వెంకటేష్ మహా దర్శకత్వంలో సత్యదేవ్ ప్రధాన పాత్రలో తెరకెక్కుతున్న సినిమా ‘రావు బహదూర్’. జీఎంబీ ఎంటర్‌టైన్‌మెంట్ పతాకంపై అగ్ర నటుడు మహేశ్ బాబు, నమ్రత శిరోద్కర్ సమర్పిస్తున్న ఈ చిత్రం తాజాగా మరో ముఖ్యమైన అప్‌డేట్‌తో ప్రేక్షకుల ముందుకు వచ్చింది. తాజాగా దర్శకధీరుడు రాజమౌళి చేతుల మీదుగా ‘రావు బహదూర్’ టీజర్ విడుదలైంది. “నాకు అనుమానం అనే భూతం పట్టిందంటూ..” అనే ఆసక్తికరమైన డైలాగ్‌తో టీజర్ మొదలై, మరింత సస్పెన్స్, థ్రిల్‌ను రేకెత్తించేలా రూపొందించబడింది.
Also Read : kidney problems : కిడ్నీలు ఒత్తిడికి గురైనప్పుడు కనిపించే 7 ముఖ్యమైన సంకేతాలు..
సైకలాజికల్ డ్రామాగా ఈ సినిమాను తీర్చిదిద్దారని టీజర్ ద్వారా అర్థమవుతోంది. సత్యదేవ్ నటన, వెంకటేష్ మహా స్టైల్ ఆఫ్ మేకింగ్ కలిపి ఈ చిత్రానికి ప్రత్యేక ఆకర్షణగా మారనున్నాయి. ప్రస్తుతం టీజర్ పై సోషల్ మీడియాలో మంచి బజ్ క్రియేట్ అవుతుంది. సైకలాజికల్ థ్రిల్లర్‌లను ఇష్టపడే ప్రేక్షకులకు ఈ సినిమా కొత్త అనుభూతిని ఇవ్వబోతోందనే నమ్మకం టీమ్‌లో కనిపిస్తోంది. వచ్చే వేసవి సీజన్‌లో ‘రావు బహదూర్’ ప్రేక్షకుల ముందుకు రానుంది. సత్యదేవ్ కెరీర్‌లో మరో మైలురాయి కావొచ్చని సినీ వర్గాలు అంచనా వేస్తున్నాయి.