విశాఖ ఉక్కు పరిశ్రమ ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా ఉక్కు పరిరక్షణ సమితి ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన భారీ బహిరంగ సభలో జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ పాల్గొన్నారు. సభలో పాల్గొన్న పవన్ ఉక్కు పరిరక్షణ సమితికి సంఘీభావం ప్రకటించారు. ఈ సందర్భంగా మాట్లాడిన పవన్.. కేంద్రానికి ఇక్కడి సమస్యలు తెలియకుండా చేస్తున్నారని, ఇక్కడి మంత్రులు వెళ్లి కేంద్రానికి సమస్యలు వెల్లడించకుంటే కేంద్రానికి సమస్యలు ఎలా తెలుస్తాయంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు.
అంతేకాకుండా ఇక్కడి సమస్యలు కేంద్రానికి తెలియాలంటే జగన్ సర్కార్‌పైనే మనం ఒత్తిడి తీసుకురావాలని ఆయన అన్నారు. దీంతో పవన్ మాటలపై వైసీపీ ఎమ్మెల్యే అంబటి రాంబాబు వ్యంగ్యాస్త్రాలు సంధించారు. ‘విశాఖ ఉక్కు – ఆంధ్రుల హక్కు అని.. ఆంధ్ర ప్రభుత్వంపైనే పోరాడదాం.! కేంద్ర ప్రభుత్వంపై పోరాడే దమ్ము లేదని తేల్చేసిన పవన్ సాబ్’ అంటూ ట్విట్టర్ వేదికగా పోస్ట్ చేశారు.