Electricity Bills: గుడ్ న్యూస్..! తగ్గనున్న విద్యుత్ ఛార్జీలు..
- విద్యుత్ ఛార్జీల విషయంలో శుభవార్త చెప్పిన మంత్రి గొట్టిపాటి..
- ఈ నెల నుంచి విద్యుత్ ఛార్జీలు తగ్గించేలా చర్యలు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Electricity Bills: విద్యుత్ ఛార్జీల విషయంలో శుభవార్త చెప్పారు ఆంధ్రప్రదేశ్ మంత్రి గొట్టిపాటి రవికుమార్.. విద్యుత్ వినియోగదారులకు కాస్త ఉపశమనం కలిగించేలా ఈ నెల నుంచి విద్యుత్ ఛార్జీలు తగ్గించేలా చర్యలు తీసుకుంటున్నామని తెలిపారు.. అయితే, గత వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వ హయాంలో బిల్లుల్లో ఎఫ్‌పీపీపీ ఛార్జీలు 40 పైసలు అధికంగా వసూలు చేశాయని గుర్తుచేసిన ఆయన.. దీంతో, పేదలను ఇబ్బంది పెట్టారని మండిపడ్డారు.. అయితే, కూటమి సర్కార్ విద్యుత్ బిల్లులు తగ్గించేలా చర్యలు తీసుకుంటుంది.. నవంబర్ నుంచి ఎఫ్‌పీపీపీ ఛార్జీలు 13 పైసల వరకు తగ్గిస్తుండటంతో విద్యుత్ వినియోగదారులకు ఆర్థికంగా మేలు జరుగుతుందని పేర్కొన్నారు.. బుధవారం రోజు అనకాపల్లి జిల్లా మాడుగుల నియోజకవర్గంలో పర్యటించిన మంత్రి గొట్టిపాటి రవికుమార్.. చౌడువాడ, కింతలిలో నూతనంగా నిర్మించిన విద్యుత్ సబ్ స్టేషన్లను ప్రారంభించారు.. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని 11 జిల్లాల్లో రూ.250 కోట్లతో 69 విద్యుత్ సబ్ స్టేషన్లు నిర్మిస్తున్నామని చెప్పారు. మరోవైపు, 20 వేల ఎస్సీ, ఎస్టీ లబ్ధిదారుల ఇళ్లపై సౌరవిద్యుత్తు యూనిట్లను ఫ్రీగా ఏర్పాటు చేయనున్నట్టు వెల్లడించారు.. ఇక, విద్యుత్ షాక్‌తో మృతిచెందిన రెండు కుటుంబాలకు రూ.5 లక్షల చొప్పున పరిహారానికి సంబంధించిన చెక్కులను పంపిణీ చేశారు మంత్రి గొట్టిపాటి రవికుమార్..
Read Also: Balakrishna : షాకింగ్ : జైలర్ 2 రిజెక్ట్ చేసిన బాలయ్య.. మరో క్రేజీ సినిమా కూడా?
Also Read
- Botsa Satyanarayana: పంచదార్లలో వైసీపీ నేత బొత్స సంచలన వ్యాఖ్యలు.. సర్కార్ పై తీవ్ర ఆరోపణలు
- Gudivada Amarnath: హోంమంత్రి అనితపై మాజీ మంత్రి ఘాటు విమర్శలు.. ఆమె 'మేకప్ మంత్రి'..!
- Anakapalli Death Mystery: కొడుకు మృతిపై అనుమానం.. కన్నతల్లి కన్నీటి పోరు..
- Gudivada Amarnath: జగన్ అధికారంలోకి రాగానే తప్పుడు కేసులు ఎత్తివేత.. మీకు అండగా ఉంటాం..!
తాజావార్తలు
-
Colombia Earthquake: 7.4 తీవ్రతతో భూకంపం.. 111 మంది మృతి, శిథిలాల కింద పలువురు
-
Agadha Pre Release Event: ‘అగధ’తో ఎంఎస్ రాజు కమ్‌బ్యాక్.. ప్రీ రిలీజ్ ఈవెంట్ లో అదిరిపోయే రెస్పాన్స్.. కల్ట్ క్లాసిక్ అవుతుందా?
-
Astrology: ఆగస్టు 11 మంగళవారం దినఫలాలు.. ఈ రాశివారికి శుభవార్త..
-
Colombia Earthquake : కొలంబియాలో భారీ భూకంపం.. 47 మంది మృతి, కూలిన భవనాలు.!
-
OTR : అసెంబ్లీకి వైసీపీ..? DSC రచ్చ వేళ కూటమి అలర్ట్.. బీసీ బిల్లుపై కీలక నిర్ణయం..!
ట్రెండింగ్
-
Kitchen Hacks : నూనె సీసాల జిడ్డు పోవాలంటే.. ఈ 4 చిట్కాలు ట్రై చేయండి.!
-
Bathroom Drain Cleaning Tips : బాత్రూమ్ డ్రెయిన్ జామ్ అవుతోందా? ఈ 2 పదార్థాలతో చిటికెలో క్లీన్.!
-
Home Hacks : కడాయి హ్యాండిల్‌పై గట్టి జిడ్డా? ఈ చిట్కాలతో కొత్తదానిలా మెరిపించండి.!
-
Cleaning Hacks : కిచెన్ డస్ట్‌బిన్ స్మెల్ కొడుతోందా.? ఇలా చేస్తే క్షణాల్లో క్లీన్.!
-
Pressure Cooker Rice Tips: కుక్కర్లో అన్నం పర్ఫెక్ట్గా రావాలంటే ఇదే సీక్రెట్.!