వైసీపీ ఐదేళ్ల పాలనలో వేల ఎకరాలు భూదందా చేశాడనే ఆరోపణలు ఎదుర్కొంటున్నారు మాజీ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి.. అన్న మయ్య జిల్లా మదనపల్లె శివారులోని బీకే పల్లెలో ప్రభుత్వ భూమిని కబ్జా చేసిన విషయం వెలుగులోకి వచ్చింది. జిల్లా కలెక్టర్ శ్రీధర్ చామకూరి ఆధ్వర్యంలో రెవెన్యూ అధికారులు సర్వే చేసి కబ్జా అయిన భూమిని స్వాధీనం చేసుకున్నారు