్రజల్లో ద్వేషాలు రేపేలా మాట్లాడడం సరైంది కాదని ఆయన మండిపడ్డారు. రాయచోటి అభివృద్ధి గురించి చర్చించేందుకు నేను సిద్ధంగా ఉన్నాను. మీరు అధికారులతో కలిసి రండి. నేను ఒక్కడినే వస్తా.. గత ఐదు సంవత్సరాల్లో ఏం చేశానో చూపిస్తా, అని సవాల్ విసిరారు.. తాను రేపటి తరాల కోసం పనిచేస్తానని, తొడలు కొట్టడం, మీసాలు తిప్పడం కాదు – అభివృద్ధి చేయడం ముఖ్యం అని వ్యాఖ్యానించారు.
Read Also: CM Revanth Reddy : ప్రైవేట్ ఉన్నత విద్యాసంస్థలకు సీఎం రేవంత్ వార్నింగ్..
ఇక, కూటమి ప్రభుత్వం ఏర్పడి 18 నెలలు అవుతుందని, ఈ కాలంలో మంత్రి రాంప్రసాద్ ఏం అభివృద్ధి చేశారో ప్రజల ముందు చెప్పాలని డిమాండ్ చేశారు గడికోట.. నిండు శాసనసభలో రాయచోటి గురించి ఆదోని ఎమ్మెల్యే అవమానకరంగా మాట్లాడినప్పుడు మీరు మౌనం ఎందుకు వహించారు? ఆ రోజే ఛాలెంజ్ చేయాల్సింది అని సూచించారు.. ప్రస్తుత కేబినెట్‌లో క్యాబినెట్‌లోనే జిల్లాను విభజించే యత్నాలు జరుగుతున్నాయని, దానిని ఆపేందుకు ప్రయత్నం చేయాలని సూచించారు. తొడలు కొడతాం, మీసాలు తిప్పుతాం అంటూ బెదిరించడం వల్ల ఎవరూ భయపడరు. అభివృద్ధి గురించి మాట్లాడటానికి దమ్ము అవసరం లేదు అని గడికోట శ్రీకాంత్ రెడ్డి హితవు చెప్పారు.. చివరగా ఆయన మంత్రి రాంప్రసాద్‌ను సవాల్ చేస్తూ అన్నారు.. రాయచోటి అభివృద్ధిపై చర్చకు రెడీ.. నేను వస్తా… మీరు రండి.. అభివృద్ధి పై చర్చిద్దాం అని ఛాలెంజ్ చేశారు వైసీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి, మాజీ ఎమ్మెల్యే గడికోట శ్రీకాంత్ రెడ్డి.
