Mana Shankar Varaprasad Garu: సక్సెస్ ఫుల్ డైరెక్టర్ అనిల్ రావిపూడి దర్శకత్వంలో మెగాస్టార్ నటిస్తున్న ‘మన శంకర వరప్రసాద్ గారు’ చిత్రం ఇప్పుడు టాలీవుడ్‌లో సరికొత్త సెన్సేషన్ సృష్టిస్తుంది. నిన్న విడుదలైన ఈ చిత్ర ట్రైలర్ యూట్యూబ్‌లో రికార్డులు సృష్టిస్తుంది. ఈ చిత్ర ట్రైలర్ విడుదలైనప్పటి నుంచి సోషల్ మీడియాలో ‘మెగా’ మేనియా కనిపిస్తోంది. కేవలం 24 గంటల్లోనే 25 మిలియన్లకు పైగా వ్యూస్ సాధించి సరికొత్త రికార్డును క్రియేట్ చేసింది.
READ ALSO: Pawan Kalyan: ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకూడదు..!
వింటేజ్ చిరంజీవి లుక్, అదిరిపోయే బ్యాక్‌గ్రౌండ్ స్కోర్, అనిల్ రావిపూడి మార్క్ ఎంటర్టైన్మెంట్ కలగలిపి ఈ ట్రైలర్‌ను ఒక విజువల్ ఫీస్ట్‌గా మార్చేశాయి. ట్రైలర్ చివరలో వచ్చే మాస్ డైలాగ్స్ చూస్తుంటే సంక్రాంతికి థియేటర్లలో పూనకాలు గ్యారెంటీ అని ట్రేడ్ వర్గాలు అభిప్రాయపడుతున్నాయి. జనవరి 7న హైదరాబాద్‌లో జరగనున్న గ్రాండ్ ప్రీ-రిలీజ్ ఈవెంట్‌కు మెగాస్టార్ చిరంజీవితో పాటు విక్టరీ వెంకటేష్ కూడా హాజరుకాబోతున్నారు. వెండితెరపై వీరిద్దరి కాంబినేషన్ చూడాలని దశాబ్దాలుగా ఎదురుచూస్తున్న అభిమానులకు, ఒకే వేదికపై ఈ ఇద్దరు దిగ్గజాలను చూడటం ఒక మర్చిపోలేని అనుభూతి కానుంది. ఈ చిత్రంలో వీరిద్దరి మధ్య సాగే కెమిస్ట్రీనే ప్రధాన ఆకర్షణ కావడంతో, ఈ ఈవెంట్ పై దేశవ్యాప్తంగా సినీ ప్రియుల కన్ను పడింది. షైన్ స్క్రీన్స్, గోల్డ్ బాక్స్ ఎంటర్టైన్మెంట్స్ సంయుక్తంగా ఈ చిత్రాన్ని నిర్మించాయి. సాహు గారపాటి, సుస్మిత కొణిదెల నిర్మించిన ఈ చిత్రం జనవరి 12న సంక్రాంతి కానుకగా ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలోకి రానుంది.
READ ALSO: Anil Sunkara: ‘ఏజెంట్’ సినిమాపై ప్రొడ్యూసర్ అనిల్ సుంకర షాకింగ్ కామెంట్స్..