JC Prabhakar Reddy: అనంతపురం జిల్లా తాడిపత్రిలో మున్సిపల్ చైర్మన్ జేసీ ప్రభాకర్ రెడ్డి.. మాజీ ఎమ్మెల్యే కేతిరెడ్డి పెద్దా రెడ్డి మధ్య.. సవాళ్లు ప్రతి సవాళ్లు కొత్త విషయం ఏమీ కాదు.. అయితే, తాజాగా, పెద్దిరెడ్డి చేసిన ఫిర్యాదుపై స్పందించిన జేసీ ప్రభాకర్ రెడ్డి.. వచ్చి నిరూపించాలంటూ అంటూ పెద్దారెడ్డికే సవాల్ విసిరారు.. ఎర్ర కాలువ, రహదారి ఏర్పాటుకు ఏడు మీటర్లు స్థలం ఓనర్లతో మాట్లాడి పంచాయతీరాజ్ కు అప్పజెప్పడం జరిగింది.. పంచాయతీరాజ్ వద్ద డబ్బులు లేకపోవడంతో ఆర్ అండ్ బీ వాళ్లకు అప్పజెప్పారు. 7 మీటర్లతో సింగల్ రోడ్డు ఏర్పాటు చేస్తే. దాన్ని కాస్త డబుల్ రోడ్డు చేశారు. కాలువ వద్ద ఉన్న మొత్తం స్థలం ప్రైవేట్ ల్యాండే. ప్రైవేట్ ల్యాండ్ అయిన 20 మీటర్లు రోడ్డుకు వదిలి వాళ్లు ప్లాట్లు వేసుకున్నారని తెలిపారు.
Read Also: రూ. 17.99 లక్షల ప్రారంభ ధరతో Tata Sierra టాప్ వేరియంట్ల ధరలు వెల్లడి..!
అయితే, ప్లాట్లు ఎవరు అక్రమంగా ఏర్పాటు చేసుకున్నారో పెద్దారెడ్డి వచ్చి నిరూపించాలని సవాల్ విసిరారు జేసీ ప్రభాకర్ రెడ్డి.. రేపు ఉదయం పెద్దారెడ్డి నాన్న విగ్రహానికి ఆయన చేసిన ఆరోపణలు నిరూపించాలని వినతిపత్రం మా కౌన్సిలర్లు అందజేస్తారన్న ఆయన.. పెద్దారెడ్డి రెవెన్యూ శాఖకు ఫిర్యాదు చేశాడు.. కాబట్టి ఖచ్చితంగా వచ్చి నిరూపించాలన్నారు.. పెద్దారెడ్డి వచ్చి ఏది అక్రమంగా నిర్మించారని చూపిస్తే దాన్ని నేను పడగొట్టడానికి సిద్ధంగా ఉన్నాను అని స్పష్టం చేశారు తాడిపత్రి మున్సిపల్ చైర్మన్ జేసీ ప్రభాకర్ రెడ్డి..