CM YS Jagan Vizag Tour: రేపు విశాఖకు సీఎం జగన్.. పూర్తి షెడ్యూల్ ఇదే..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
CM YS Jagan Vizag Tour: ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్‌రెడ్డి రేపు విశాఖపట్నంలో పర్యటించనున్నారు.. శ్రీ శారదా పీఠం వార్షికోత్సవంలో పాల్గొననున్నారు.. ఆ తర్వాత పలు శుభకార్యాల్లో పాల్గొనబోతున్నారు ఏపీ సీఎం.. ఇక, సీఎం వైఎస్ జగన్ విశాఖపట్నం పర్యటనకు సంబంధించిన పూర్తి షెడ్యూల్‌ను ఓసారి పరిశీలిస్తే.. రేపు ఉదయం అంటే 28వ తేదీన ఉదయం 9.15 గంటలకు తాడేపల్లిలోని నివాసం నుంచి బయలుదేరి ఉదయం 10.30 గంటలకు విశాఖపట్నం చేరుకుంటారు సీఎం.. అక్కడినుంచి నేరుగా చినముషిడివాడలోని శ్రీ శారదా పీఠానికి ఉదయం 11 గంటలకు చేరుకోనున్న ఆయన.. శారదా పీఠం వార్షికోత్సవ కార్యక్రమాలలో పాల్గొంటారు. ఇక, మధ్యాహ్నం 12.30 గంటలకు అక్కడి నుంచి బయలుదేరి అక్కయ్యపాలెం సాగరమాల కన్వెన్షన్ హాల్‌లో జరగనున్న అనకాపల్లి ఎంపీ బి. సత్యవతి కుమారుడు డాక్టర్ యశ్వంత్, డాక్టర్ లీలా స్రవంతి వివాహానికి హాజరై.. దంపతులను ఆశీర్వదిస్తారు. ఆ తర్వాత మధ్యాహ్నం 1.30 గంటలకు రుషికొండ ఐటీ పార్క్ వద్ద గల విశాఖ ఎంపీ సత్యనారాయణ నివాసానికి వెళ్లనున్న ఆయన.. ఎంపీ కుమారుడు శరత్ చౌదరి, జ్ఞానిత దంపతులకు శుభాకాంక్షలు తెలియజేసి, ఆశీర్వదిస్తారు. అక్కడి నుంచి మధ్యాహ్నం 1.55 గంటలకు ఐపీఎస్ అధికారి విద్యాసాగర్ నాయుడు, భవ్య దంపతులను వారి నివాసంలో ఆశీర్వదిస్తారు… దీంతో.. సీఎం విశాఖ పర్యటన ముగియనుంది.. ఆ తర్వాత విశాఖ నుంచి బయల్దేరి సాయంత్రం 4 గంటలకు తిరిగి తాడేపల్లిలోని తన నివాసానికి చేరుకుంటారు ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్‌రెడ్డి.
Read Also: Nandamuri Taraka Ratna: నిలకడగా తారకరత్న ఆరోగ్యం.. స్టెంట్ వేసిన వైద్యులు
Also Read
- CM Chandrababu: స్థానిక ఎన్నికలకు సిద్ధం కండి.. కూటమిలో గ్యాప్ వద్దు.. అభ్యర్థుల ఎంపికపై చంద్రబాబు కీలక వ్యాఖ్యలు
- OTR: మేయర్ సీటుపై కమ్మ, కాపు సామాజిక వర్గాల మధ్య కోల్డ్ వార్
- Deputy CM Pawan Kalyan: గోదావరి కాలుష్యంపై సమగ్ర అధ్యయనం.. పవన్ కల్యాణ్ కీలక ఆదేశాలు
- OTR : గంటా గేమ్ మారిందా..? భీమిలి సీటు వదులుకునేందుకు సిద్ధమా..?
తాజావార్తలు
-
CM Chandrababu: స్థానిక ఎన్నికలకు సిద్ధం కండి.. కూటమిలో గ్యాప్ వద్దు.. అభ్యర్థుల ఎంపికపై చంద్రబాబు కీలక వ్యాఖ్యలు
-
Off The Record: కేసీఆర్ సీఎం అయ్యాకే అసెంబ్లీకి వస్తారా..?
-
Nitin Gadkari: ట్రాఫిక్ రూల్స్ ఉల్లంఘిస్తే లైసెన్స్ రద్దు.. గడ్కరీ కీలక ప్రకటన
-
Trump: ముదురుతోన్న అమెరికా-కెనడా వాణిజ్య యుద్ధం.. కార్నీపై ట్రంప్ ఆగ్రహం
-
Konda Surekha : కొండా సురేఖకు ఫైనల్ షాక్.. బర్తరఫ్కు గవర్నర్ ఓకే..
ట్రెండింగ్
-
243 కి.మీ రేంజ్, 90 కి.మీ టాప్ స్పీడ్.. రూ.1.10 లక్షలకే Simple Wave ఎలక్ట్రిక్ స్కూటర్ లాంచ్..!
-
Rohit Sharma Retirement: రిటైర్మెంట్కు అంగీకరించిన రోహిత్ శర్మ.. సంచలన రిపోర్ట్!
-
6 రోజుల బ్యాటరీ, 24 గంటల బీపీ మానిటరింగ్.. HUAWEI WATCH D3 లాంచ్.!
-
204hp పవర్, 480Nm టార్క్.. 7-సీటర్ SUVగా రీఎంట్రీ ఇవ్వబోతున్న Mitsubishi Pajero.!
-
7050mAh బ్యాటరీ, 144Hz AMOLED డిస్ప్లే, 50MP సోనీ కెమెరాతో VIVO T5 ఫోన్ లాంచ్!