తిరుపతి, చిత్తూరు ప్రాంతాల్లో ఈ మధ్య క్షుద్రపూజలు ఎక్కువయ్యాయి.. మూఢనమ్మకాల తో జనాలు ఇలాంటి పనులు చేస్తూ తప్పులు చేస్తున్నారు. మొన్న మదన పల్లి ఘటన మరువక ముందే ఇప్పుడు మరో ఘటన వెలుగు చూసింది.. తిరుపతి ప్రముఖ యూనివర్సిటీలో క్షుద్రపూజలు కలకలం రేపుతున్నాయి.. ఆ ఘటనతో విద్యార్థులు భయంతో వణికి పోతున్నారు.. ఈ ఘటన ప్రముఖ యూనివర్సిటీ ఎస్వియు లో వెలుగు చూసింది.. తిరుపతిలోని శ్రీ వెంకటేశ్వర విశ్వవిద్యాలయంలో క్షుద్రపూజలు జరిగిన ఆనవాళ్లు కనిపించాయి. ఈ యూనివర్సిటీలో లైబ్రరీ భవనం సమీపంలోని చౌరస్తాలో క్షుద్రపూజలు చేసినట్టుగా సమాచారం..
ముగ్గు, పుర్రె బొమ్మలు కనిపించాయి. అంతేకాదు, పసుపు, కుంకుమలు కూడా వేసినట్టు కనిపించింది. రాత్రిపూట ఇక్కడ ముగ్గు సున్నం, ఉప్పు, బొగ్గుపొడి తో ముగ్గు వేసినట్టుగా, రక్తం, కోడిగుడ్లతో పూజలు చేసినట్టుగా అనుమానిస్తున్నారు. ఎస్‌వీ యూనివర్సిటీలో ప్రాంగణంలో సీసీ కెమెరాలు సరిగా పని చేయడం లేవు. అలాగే, బలమైన సెక్యూరిటీ కూడా లేదు. దీంతో ఇలాంటి ఘటనలకు పాల్పడినట్లు తెలుస్తుంది.. ఎవరో తెలిసిన వాళ్ళే విద్యార్థులను భయపెట్టడానికి చేశారనే వార్తలు వైరల్ అవుతున్నాయి..
అంత పెద్ద యూనివర్సిటీ లో ఇలా మూఢనమ్మకాలు జరగడం ఇదే మొదటిసారి అంటున్నారు విద్యార్థులు.. అయితే ఈ మధ్య కాలంలో యూనివర్సిటీ పరిసరాలు.. అసాంఘిక కార్యకలాపాలకు అడ్డగా మారిపోయాయని విద్యార్థి సంఘాల నేతలు, సభ్యులు తీవ్ర ఆరోపణలు చేస్తున్నారు. ప్రాంగణంలో ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా ఉండటానికి సీసీ కెమెరాలను సరి చేయాలని, ఏర్పాటు చేయాలని డిమాండ్ చేశారు. అలాగే, సెక్యూరిటీ గార్డుల సంఖ్యనూ పెంచాలని విద్యార్థులు, వారి తల్లి దండ్రులు కోరుతున్నారు.. ఈ ఘటన పై కేసు నమోదు చేసుకున్న పోలీసులు క్లూస్ టీమ్ ద్వారా నిందితులను పట్టుకొని పనిలో ఉన్నారు.. ఇది ఎవరో కావాలనే చేశారని కొందరు ఆరోపిస్తున్నారు.. ఏది ఏమైనా ఈ ఘటన పై పూర్తి వివరాలు తెలిసే వరకు వెయిట్ చెయ్యాల్సిందేనని విద్యార్థులు భావిస్తున్నారు..