AP Crime: ఏపీలో బంగ్లా విద్యార్థినిపై అత్యాచారయత్నం.. తప్పించుకునే క్రమంలో నిందితుడు మృతి
- Follow Us :
-
-
Add as a preferred
source on google
AP Crime: ఆంధ్రప్రదేశ్‌లో బంగ్లాదేశ్‌కి చెందిన విద్యార్థినిపై అత్యాచారయత్నం ఘటన విషాదంగా మారింది.. అనకాపల్లి జిల్లా అచ్చుతాపురంలో బంగ్లాదేశ్‌కు చెందిన ఓ విద్యార్థినిపై అత్యాచారయత్నం జరిగిన ఘటన కలకలం రేపింది. బాధితురాలు కాకినాడలో బీఫార్మసీ ఫైనల్ ఇయర్ చదువుతోంది. గత పది రోజులుగా అచ్చుతాపురంలోని స్నేహితుడి ఇంట్లో ఉంటోంది. స్నేహితుడు ఫార్మా కంపెనీలో విధులకు వెళ్లిన సమయంలో ఈ ఘటన చోటుచేసుకుంది. అయితే, అదే అపార్ట్మెంట్లో నివసిస్తున్న కమలేష్ యాదవ్ (43) ఒంటరిగా ఉన్న యువతిపై కన్నేశాడు. బాత్రూమ్ క్లీన్ చేస్తానని చెప్పి ఆమె ఉంటున్న ఇంట్లోకి ప్రవేశించినట్లు తెలుస్తోంది. అనంతరం యువతిపై అత్యాచారయత్నానికి పాల్పడినట్లు సమాచారం.
అయితే యువతి అతడిని తీవ్రంగా ప్రతిఘటించి, అక్కడి నుంచి తప్పించుకుంది. అనంతరం జరిగిన విషయాన్ని స్థానికులకు తెలియజేసింది. దీంతో భయపడిన కమలేష్ యాదవ్ గోడ దూకి తప్పించుకునేందుకు ప్రయత్నించగా ప్రమాదవశాత్తు కిందపడిపోయాడు. తీవ్ర గాయాలతో అక్కడికక్కడే మృతి చెందినట్లు పోలీసులు తెలిపారు. ఈ ఘటనపై బాధితురాలు పోలీసులకు ఫిర్యాదు చేసింది. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలు, నిందితుడి మృతి పరిస్థితులపై కూడా పోలీసులు విచారణ కొనసాగిస్తున్నారు.
Also Read
- Bengaluru: ఖాళీ స్థలాన్ని క్లీన్ చేస్తుండగా మహిళ మృతదేహం.. 20 రోజుల తర్వాత వీడిన మర్డర్ మిస్టరీ..
- AP Crime: కళ్యాణి హత్య కేసులో షాకింగ్ విషయాలు.. మటన్‌తో కొట్టే కత్తులతో ముక్కలుగా నరికి కెనాల్లో పడేశారు..!
- Bihar Girl Harassment: బీహార్‌లో వరుస ఘటనలు.. తాజాగా టూరిస్ట్ స్పాట్లో బాలికకు వేధింపులు.. వీడియో వైరల్
- AP and TG Crime: మాదాపూర్ ఓయోలో యువతి మృతి కేసులో ట్విస్ట్.. విశాఖలో యువకుడి ఆత్మహత్యాయత్నం
తాజావార్తలు
-
ACB Raids : నిమ్స్ అధికారిపై ఏసీబీ సోదాలు.. బినామీల ఇళ్లలో కీలక పత్రాలు
-
Thackeray Brothers: CJP ఆందోళనకు ఉద్ధవ్, రాజ్ ఠాక్రేల మద్దతు.!
-
Balochistan: పాక్ సైనికులపై BLA మహిళా యూనిట్ దాడి.. 9 మంది హతం..
-
Virat Kohli Hundred Centuries: విరాట్ కోహ్లీ 100 శతకాలు సాధిస్తాడా.. ఇదిగో సాధ్యసాధ్యాలు..
-
TGSPDCL : విద్యుత్ డిమాండ్‌లో కొత్త రికార్డు.. 12,044 మెగావాట్లు.!
ట్రెండింగ్
-
100HP టర్బో ఇంజిన్‌తో Renault Triber Turbo కొత్త వేరియంట్ లాంచ్.. ధర ఎంతంటే.?
-
Rohit-Kohli: నేను కోహ్లీకి పెద్ద ఫ్యాన్.. కానీ ఇప్పుడు చాలా బాధగా ఉంది.. రోహిత్ ఆసక్తికర వ్యాఖ్యలు!
-
మారిన లుక్, సరికొత్త ఫీచర్లతో Suzuki Hayabusa Special Edition లాంచ్.. ధరనే కాస్త ఎక్కువే.!
-
Woman Auto Driver: ఐటీ To ఆటో డ్రైవర్.. హృదయాలను కదిలిస్తున్న యువతి కథ..!
-
Ai+ నుంచి మూడు కొత్త డివైజ్‌లు.. కొత్త స్మార్ట్ ఫోన్ తోపాటు, 5G ట్యాబ్లెట్ సెగ్మెంట్ లాంచ్.!