AP Local Body Elections: ఏపీ స్థానిక ఎన్నికలపై మరో పిటిషన్..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
AP Local Body Elections: ఆంధ్రప్రదేశ్లో స్థానిక సంస్థల ఎన్నికల హీట్ కొనసాగుతోంది.. ఇదే సమయంలో కోర్టుల్లో పిటిషన్లు కూడా దాఖలు అవుతున్నాయి.. తాజాగా, స్థానిక సంస్థల ఎన్నికలకు సంబంధించి నామినేషన్ల ప్రక్రియపై హైకోర్టులో మరో పిటిషన్ దాఖలైంది. మున్సిపాలిటీలు, కార్పొరేషన్ల ఎన్నికల్లో అభ్యర్థుల నామినేషన్లు ఆన్లైన్లో దాఖలు చేసే విధానాన్ని అమలు చేయడం లేదని పిటిషనర్ గురు తేజ న్యాయస్థానాన్ని ఆశ్రయించారు. ఈ విధానాన్ని అందుబాటులోకి తీసుకురావాలని రాష్ట్ర ఎన్నికల సంఘం (SEC)ను ఆదేశించాలని పిటిషన్లో కోరారు.
ఆన్లైన్ నామినేషన్ విధానం అమలు చేయడం లేదని పిటిషన్
స్థానిక సంస్థల ఎన్నికల్లో అభ్యర్థుల నామినేషన్లు, అఫిడవిట్లను ఆన్లైన్లో అందుబాటులో ఉంచాలని సుప్రీంకోర్టు ఆదేశాలు ఉన్నాయని పిటిషనర్ పేర్కొన్నారు. అయితే, ఆ ఆదేశాలను రాష్ట్ర ఎన్నికల సంఘం అమలు చేయడం లేదని ఆరోపించారు. మున్సిపాలిటీలు, కార్పొరేషన్ల ఎన్నికల్లో ఆన్లైన్ నామినేషన్ విధానం అమలు చేయడం లేదని తన పిటిషన్లో వివరించారు. అంతే కాదు.. ఆన్లైన్ నామినేషన్ విధానం అమలు చేయకపోవడం వల్ల ఈ ఎన్నికల సమయంలో 187 గొడవలు చోటుచేసుకున్నాయని పిటిషనర్ పేర్కొన్నారు. మున్సిపల్, కార్పొరేషన్ ఎన్నికల్లో జరిగిన గొడవలు, హింసకు సంబంధించిన ఫొటోలను కూడా న్యాయస్థానానికి సమర్పించినట్లు తెలిపారు. రాబోయే పంచాయతీ ఎన్నికల్లోనైనా ఇలాంటి వివాదాలు, ఘర్షణలు జరగకుండా ఉండేందుకు ఆన్లైన్ నామినేషన్ విధానాన్ని అమలు చేయాలని కోరారు.
Also Read
- Arnab Cyclone Alert: అర్నబ్ తుఫాన్ బీభత్సం.. గంటకు 140 కి.మీ. వేగంతో గాలులు! 15 జిల్లాలకు భారీ వర్ష సూచన
- Arnab Cyclone Alert: దూసుకొస్తున్న అర్నబ్ తుఫాన్.. రెండు రోజులు విద్యాసంస్థలకు సెలవు..
- Weather Update : బుధవారం ఉదయానికి అతి తీవ్ర తుఫాను.. లేటెస్ట్ అప్డేట్
- CM Chandrababu : అర్నబ్ తుఫాను ప్రభావంపై సీఎం చంద్రబాబు సమీక్ష
ఆన్లైన్ విధానానికి సిద్ధమని గతంలోనే చెప్పిన SEC
అయితే, 2025 మే నెలలోనే ఆన్లైన్ నామినేషన్ విధానాన్ని అమలు చేసేందుకు సిద్ధంగా ఉన్నామని రాష్ట్ర ఎన్నికల సంఘం ప్రభుత్వానికి తెలిపినట్లు పిటిషనర్ తన వాదనల్లో పేర్కొన్నారు. అయినప్పటికీ, ఈ విధానం అమలులోకి రాలేదని కోర్టు దృష్టికి తీసుకెళ్లారు. అభ్యర్థుల నామినేషన్లు, అఫిడవిట్లు ఆన్లైన్లో అందుబాటులో ఉండేలా చర్యలు తీసుకోవాలని, సుప్రీంకోర్టు ఆదేశాలను అమలు చేసేలా SECకు ఆదేశాలు జారీ చేయాలని అభ్యర్థించారు. ఇక, ఈ వ్యవహారంపై దాఖలైన లంచ్ మోషన్ పిటిషన్పై రేపు విచారణ చేపడతామని ఆంధ్రప్రదేశ్ హైకోర్టు తెలిపింది. స్థానిక సంస్థల ఎన్నికల్లో ఆన్లైన్ నామినేషన్ విధానం అమలుపై దాఖలైన ఈ పిటిషన్పై విచారణ అనంతరం న్యాయస్థానం ఏ విధమైన నిర్ణయం తీసుకుంటుందనేది ఆసక్తికరంగా మారింది.
తాజావార్తలు
-
Software Jobs: ఉద్యోగంలో ఉంటే గ్రోత్ లేదు, మానేస్తే జాబ్ దొరకదు.. అగమ్యగోచరంగా సాఫ్ట్వేర్ ఉద్యోగాలు..
-
Jayammu Nishchayammu Raa: బాలయ్యకు కూడా ఆ ఒక్కరంటే గజగజ.. అసలు సీక్రెట్ లీక్ చేసిన నారా లోకేశ్!
-
Srinidhi Shetty: ‘ఆదర్శ కుటుంబం’ డైలాగులు గూస్బంప్స్ తెప్పిస్తాయి
-
AP Local Body Elections: ఏపీ స్థానిక ఎన్నికలపై మరో పిటిషన్..
-
Eagle Force: హైదరాబాద్లో ఈగిల్ ఫోర్స్ మెరుపు దాడి.. 75 ఏళ్ల వృద్ధురాలు అరెస్ట్
ట్రెండింగ్
-
Masoor Dal Face Pack : పండగ వేళ ముఖానికి మెరుపు.. మసూర్ దాల్తో ఇలా
-
Google Jobs: గూగుల్లో ఉద్యోగం కావాలా? ఈ సీనియర్ రిక్రూటర్ చెప్పిన ట్రిక్స్ పాటించండి..
-
200MP డ్యూయల్ కెమెరా, 8,000mAh బ్యాటరీతో Oppo Find X10 ఫారెస్ట్ గ్రీన్ ఎడిషన్ లాంచ్..!
-
Devdutt Padikkal: ఒక్క పరుగు తేడాతో డబుల్ సెంచరీ మిస్.. అంపైర్ వివాదాస్పద నిర్ణయానికి దేవదత్ పడిక్కల్ బలి.!
-
Char Dham Yatra Closing Dates: చార్ధామ్ వెళ్లే భక్తులకు అలెర్ట్.. ఆ తేదీ నుండే మూతపడనున్న ఆలయాల తలుపులు..!