The Traitors: అరుపులు లేవు.. సైలెంట్‌గా వెన్నుపోటే!.. చర్చనీయాంశంగా ‘ది ట్రైటర్స్’
- Follow Us :
-
-
Add as a preferred
source on google
తెలుగు రియాలిటీ షోల ట్రెండ్‌లో ఇప్పుడు సరికొత్త వార్ నడుస్తోంది. ఒకవైపు గొడవలు, అరుపులు, గ్రూప్ పాలిటిక్స్‌తో ‘బిగ్ బాస్ తెలుగు 10’ ప్రేక్షకులను ఎంగేజ్ చేస్తుంటే.. దానికి ఏమాత్రం తీసిపోని స్థాయిలో అమెజాన్ ప్రైమ్ వీడియోలో స్ట్రీమింగ్ అవుతున్న షో ‘ది ట్రైటర్స్ తెలుగు’. ఫిజికల్ టాస్కులు, మాటల యుద్ధాలు లేకుండా కేవలం సైకలాజికల్ మైండ్ గేమ్‌తో ఆడుతున్న ఈ షో ఇప్పుడు ప్రేక్షకుల్లో విపరీతమైన క్యూరియాసిటీని రేకెత్తిస్తోంది. తేజ సజ్జా హోస్ట్ చేస్తున్న ఈ షోలో 20 మంది సెలబ్రిటీలు ఒకే ప్యాలెస్‌లో ఉంటారు. వీరిలో ఎవరు అమాయకులు (ఇన్నోసెంట్స్), ఎవరు ద్రోహులు (ట్రైటర్స్) అనేది కనిపెట్టడమే అసలైన గేమ్. కోటి ప్రైజ్ మనీ కోసం ఆడుతున్న ఈ ఆటలో ఏ క్షణాన ఎవరు ఎవరిని మోసం చేస్తారో ఊహించడం కష్టం. బిగ్ బాస్‌లో శత్రుత్వం ఓపెన్‌గా కనిపిస్తే.. ట్రైటర్స్‌లో పక్కనే ఉండి స్నేహితుల్లా నటిస్తూనే ఆటలోంచి తప్పించడం ఈ షో స్పెషాలిటీ.
ఇప్పటికే విడుదలైన 6 ఎపిసోడ్స్ షోపై అంచనాలను అమాంతం పెంచేశాయి. ఆశికాపై అనుమానాలు రేకెత్తడం, విద్యు చేసిన ప్లాన్స్, ఏకగ్రీవంగా విష్ణు ఎలిమినేట్ అవ్వడం లాంటివి ఎంతో ఉత్కంఠగా సాగాయి. మరీ ముఖ్యంగా ‘రహత్’ చుట్టూ అల్లిన ఉచ్చు గేమ్‌లో బిగ్గెస్ట్ హైలైట్. రహత్‌ను శ్రావ్య పదేపదే ప్రశ్నించి కార్నర్ చేయడం, చివరకు అతను షో నుంచి ఎలిమినేట్ అవ్వడంతో పాటు తానొక ‘ట్రైటర్’ అని బయటపడటంతో ఆట సరికొత్త మలుపు తిరిగింది. రహత్ ఎలిమినేషన్‌తో ఇప్పుడు మిగిలిన ఆ ట్రైటర్స్ ఎవరనే దానిపై సర్వత్రా ఉత్కంఠ నెలకొంది. బయటకు అమాయకంగా కనిపిస్తున్న వారిలో అసలు ప్రమాదం ఎక్కడుందోనని కంటెస్టెంట్లతో పాటు ప్రేక్షకులు కూడా బుర్రలు బద్దలు కొట్టుకుంటున్నారు. మిగిలిన ట్రైటర్స్ పైచేయి సాధిస్తారా? లేక ఇన్నోసెంట్స్ వారిని పసిగట్టి ఎలిమినేట్ చేస్తారా? అనేది తెలియాలంటే ప్రతి గురువారం ప్రైమ్ వీడియోలో వచ్చే కొత్త ఎపిసోడ్స్ చూడాల్సిందే.
Also Read
- Nayanthara: హీరోలకే సాధ్యమైన చోట నయనతార సరికొత్త చరిత్ర.. రెజీనా కామెంట్స్ వైరల్!
- Jayammu Nishchayammu Raa: బాలయ్యకు కూడా ఆ ఒక్కరంటే గజగజ.. అసలు సీక్రెట్ లీక్ చేసిన నారా లోకేశ్!
- Srinidhi Shetty: 'ఆదర్శ కుటుంబం' డైలాగులు గూస్బంప్స్ తెప్పిస్తాయి
- Srinidhi Shetty: వెంకటేష్ కామెడీ టైమింగ్‌ను మ్యాచ్ చేయడం నా వల్ల కాలేదు
తాజావార్తలు
-
The Traitors: అరుపులు లేవు.. సైలెంట్‌గా వెన్నుపోటే!.. చర్చనీయాంశంగా ‘ది ట్రైటర్స్’
-
Nayanthara: హీరోలకే సాధ్యమైన చోట నయనతార సరికొత్త చరిత్ర.. రెజీనా కామెంట్స్ వైరల్!
-
Indoor Play Ideas : దీపావళి వేళ.. బయట కాలుష్యం.. ఇంట్లోనే పిల్లలకు 7 సరదా ఆటలు.!
-
Software Jobs: ఉద్యోగంలో ఉంటే గ్రోత్ లేదు, మానేస్తే జాబ్ దొరకదు.. అగమ్యగోచరంగా సాఫ్ట్వేర్ ఉద్యోగాలు..
-
Jayammu Nishchayammu Raa: బాలయ్యకు కూడా ఆ ఒక్కరంటే గజగజ.. అసలు సీక్రెట్ లీక్ చేసిన నారా లోకేశ్!
ట్రెండింగ్
-
Masoor Dal Face Pack : పండగ వేళ ముఖానికి మెరుపు.. మసూర్ దాల్‌తో ఇలా
-
Google Jobs: గూగుల్‌లో ఉద్యోగం కావాలా? ఈ సీనియర్ రిక్రూటర్ చెప్పిన ట్రిక్స్ పాటించండి..
-
200MP డ్యూయల్ కెమెరా, 8,000mAh బ్యాటరీతో Oppo Find X10 ఫారెస్ట్ గ్రీన్ ఎడిషన్ లాంచ్..!
-
Devdutt Padikkal: ఒక్క పరుగు తేడాతో డబుల్ సెంచరీ మిస్.. అంపైర్ వివాదాస్పద నిర్ణయానికి దేవదత్ పడిక్కల్ బలి.!
-
Char Dham Yatra Closing Dates: చార్ధామ్ వెళ్లే భక్తులకు అలెర్ట్.. ఆ తేదీ నుండే మూతపడనున్న ఆలయాల తలుపులు..!