కేఆర్ఎంబీకి ఏపీ మరో లేఖ.. తెలంగాణను నిలువరించండి..!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల మధ్య జల వివాదాలు కొనసాగుతూనే ఉన్నాయి.. ఏపీపై తెలంగాణ… తెలంగాణపై ఏపీ.. ఇలా ఫిర్యాదుల పర్వానికి ఇప్పట్లో తెరపడేలా కనిపించడంలేదు.. తాజాగా కృష్ణా నది యాజమాన్య బోర్డు మెంబర్ సెక్రటరీకి లేఖ రాశారు ఏపీ ఇరిగేషన్ ఈఎన్సీ నారాయణరెడ్డి.. సాగునీటి అవసరాల కోసం ఆంధ్రప్రదేశ్ ఇండెంట్ లేకుండా తెలంగాణ చేస్తున్న విద్యుత్ ఉత్పత్తిని నిలువరించాలంటూ కేఆర్ఎంబీకి రాసిన లేఖలో పేర్కొన్నారు. శ్రీశైలం , నాగార్జున సాగర్ ఉమ్మడి ప్రాజెక్టులుగా ఉన్నందున కేఆర్ఎంబీ అనుమతితో పాటు సాగునీటి అవసరాల కోసం ఏపీ ఇండెంట్ ఉంటేనే విద్యుత్ ఉత్పత్తికి అస్కారం ఉందన్న ఏపీ.. ఈ రెండు ఉమ్మడి ప్రాజెక్టుల నుంచి తెలంగాణ ఏకపక్షంగా విద్యుత్ ఉత్పత్తి చేయలేదని స్పష్టం చేసింది.
ఇక, శ్రీశైలం, నాగార్జున సాగర్, పులిచింతల ప్రాజెక్టుల నుంచి నీటిని విడుదల చేసి తెలంగాణ విద్యుత్ ఉత్పత్తి చేసుకోవడాన్ని నిలువరించాల్సిందిగా కేఆర్ఎంబీని కోరింది ఆంధ్రప్రదేశ్.. కృష్ణా డెల్టాలో నీటి అవసరాలపై ఏపీ ఇండెంట్ ఇస్తేనే ఉమ్మడి ప్రాజెక్టుల నుంచి నీటిని విడుదల చేయాల్సిందిగా కేఆర్ఎంబీకి విజ్ఞప్తి చేసింది.. రాష్ట్ర విభజన అనంతరం నాగార్జునసాగర్, పులిచింతల ప్రాజెక్టుల్లో విద్యుత్ ఉత్పత్తి స్టేషన్లు భౌగోళికంగా తెలంగాణ భూభాగంలో ఉండిపోయాయని స్పష్టం చేసింది.. ఈ రెండు ప్రాజెక్టుల నుంచి కృష్ణా డెల్టా సాగునీటి అవసరాలకు నీటి విడుదల యాధృశ్చికమని పేర్కొన్న ఏపీ ఈఎస్సీ… తెలంగాణ రాష్ట్రానికి ఈ రెండు ప్రాజెక్టుల దిగువన తాగు, సాగునీటి అవసరాలేమీ లేవని లేఖలో రాసుకొచ్చింది. నాగార్జున సాగర్ దిగువన ఏపీకి సాగునీటి అవసరాలు ఉంటేనే నీటిని విడుదల చేసి ఉభయ రాష్ట్రాలు విద్యుత్ ను వినియోగించుకోవాల్సి ఉంటుందని లేఖలో పేర్కొన్నారు ఏపీ ఇరిగేషన్ ఈఎన్సీ నారాయణరెడ్డి.
Also Read
- Free Flight Journey: వారికి భారీ శుభవార్త చెప్పిన ఏపీ ప్రభుత్వం.. ఒక రోజు ఉచిత విమాన ప్రయాణం..
- Gold In Bag: అలిపిరిలో దొరికిన బంగారం బ్యాగ్.. సీసీటీవీ పరిశీలించిన అధికారులు..
- Pawan Kalyan: పవన్ కళ్యాణ్ ఆదేశాలతో.. మన్యం జిల్లాకు రెండు కుంకీ ఏనుగులు..
- Ambati Rambabu: నా దిష్టిబొమ్మ తగలబెడితే గడ్డి కాలడం తప్ప నాకేం కాదు: అంబటి రాంబాబు
తాజావార్తలు
-
CKYC: బ్యాంకు కస్టమర్స్ కు అలర్ట్.. మీ CKYC నంబర్ తెలుసా?.. ఇలా తెలుసుకోండి
-
Jana Nayagan : విజయ్ ముందు భారీ టార్గెట్స్.. ఫస్ట్ డే వసూళ్లలో రజనీకాంత్ డామినేట్
-
Astrology: జూలై 22 బుధవారం దినఫలాలు.. ఈ రాశివారికి అనుకోని శుభవార్త..!
-
Shamshabad : ఇండిగో ఉద్యోగినిపై క్యాబ్ డ్రైవర్ అత్యాచారయత్నం..!
-
Free Flight Journey: వారికి భారీ శుభవార్త చెప్పిన ఏపీ ప్రభుత్వం.. ఒక రోజు ఉచిత విమాన ప్రయాణం..
ట్రెండింగ్
-
Cleaning Hacks : తుప్పు పట్టిన ఇనుప అల్మారా కొత్తదానిలా మెరవాలా? ఈ 4 చిట్కాలు చాలు.!
-
Remote Cleaning : వర్షాల్లో టీవీ రిమోట్ పనిచేయడం లేదా? ఈ 4 ట్రిక్స్‌తో కొత్తదానిలా మారుతుంది.!
-
Food Storage Tips : వంట నూనె ఇలా నిల్వ చేస్తే విషమే.! ఈ 5 సంకేతాలు కనిపిస్తే వెంటనే పారేయండి
-
Kitchen Tips : పుట్టగొడుగులు 2 రోజుల్లో పాడవుతున్నాయా? ఈ సీక్రెట్ ట్రిక్‌తో వారాల పాటు ఫ్రెష్.!
-
Sanju Samson: రోహిత్ భాయ్ సారీ.. నిన్ను నేను నమ్మలేదు.. సంజు ఆసక్తికర వ్యాఖ్యలు!