కరోనా మహమ్మారి కారణంగా అనాథలైన చిన్నారులను ఆదుకోవడానికి కీలక నిర్ణయం తీసుకుంది ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం… అనాథలుగా మారిన చిన్నారులకు రూ.10 లక్షల చొప్పున ఎక్స్‌గ్రేషియా ఇవ్వాలని ఇప్పటికే నిర్ణయం తీసుకున్నారు సీఎం వైఎస్ జగన్.. అయితే, దీనికి సంబంధించిన విధి విధానాలు ఖరారు చేస్తూ ఉత్తర్వులు జారీ చేసింది ప్రభుత్వం.. కరోనా వల్ల 18 ఏళ్లు లోపు పిల్లలు అనాథలైతే ఎక్స్ గ్రేషియా వర్తింపజేయాలని నిర్ణయించారు. తల్లిదండ్రులిద్దరినీ కోల్పోయిన చిన్నారులకు ఈ ఎక్స్ గ్రేషియా చెల్లించనుండగా.. అల్పాదాయ…