YSRCP: వల్లభనేని వంశీ అరెస్ట్‌పై స్పందించిన వైసీపీ.. ఇది అక్రమం
- వల్లభనేని వంశీని కూటమి నేతలు టార్గెట్ చేశారు..
- మరో అక్రమ కేసు పెట్టి వేధింపులకు గురిచేస్తున్నారు..
- ఇంకెన్నాళ్లు ఈ కక్షపూరిత రాజకీయాలు..
- మాజీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీ అరెస్ట్ ను ఖండించిన వైసీపీ..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
YSRCP: గన్నవరం మాజీ ఎమ్మెల్యే, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేత వల్లభనేని వంశీ అరెస్ట్‌పై వైసీపీ స్పందించింది.. వల్లభనేని వంశీని అక్రమ కేసులో పోలీసులు అరెస్ట్ చేశారని మండిపడింది.. గన్నవరం టీడీపీ ఆఫీస్‌పై దాడి కేసులో ముందస్తు బెయిల్‌పై ఉన్నారు వంశీ మోహన్.. మరోవైపు.. ఈ కేసులో ఫిర్యాదు చేసిన సత్యవర్ధనే.. ఆ ఫిర్యాదును వెనక్కి తీసుకున్నారు.. కానీ.. మళ్లీ వంశీని టార్గెట్ చేసిన కూటమి నేతలు.. మరో అక్రమ కేసు పెట్టి వేధింపులకు గురిచేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేసింది.. విజయవాడకు ఆంధ్రప్రదేశ్ పోలీసులు అక్రమంగా తరలిస్తున్నారు.. ఇంకెన్నాళ్లు ఈ కక్షపూరిత రాజకీయాలు అంటూ రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడును ట్యాగ్ చేస్తూ.. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ట్వీట్ చేసింది..
Read Also: Vallabhaneni Vamsi Arrest: వల్లభనేని వంశీపై ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసు.. ఎలా దొరికిపోయాడంటే..?
Also Read
- Nara Lokesh : మహిళలకు రిజర్వేషన్లపై లోకేష్ కీలక వ్యాఖ్యలు..
- Motkupalli Narasimhulu: ఎన్టీఆర్‌ను గుర్తుచేసుకుంటూ మోత్కుపల్లి భావోద్వేగం.. “మనసున్న నాయకుడిని మళ్లీ చూడలేం”
- TDP Mahanadu: మహానాడులో చంద్రబాబు కీలక తీర్మానం.. ఎన్టీఆర్‌కు భారత రత్న ఇవ్వాలి..
- IMD : నైరుతి రుతుపవనాలు వచ్చేసినట్టేనా..? వాతావరణ శాఖ కీలక అప్డేట్..!
ఇక, రాయదుర్గం పోలీసుల సహకారంతో ఈ రోజు ఉదయం మాజీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీని అరెస్ట్ చేసిన విజయవాడ పోలీసులు.. హైదరాబాద్ నుంచి విజయవాడకు తరలిస్తున్నారు.. తెలంగాణ – ఆంధ్రప్రదేశ్ సరిహద్దుల్లో వాహనాన్ని మార్చనున్నారు.. మరోవైపు.. వల్లభనేని అరెస్ట్ దృష్ట్యా.. ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా.. ఏపీ-తెలంగాణ సరిహద్దులో పోలీసులను మోహరించారు.. కాగా, ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ సహా మొత్తం ఏడు సెక్షన్ల కింద వల్లభనేనిపై కేసులు నమోదు చేశారు పోలీసులు.. గన్నవరం టీడీపీ కార్యాలయంపై దాడి కేసులో ఫిర్యాదు చేసిన సత్యవర్ధన్ వ్యవహారంలోనే వంశీపై ఎస్సీ, ఎస్టీ కేసు నమోదు అయ్యింది.. సత్యవర్ధన్‌ని కిడ్నాప్ చేసి బెదిరింపులకు పాల్పడినందుకు ఎస్సీ, ఎస్టీ కేసు నమోదు చేశారు.. వంశీపై మొత్తం ఏడు సెక్షన్ల కింద కేసులు పెట్టారు పడమట పోలీసులు.. పడమట పీఎస్‌లో 86/ 2025 వంశీపై ఎఫ్ఐఆర్ నమోదు అయ్యింది.. బీఎంఎస్ సెక్షన్ 140, 308, 351 రెడ్ విత్ త్రి బై 5 సెక్షన్ల కింద.. ఎస్సీ, ఎస్టీ సెక్షన్ 3 సెక్షన్ 5ల కింద కేసు నమోదు చేసిన విషయం విదితమే..
మాజీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీని అక్రమ కేసులో అరెస్ట్ చేసిన పోలీసులు
గన్నవరం టీడీపీ ఆఫీస్‌పై దాడి కేసులో ముందస్తు బెయిల్‌పై ఉన్న వంశీ.. ఇటీవల ఫిర్యాదును కూడా వెనక్కి తీసుకున్న సత్యవర్ధన్
కానీ.. మళ్లీ వంశీని టార్గెట్ చేసిన కూటమి నేతలు.. మరో అక్రమ కేసు పెట్టి వేధింపులు.… pic.twitter.com/xBjYcDTv44
— YSR Congress Party (@YSRCParty) February 13, 2025
తాజావార్తలు
-
Putin: కజకిస్థాన్‌లో పుతిన్ పర్యటన.. అణు విద్యుత్ శక్తిపై కీలక ఒప్పందం
-
Leader Movie OTT : దేశాన్ని కాపాడే స్పై యాక్షన్ ఏజెంట్ గా ‘లెజెండ్’ శరవణన్… ఈ సారి రచ్చ రచ్చే.!
-
‘SRHకు ఏమైనా మైండ్ ఉందా.. గెలిచే మ్యాచ్‌ను పోగొట్టుకున్నారు.. వారిద్దరి వల్లే మ్యాచ్ పోయింది’
-
TMC: మమతా పార్టీకి వరుస దెబ్బలు.. టీఎంసీ కీలక నేత సంచలన నిర్ణయం
-
Siddaramaiah: ప్రసక్తే లేదు.. అక్కడికి వెళ్లబోను.. తేల్చి చెప్పిన సిద్ధరామయ్య
ట్రెండింగ్
-
భారత్‌లో Sony BRAVIA 7 II RGB Mini LED 4K టీవీల లాంచ్.. అద్భుత ఫీచర్లతో సరికొత్త సిరీస్.!
-
Dondakaya Roti Pachadi: పల్లీల స్పెషల్ టచ్‌తో ‘దొండకాయ రోటి పచ్చడి’.. టేస్ట్ చేస్తే లొట్టలేసుకుంటూ తింటారంతే.!
-
144Hz OLED డిస్ప్లే, 7500mAh బ్యాటరీతో గేమింగ్ మాన్స్టర్ REDMAGIC 11S Pro గ్లోబల్ లాంచ్.!
-
MG Majestor : రూ.40 లక్షల SUV కేవలం రూ.41,000లకే..!
-
Home Remedies : వర్షాకాలం వచ్చేస్తోంది.. దోమల బెడదకు ఈ సింపుల్ చిట్కాలతో చెక్ పెట్టండి..!