Ambati Rambabu: పవన్ కళ్యాణ్‌కు నాలుగు సూటి ప్రశ్నలు.. భీమవరంలో పోటీ చేస్తాడా?
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Ambati Rambabu: అమరావతి రాజధాని అంశంపై హైకోర్టు ఇచ్చిన తీర్పుపై సుప్రీంకోర్టు స్టే విధించడాన్ని స్వాగతిస్తున్నట్లు మంత్రి అంబటి రాంబాబు తెలిపారు. ఈ సందర్భంగా సుప్రీంకోర్టు తీర్పు వికేంద్రీకరణకు బలాన్ని ఇస్తుందన్నారు. రాజధానుల నిర్ణయంలో న్యాయస్థానాల జోక్యం సరైంది కాదని దీన్ని బట్టి అర్థం అవుతోందని మంత్రి అంబటి అన్నారు. ఈ మధ్యంతర ఉత్తర్వుల తర్వాత అయినా చంద్రబాబుకు జ్ఞానోదయం అవుతుందని భావిస్తున్నట్లు పేర్కొన్నారు. అమరావతి రైతుల పాదయాత్రకు విరామం తాత్కాలికం కాదని శాశ్వతం అని తాను అప్పుడే చెప్పానని.. ఇప్పుడైనా ఇటువంటి అడ్డంకులు సృష్టించే ప్రయత్నాలను చంద్రబాబు ఆపాలన్నారు. అమరావతి ప్రాంతంలోని నిజమైన రైతులు ఆందోళన చెందాల్సిన అవసరం లేదని స్పష్టం చేశారు.
Read Also: Bigg Boss 6: అడ్డంగా దొరికేసిన బిగ్‌బాస్.. సీజన్ సీజన్‌కు రూల్స్ మారతాయా?
Also Read
- AP IAS Transfers 2026: 22 మంది IAS అధికారుల బదిలీలు.. కీలక శాఖల్లో మార్పులు.. ఆమ్రపాలికి నో పోస్టింగ్..
- Medico Priyanka: మెడికో ప్రియాంక పరిస్థితి విషమం.. మద్యం మత్తులో కారుతో తొక్కించిన ఉన్మాదులు..
- OTR : టీడీపీ సీనియర్ నేత కళా వెంకట్రావుకు గడ్డుకాలమా? పార్టీలో తగ్గిన ప్రాధాన్యతపై చర్చ
- OTR : మంత్రి పార్థసారధిపై మైనింగ్ ఆరోపణలు.. నూజువీడులో రాజకీయ రగడ
మరోవైపు పవన్ కళ్యాణ్‌కు మంత్రి అంబటి రాంబాబు నాలుగు సూటి ప్రశ్నలు వేశారు. మళ్ళీ భీమవరం నుంచి పోటీ చేస్తావా? గాజువాక నుంచి పోటీ చేస్తావా? కనీసం 25 స్థానాల్లో అయినా పోటీ చేస్తావా? ఎవరితో కలిసి పోటీ చేస్తావ్? అన్న ప్రశ్నలకు పవన్ సమాధానం ఇవ్వాలన్నారు. రౌడీని రౌడీ అంటే అచ్చం రౌడీ లాగే పవన్ రియాక్ట్ అయ్యారని అంబటి ఆరోపించారు. పవన్ వెంట ఎవరైనా వెళ్తే కుక్క తోక పట్టుకుని గోదావరి ఈదినట్టే అని ఎద్దేవా చేశారు. ఇళ్లు కూలినట్టు పవన్ ఇప్పటం గ్రామస్తులతో దొంగ సంతకాలు పెట్టించారని.. ఇప్పటం ప్రజలు ఉద్యమం చేశారా అని ప్రశ్నించారు. దొంగ సంతకాలు పెట్టి కోర్టుతో పెనాల్టీ వేయించుకోవటం ఉద్యమం చేయటమా అని నిలదీశారు. ఇప్పటంలో పవన్ అసలు రంగు బయటపడిందన్నారు. అమరావతిలో అసలు రైతులు ఉన్నారా అని మంత్రి అంబటి రాంబాబు అనుమానం వ్యక్తం చేశారు. ఐడెంటిటీ కార్డ్ అడిగితే దొంగ రైతులు పారిపోయారని.. 151 సీట్లు వచ్చినపుడు పవన్ వేలు ఎక్కడ పెట్టుకున్నాడని ప్రశ్నించారు. సినిమాల్లో కామెడీ క్యారెక్టర్ లాంటి వాడు పవన్ కళ్యాణ్ అని ఎద్దేవా చేశారు.
తాజావార్తలు
-
IND Vs SL Test Free Entry: భారత్ – శ్రీలంక టెస్టు సిరీస్‌కు ఉచిత ప్రవేశం.. ఎవరైనా వెళ్లి చూడొచ్చు..
-
Story Board: కమ్మేస్తున్న డ్రగ్స్ భూతం.. మన విద్యార్థుల్ని డ్రగ్స్ నుంచి ఎలా కాపాడుకోవాలి..?
-
Off The Record: సీఎం సొంత జిల్లాలో టీడీపీకి ఏమైంది? ఎమ్మెల్యేల తీరుపై చర్చ
-
Bengaluru: కుళ్లిన మాంసం, పాడైన కూరగాయలు..5-స్టార్ హోటళ్లలో కూడా అదే కంపు..
-
Dhurandhar : నెట్‌ఫ్లిక్స్‌లో ‘ధురంధర్’ ప్రపంచ రికార్డు..
ట్రెండింగ్
-
7500mAh బ్యాటరీ, 6.9 అంగుళాల 120Hz డిస్ప్లే, 45W ఫాస్ట్ ఛార్జింగ్‌తో REDMI 17 5G లాంచ్..!
-
Will Jacks: సూపర్‌మ్యాన్ ఫీల్డింగ్.. అయ్యా బాబోయ్..! ఏంటి జాక్ క్యాచ్ ను అలా పట్టేశావ్.!
-
John Turner Retirement: ఇంగ్లండ్ స్టార్ సంచలన నిర్ణయం.. 25 ఏళ్లకే క్రికెట్‌కు గుడ్‌బై.. కారణం తెలిస్తే షాక్!
-
Jowar Roti: ‘జొన్న రొట్టె’ విరిగిపోతుందా..? లేదా గట్టిగా అవుతుందా.? ఇలా చేస్తే మెత్తగా, బాగా పొంగే రొట్టెలు గ్యారెంటీ.!
-
10mm డైనమిక్ డ్రైవర్లు, ANC, 48 గంటల బ్యాటరీతో JBL Live Buds 4, Live Beam 4 లాంచ్..!