మళ్లీ వంశీని టార్గెట్ చేసిన కూటమి నేతలు.. మరో అక్రమ కేసు పెట్టి వేధింపులకు గురిచేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేసింది.. విజయవాడకు ఆంధ్రప్రదేశ్ పోలీసులు అక్రమంగా తరలిస్తున్నారు.. ఇంకెన్నాళ్లు ఈ కక్షపూరిత రాజకీయాలు అంటూ రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడును ట్యాగ్ చేస్తూ.. వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీ ట్వీట్ చేసింది..
మాజీ ఎమ్మెల్యే, వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీ నేత వల్లభనేని వంశీ మోహన్ అరెస్ట్‌కు రంగం సిద్ధమైంది.. ఆయన్ని ఏ క్షణంలోనైనా అరెస్ట్ చేసే అవకాశాలు కనిపిస్తున్నాయి.. ఎందుకుంటే.. వల్లభనేని వంశీని అరెస్ట్ చేసేందుకు ప్రత్యేక బృందాల ఏర్పాటు చేశారు పోలీసులు.. గన్నవరం టీడీపీ కార్యాలయంపై దాడి కేసులో ఏ71గా ఉన్నారు వంశీ.. మరోవైపు.. ఇప్పటికే ఈ కేసులో 18 మందిని అరెస్ట్ చేశారు పోలీసులు.