The Girlfriend: వరుస విజయాలతో బాక్సాఫీస్‌కి లక్కీ చామ్‌గా మారిన నేషనల్ క్రష్ రష్మిక మందన్నా ప్రస్తుతం ఓ లేడీ ఓరియెంటెడ్ సినిమాలో నటిస్తోంది. ‘ది గర్ల్‌ఫ్రెండ్’ (The Girlfriend) అనే సినిమాలో కథానాయకిగా రష్మిక కనిపించనున్న ఈ చిత్రానికి జాతీయ అవార్డు విన్నర్, ప్రముఖ దర్శకుడు రాహుల్ రవీంద్రన్ దర్శకత్వం వహిస్తున్నారు. ఇక ప్రముఖ నిర్మాణ సంస్థ గీత ఆర్ట్స్ బ్యానర్‌పై, అల్లు అరవింద్ సమర్పణలో, విద్య కొప్పినీడి అండ్ ధీరజ్ మొగిలినేని నిర్మిస్తున్న ఈ చిత్రం పాన్ ఇండియా స్థాయిలో తెరకెక్కుతోంది. ఈ సినిమాలో కన్నడ నటుడు దీక్షిత్ శెట్టి హీరోగా నటిస్తున్నాడు.
Read Also:ENG vs IND: లార్డ్స్‌లో గెలిచినా ఇంగ్లాండ్‌కు సుఖం లేదుగా.. గట్టి షాక్ ఇచ్చిన ఐసీసీ..!
ఈ సినిమాకు సంబంధించి మేకర్స్ తాజాగా ప్రమోషనల్ కార్యాక్రమాలను ప్రారంభించారు. ఈ క్రమంలో ఫస్ట్ సింగిల్ “నదివే” పాటను విడుదల చేశారు. ఈ మెలోడియస్ ట్రాక్‌లో రష్మిక మందన్నా, దీక్షిత్ శెట్టి జంట కనిపించి ఆకట్టుకుంటోంది. ఈ పాటను హేషమ్ అబ్దుల్ వహాబ్ కంపోజ్ చేయడమే కాకుండా.. పాడారు కూడా. ఈ పాటకు రాకేందు మౌళి మంచి లిరిక్స్ అందించారు. ఇక “నదివే” పాటకు విశ్వకిరణ్ నంబి అందించిన గ్రేస్‌ఫుల్ డ్యాన్స్ అదనపు ఆకర్షణగా నిలుస్తోంది. ఈ పాటలో రష్మిక, దీక్షిత్ లు వారి హావభావాలతో ప్రేక్షకులను ఆకట్టుకున్నారు.
Read Also:8 vasanthalu: థియేటర్లో దేఖలేదు.. ఇప్పుడేమో తెగ లేపుతున్నారు!
ఈ చిత్రంలో రావు రమేష్, రోహిణి వంటి ప్రముఖ నటులు కీలక పాత్రల్లో కనిపించనుండగా.. అను ఇమ్మాన్యుయేల్ ఒక ప్రత్యేక పాత్రలో నటిస్తోందని సమాచారం. అన్ని వర్గాల ప్రేక్షకులకు కనెక్ట్ అయ్యే విధంగా సినిమాను రూపొందిస్తున్నట్టు చిత్రబృందం చెబుతోంది. ప్రస్తుతం “ది గర్ల్‌ఫ్రెండ్” సినిమాకు సంబంధించి విడుదల తేదీని అధికారికంగా ప్రకటించలేదు. కానీ “నదివే” సాంగ్ విడుదలతో సినిమా పట్ల అంచనాలు బాగా పెరిగాయి.