క్వారీ యజమాని మనోజ్ రెడ్డి బెదిరింపు కేసులో ఎమ్మెల్యే పాడి కౌశిక్‌రెడ్డికి కాజీపేట లోని రైల్వే కోర్టు 14 రోజులు రిమాండ్ విధించింది. ఇరు వాదనలు విన్న జడ్జి నాగలీల సుస్మిత 14 రోజుల రిమాండ్ విధించారు. కౌశిక్ రెడ్డిని ఖమ్మం జైలుకు తరలించేందుకు పోలీసులు ఏర్పాట్లు చేస్తున్నారు. పటిష్ట భద్రత నడుమ కౌశిక్ రెడ్డిని ఖమ్మం తరలించనున్నారు. అర్ధరాత్రి అరెస్ట్ అనంతరం.. ఉదయం నుంచి సుబేదారి పిఎస్ దగ్గర హైడ్రామా కొనసాగతోంది.
న్యాయమూర్తి ముందు తన ఆవేదన వ్యక్తం చేశారు పోసాని కృష్ణమురళి... తాను మాట్లాడిన మాటలు వాస్తవమేనని అంగీకరించారు పోసాని కృష్ణమురళి. తన భార్యను దూషించిన బాధతోనే తాను అలా తిట్టాల్సి వచ్చిందన్నారు. తన భార్యను దూషించిన వీడియోలు కట్ చేసి.. తాను మాట్లాడినవి మాత్రమే చూపించారని న్యాయమూర్తి ముందు ఆవేదన వ్యక్తం చేశారాయన.
గన్నవరం మాజీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీకి 14 రోజుల రిమాండ్ రిమాండ్ విధించింది కోర్టు. వంశీతో పాటు కేసులో నిందితులుగా ఉన్న లక్ష్మీపతి, కృష్ణప్రసాద్‌కు కూడా 14 రోజుల రిమాండ్ విధించారు న్యాయమూర్తి. దీంతో విజయవాడ సబ్ జైలుకు తరలించారు.
పాల్వంచలో రామకృష్ణ కుటుంబం ఆత్మహత్య కేసులో కొత్తగూడెం ఎమ్మెల్యే వనమా వెంకటేశ్వరరావు కుమారుడు వనమా రాఘవకు కోర్టు 14 రోజుల రిమాండ్ విధించింది. ఈ కేసులో వనమా రాఘవను శుక్రవారం రాత్రి అరెస్ట్ చేసిన పోలీసులు శనివారం మధ్యాహ్నం కొత్తగూడెం మెజిస్ట్రేట్ ముందు హాజరుపరిచారు. విచారణ అనంతరం కోర్టు 14 రోజుల జ్యుడిషియల్ రిమాండ్ విధించడంతో పోలీసులు అతడిని భద్రాచలం సబ్‌జైలుకు తరలించారు. Read Also: రామకృష్ణ మరో సంచలన సెల్ఫీ వీడియో కాగా రామకృష్ణ సెల్ఫీ…
సీఎం జగన్‌ను అసభ్యపదజాలంతో దూషించిన కేసులో టీడీపీ నేత పట్టాభిరామ్‌కు విజయవాడ 3వ అదనపు చీఫ్ మెట్రోపాలిటన్ కోర్టు 14 రోజుల రిమాండ్ విధించింది. గురువారం మధ్యాహ్నం పట్టాభిని పోలీసులు కోర్టులో హాజరుపరచగా.. న్యాయమూర్తి నవంబర్ 2 వరకు రిమాండ్ విధిస్తున్నట్లు తీర్పు వెల్లడించారు. ఈ సందర్భంగా పట్టాభి తన వాదనలను న్యాయమూర్తికి వినిపించారు. తాను ఎవరినీ వ్యక్తిగతంగా దూషించలేదని… ప్రభుత్వంలో ఉన్న లోపాలనే ప్రస్తావించానని తెలిపారు. తన ఇంటిపై వైసీపీ కార్యకర్తలు అనేకసార్లు దాడి చేశారని…