ఆంధ్రప్రదేశ్ ప్రకాశం జిల్లాలో ప్రైవేట్ బస్సులో మంటలు చెలరేగాయి.. ఒక్కసారిగా మంటలు చెలరేగడం తో ప్రయాణికులు భయబ్రాంతులకు గురైయ్యారు.. జిల్లాలోని జరుగుమల్లి మండలం బిట్రగుంట జాతీయ రహదారిపై ఓ ప్రవేట్ ట్రావెల్ బస్సులో షార్ట్ సర్క్యూట్ వల్ల మంటలు చెలరేగాయి. బస్సు లో ముందు పొగలు రావడంతో వాటిని గమనించిన డ్రైవర్ ప్రయాణికులను దిగిపోవాలంటూ అప్రమత్తం చేశారు.
ఘోర బస్సు అగ్ని ప్రమాదం తప్పింది. ఈ ప్రమాదం వల్ల ఎవరికి ఎటువంటి ప్రమాదం జరగలేదని తెలుస్తుంది.. మంటలు అంటుకున్న వెంటనే డ్రైవర్ అప్రమత్తతతో ప్రాణాపాయం తప్పింది.. ఈ ప్రమాదం జరిగిన సమయంలో బస్సులో సుమారు 25 మందికి పైగా ప్రయాణికులు ఉన్నారు. డ్రైవర్ అప్రమత్తత తో పెను ప్రమాదం తప్పింది..
వివరాల్లోకి వెళితే.. మోజో ట్రావెల్ బస్సు హైదరాబాద్ నుండి పాండిచ్చేరి వెళ్తుండగా మార్గంమధ్యంలో ప్రకాశం జిల్లా జరుగుమల్లి మండలం బిట్ర గుంట వద్ద కు రాగానే మంటలు వ్యాపించాయి.. బస్సు ఇంజన్ నుంచి పొగలు రావడం తో డ్రైవర్ గమనించారు.. వెంటనే బస్సును ఆపి ప్రయాణికులను హెచ్చరించారు.. సమాచారం అందుకున్న ఫైర్ సిబ్బంది హుటాహుటిన ఘటానా స్థలానికి చేరుకుని ఫైర్ ఇంజన్లతో మంటలను అదుపు చేశారు. ట్రావెల్ బస్సు పూర్తిగా దగ్ధమైంది.. ఈ ప్రమాదంలో ప్రయాణికుల లగేజ్ కాలిపోయింది.. జరుగుమల్లి పోలీసులు ఇతర ట్రావెల్స్ బస్సులను రప్పించి ప్రయాణికులను తమ గమ్యస్థానాలకు పంపించారు. ప్రయాణికుల్లో హైదరాబాద్ కు చెందిన కొంత మంది తెలుగువారు కూడా ఉన్నారు. ఈ ఘటనపై పూర్తి సమాచారం తెలియాల్సి ఉంది.. ప్రైవేట్ ట్రావెల్ బస్సుల్లో ఇలాంటి ప్రమాదాలు జరగడం కామన్ అయ్యింది.. నాణ్యత లేని, కండిషన్ బాగాలేని బస్సులను ఉపయోగించడం వల్లే ఇలాంటి ప్రమాధాలు జరుగుతున్నాయి.. ఏపీ లో గత కొద్ది రోజులుగా ఇలాంటి ప్రమాదాలు జరుగుతూనే ఉన్నాయి.. ఇప్పుడు మరో ఘటన జరగడంతో జనాలు ప్రయాణాలు అంటే భయపడుతున్నారు..ఇలాంటి బస్సులను తనిఖీ చేసి సీజ్ చెయ్యాలని డిమాండ్ చేస్తున్నారు..