YSRCP MLCs: ఇక, ముఖ్యమంత్రి, మంత్రులను వారు ప్రాతినిథ్యం వహిస్తోన్న నియోజకవర్గాల ఎమ్మెల్యేలుగా సంబోధిస్తాం అంటున్నారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్సీలు.. మండలి విరామ సమయంలో చిట్ చాట్‌లో వైసీపీ ఎమ్మెల్యేలు కీలక వ్యాఖ్యలు చేశారు. మాజీ సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డిని ప్రతిసారి పులివెందుల ఎమ్మెల్యే అని కూటమికి చెందిన మంత్రులు, ఎమ్మెల్యేలు సంబోధిస్తున్నారు.. ఇక, నుంచి మా పంథా కూడా మారుతుంది.. ఇక నుంచి శాసనమండలిలో సీఎం, మంత్రులను ఆ నియోజకవర్గాల ఎమ్మెల్యేలుగా సంబోధిస్తాం అన్నారు.. ఇకపై.. కుప్పం ఎమ్మెల్యే చంద్రబాబు, మంగళగిరి ఎమ్మెల్యే లోకేష్, పిఠాపురం ఎమ్మెల్యే పవన్ కల్యాణ్ అని సంబోధిస్తాం.. ఇలాగే సభలో మాట్లాడతామని అంటున్నారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్సీలు..
Read Also: OG: ఓజీ మూవీ ప్రీమియర్స్‌లో..స్క్రీన్‌ను చింపి అభిమానుల రచ్చ..
కాగా, ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఉద్దేశిస్తూ.. కుప్పం ఎమ్మెల్యే అంటూ వైసీపీ ఎమ్మెల్సీ రమేష్ యాదవ్ చేసిన వ్యాఖ్యలు శాసన మండలిలో తీవ్ర దుమారాన్ని రేపాయి.. రమేష్ యాదవ్.. సీఎం చంద్రబాబుపై చేసిన వ్యాఖ్యలను రికార్డుల నుంచి తొలగించాలని డిమాండ్ చేశారు మంత్రులు.. అయితే, ఎన్నికల మ్యానిఫెస్టోను ప్రకటించిన అనాటి కుప్పం ఎమ్మెల్యే అని మాత్రమే అన్నామని చెప్పుకొచ్చారు వైసీపీ పక్షనేత బొత్స సత్యనారాయణ.. ఇప్పుడు ముఖ్యమంత్రిని పట్టుకుని కుప్పం ఎమ్మెల్యే అనలేదని తెలిపారు.. ఇక, మాజీ సీఎం వైఎస్ జగన్ ను టీడీపీ వాళ్లు అనేక సార్లు పులివెందుల ఎమ్మెల్యే అంటూ వ్యంగ్యంగా మాట్లాడుతున్నారని సభ దృష్టికి తీసుకెళ్లారు బొత్స.. కావాలంటే రికార్డులు పరిశీలించుకోవాలని బొత్స సత్యనారాయణ సూచించారు.. అంతేకాదు, వైసీపీ ఎమ్మెల్సీ రమేష్ యాదవ్ పై చర్యలు తీసుకోవాలని ప్యానెల్ చైర్మన్‌తో వాగ్వివాదానికి దిగారు మంత్రులు.. రమేష్ యాదవ్ ప్రసంగం కొనసాగడానికి వీలు లేదని అడ్డుకున్నారు మంత్రులు. దీంతో, సభలో గందరగోళం నెలకొంది.. ఇక, సభలో రికార్డుల పరిశీలన కోసం ఐదు నిమిషాల పాటు వాయిదా వేశారు శాసన మండలి చైర్మన్.. ఆ తర్వాత చిట్‌చాట్‌లో ఇకపై సీఎం, మంత్రులను ఆ నియోజకవర్గాల ఎమ్మెల్యేలుగానే సంబోధిస్తామని పేర్కొన్నారు వైసీపీ ఎమ్మెల్సీలు..