వెంకటరామిరెడ్డి మాట్లాడుతూ.. తాడిపత్రి జేసీ ప్రభాకర్ రెడ్డి జాగీర్ కాదు అని మండిపడ్డారు. తాడిపత్రిలో వైఎస్ఆర్సీపీ నాయకులను అడ్డుకుంటామంటే ఊరుకోము.. తాడిపత్రిలో ఎవరు ఉండాలో.. ఎవరు ఉండకూడదో ప్రభుత్వానికి జీవో జారీ చేసే దమ్ముందా? అని ప్రశ్నించారు. తాడిపత్రి నియోజకవర్గంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని ప్రతి గడపకు తీసుకెళ్లి బలోపేతం చేస్తామన్నారు.