YSRCP: మీ ప్రేమ ఇలాగే కొనసాగాలి.. ఆసక్తి రేపుతున్న సీఎం జగన్ ట్వీట్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ఏపీలో వైసీపీ ప్రభుత్వం ఏర్పడి నేటితో మూడేళ్లు పూర్తవుతోంది. ఈ సందర్భంగా ట్విట్టర్లో సీఎం జగన్ ట్వీట్ చేశారు. ‘మీరు చూపిన ప్రేమ, మీరు అందించిన ఆశీస్సులతో ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టి మూడేళ్లు అవుతోంది. మీరు నాపై పెట్టుకున్న నమ్మకాన్ని నిలబెట్టుకుంటూ గడిచిన మూడేళ్లలో 95శాతానికి పైగా హామీలను అమలు చేశాం. ఎన్నో మంచి పనులకు శ్రీకారం చుట్టాం. రాబోయే రోజుల్లో మీకు మరింతగా సేవ చేస్తానని, మీ ప్రేమాభిమానాలు నాపై ఎప్పటికీ ఇలాగే ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. మీకు సేవ చేసే భాగ్యాన్ని నాకు కల్పించినందుకు మరొక్కసారి అందరికీ కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నా’ అంటూ జగన్ తన ట్వీట్లో పేర్కొన్నారు.
Andhra Pradesh: వైసీపీ ప్రభుత్వానికి నేటితో మూడేళ్లు పూర్తి
Also Read
- Vijaya Dairy Election: విజయ డెయిరీ ఎన్నికపై టీడీపీలో హైడ్రామా.. ఆస్పత్రిలో చైర్మన్ చలసాని!
- Rentachintala-Kurnool Murders: రెంటచింతలలో వైసీపీ నేత.. కర్నూలులో టీడీపీ కార్యకర్త హత్య!
- National Handloom Day: చేనేత కుటుంబాలకు భారీ ఊరట.. రూ.179 కోట్లు జమ చేయనున్న ప్రభుత్వం!
- Krishna River Management Board: శ్రీశైలం, సాగర్ నీటిపై ఏపీ కీలక ప్రతిపాదన.. కేఆర్ఎంబీకి లేఖ
కాగా మరోవైపు వైసీపీ ప్రభుత్వానికి మూడేళ్లు పూర్తవుతున్న సందర్భంగా ఇటీవల వైసీపీ మంత్రులు సామాజిక న్యాయభేరి అంటూ నాలుగు రోజుల పాటు బస్సుయాత్రను చేపట్టిన సంగతి తెలిసిందే. శ్రీకాకుళం జిల్లా నుంచి వైసీపీ మంత్రులు చేపట్టిన బస్సు యాత్ర ఆదివారం నాడు అనంతపురంలో ముగిసింది. అటు గడప గడపకు మన ప్రభుత్వం కార్యక్రమాన్ని వైసీపీ ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తోంది. ప్రతి నియోజకవర్గంలో వైసీపీ ప్రజాప్రతినిధులు ఇంటింటికీ వెళ్లి జగన్ మూడేళ్ల పాలన ఎలా ఉందో తెలుసుకుంటున్నారు. అటు ఏపీలో జగన్ ఇమేజ్ మరింత పెరిగిందని.. వచ్చే ఎన్నికల్లో కూడా వైసీపీ విజయం ఖాయమని పలువురు మంత్రులు ధీమా వ్యక్తం చేస్తున్నారు.
మీరు చూపిన ప్రేమ, మీరు అందించిన ఆశీస్సులతో ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టి మూడేళ్లు అవుతోంది. మీరు నాపై పెట్టుకున్న నమ్మకాన్ని నిలబెట్టుకుంటూ గడిచిన మూడేళ్లలో 95శాతానికి పైగా హామీలను అమలు చేశాం. ఎన్నో మంచి పనులకు శ్రీకారం చుట్టాం. 1/2
— YS Jagan Mohan Reddy (@ysjagan) May 30, 2022
తాజావార్తలు
-
Salman Khan: అస్సాం వరద బాధితులకు అండగా సల్మాన్ ఖాన్.. 500 కొత్త ఇళ్ల నిర్మాణానికి సహాయం
-
Deepika Padukone: ‘రాకా’.. హీరోయిన్ దీపికా పదుకొనే పనైపోయినట్టే, ఇక అవుట్!
-
Will Jacks: సూపర్‌మ్యాన్ ఫీల్డింగ్.. అయ్యా బాబోయ్..! ఏంటి జాక్ క్యాచ్ ను అలా పట్టేశావ్.!
-
Sridhar Babu: త్వరలోనే డిజిటల్ అసెంబ్లీ, డిజిటల్ కౌన్సిల్.. మంత్రి శ్రీధర్ బాబు కీలక ప్రకటన
-
Gujarat Well Mystery: వింత ఘటన.. బావిలో నీరు అలల్లా కదలికలు, రంగంలోకి అధికారులు (వీడియో)
ట్రెండింగ్
-
John Turner Retirement: ఇంగ్లండ్ స్టార్ సంచలన నిర్ణయం.. 25 ఏళ్లకే క్రికెట్‌కు గుడ్‌బై.. కారణం తెలిస్తే షాక్!
-
Jowar Roti: ‘జొన్న రొట్టె’ విరిగిపోతుందా..? లేదా గట్టిగా అవుతుందా.? ఇలా చేస్తే మెత్తగా, బాగా పొంగే రొట్టెలు గ్యారెంటీ.!
-
10mm డైనమిక్ డ్రైవర్లు, ANC, 48 గంటల బ్యాటరీతో JBL Live Buds 4, Live Beam 4 లాంచ్..!
-
12 అంగుళాల 2K 90Hz డిస్ప్లే, క్వాడ్ స్పీకర్లతో HP OmniPad 12 భారత్‌లో లాంచ్..!
-
రూ.9.99 లక్షలకే పెట్రోల్, డీజిల్, CNG ఆప్షన్లతో Tata Nexon Camo ఎడిషన్ లాంచ్..!