Minister Satya Kumar: వైసీపీ అధినేత, మాజీ సీఎం జగన్ మోహన్ రెడ్డిపై మంత్రి సత్య కుమార్ యాదవ్ తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. అన్ని వ్యవస్థల్ని నిర్వీర్యం చేశారు అన్నదానికి రుజువులు చూపించగలవా జగన్.. మీ హయంలో ఎన్ని హామీలు అమలు చేశారు.. రైతు భరోసా ఎంత ఇస్తామని ఎంత ఇచ్చారు అని ప్రశ్నించారు. ఇక, కూటమి ప్రభుత్వం 20 వేల రూపాయలు ఇస్తుంది.. మీ హయంలో ఒక్క పరిశ్రమనైనా తెచ్చావా.. 2.5 లక్షల కోట్లు కేంద్ర ప్రభుత్వ సంస్థల పెట్టుబడులు వస్తున్నాయి.. ప్రైవేట్ పరంగా రూ. 7 లక్షల కోట్లు పెట్టుబడులు వస్తున్నాయి.. అవినీతి చేసిన వారిని అరెస్ట్ చేస్తే వారిని పరామర్శించడానికి వెళ్ళే క్రమంలో అలజడులు సృష్టిస్తున్నారు.. రేపు జగన్ కూడా జైలుకు వెళ్లాలని మంత్రి సత్యకుమార్ పేర్కొన్నారు.
Read Also: POCSO Case : పోక్సో కేసులో తెలుగు కొరియోగ్రాఫర్ అరెస్ట్ – పరిశ్రమలో కలకలం
ఇక, జగన్ పోలీసు వ్యవస్థను ఏ రకంగా వాడుకున్నారో అందరికి తెలుసు అని వైద్యారోగ్యశాఖ మంత్రి సత్యకుమార్ తెలిపారు. వైసీపీ హయంలో ఎన్ని హామీలు అమలు చేశారు, ఇప్పుడు ఏ రకంగా అమలు అవుతున్నాయో చూద్దామా.. నేను మంత్రిగా చర్చకు రావాలని జగన్ ను పిలుస్తున్నాను.. అసెంబ్లీకి వచ్చి చర్చించండి అని దండం పెట్టి అడుగుతున్నాను.. అసంబ్లీలో ఐదేళ్ల పాటు లా ఉండదు, మీ వాడుక భాష రప్ప రప్ప అనే భాషలు అసలు ఉండవు.. నిర్భయంగా సభకు వచ్చి మమల్ని ప్రశ్నించండి అని సూచించారు. రాష్ట్రాభివృద్ధికి అన్ని విధాలుగా, అన్ని రంగాలకు కేంద్రం నుంచి భారీగా నిధులు వస్తున్నాయి.. లిక్కర్ కేసులో నాకు సంబంధం లేదన్నవాళ్ల దగ్గరే నోట్ల కట్టలు దొరుకుతున్నాయని సత్యకుమార్ యాదవ్ చెప్పుకొచ్చారు.