POCSO Case : పోక్సో కేసులో తెలుగు కొరియోగ్రాఫర్ అరెస్ట్ – పరిశ్రమలో కలకలం
- Follow Us :
-
-
Add as a preferred
source on google
టాలీవుడ్లో మంచి గుర్తింపు పొందిన కొరియోగ్రాఫర్ కృష్ణ మాస్టర్ ఇప్పుడు పోక్సో కేసులో అరెస్టయిన ఘటన సినిమా రంగంలో సంచలనంగా మారింది. గత నెలలో ఆయనపై.. మైనర్ బాలికతో అసభ్యంగా ప్రవర్తించాడని బాధిత బాలిక కుటుంబ సభ్యులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీంతో హైదరాబాద్ గచ్చిబౌలి పోలీస్ స్టేషన్లో కృష్ణపై పోక్సో (Protection of Children from Sexual Offences) చట్టం కింద కేసు నమోదైంది. కేసు నమోదు అనంతరం కృష్ణ మాస్టర్ పరారీలోకి వెళ్లిపోయారు. కానీ సాంకేతిక ఆధారాలు – ఫోన్ ట్రాకింగ్, సోషల్ మీడియా లొకేషన్, డిజిటల్ కమ్యూనికేషన్ ఆధారంగా అతను బెంగళూరులో తలదాచుకున్నట్లు గుర్తించి, అక్కడికి వెళ్లి అరెస్ట్ చేశారు. ప్రస్తుతం అతడిని హైదరాబాద్‌కు తరలించి విచారణ జరుపుతున్నారు.
Also Read : Komalee Prasad : ‘హిట్ 3’ దర్శకుడితో ఇబ్బంది పడ్డా..
Also Read
- Vrushakarma : నాగవంశీ అవుట్.. దిల్ రాజు ఇన్..'వృషకర్మ' వెనుక అసలేం జరిగింది?
- Varanasi Update: ‘వారణాసి’ నుంచి మరో బిగ్ ట్రీట్.. మళ్లీ అప్పుడే ప్లాన్ చేశారా?
- Sigma OTT: అప్పుడే ఓటీటీలోకి ‘సిగ్మా’.. స్ట్రీమింగ్ ఎప్పుడు, ఎక్కడంటే?
- Ahaan Panday: 10 కథలు రిజక్ట్ చేసిన యువ హీరో.. చివరకు ఆ డైరెక్టర్‌కు గ్రీన్ సిగ్నల్!
ఇది ఆయనపై వచ్చిన మొదటి కేసు మాత్రమే కాదు. గతంలో కూడా ఇన్స్టాగ్రామ్ వేదికగా యువతులను మోసం చేసినట్లు, వారి నమ్మించి మెసం చేసినట్లు ఆరోపణలు వచ్చాయి. అయితే, అప్పుడు అతడిపై సరైన చర్యలు చేపట్టలేదని విమర్శలు ఉన్నాయి. ఇప్పుడు మరోసారి ఇలాంటి ఆరోపణలు రావడంతో, పాత కేసుల పై మళ్లీ విచారణ చేపట్టే అవకాశం ఉందని పోలీసు వర్గాలు వెల్లడిస్తున్నాయి. బాధిత బాలిక తరఫున కుటుంబ సభ్యులు ముందుకు వచ్చి పోలీసులకు ఫిర్యాదు చేయడంతో కేసు నమోదు అయ్యింది. పోలీసులు బాధితురాలికి మానసిక పరిరక్షణ, కౌన్సిలింగ్, చైల్డ్ వెల్ఫేర్ సపోర్ట్ వంటి అన్ని విధాలుగా సహాయంగా ఉంటున్నట్లు సమాచారం.
తాజావార్తలు
-
ACB Raids : మీర్‌చౌక్ ఇన్స్పెక్టర్కు ఏసీబీ షాక్.. రూ.3 లక్షలు తీసుకుంటూ రెడ్‌హ్యాండెడ్‌గా చిక్కారు
-
Arnab Cyclone: అర్నబ్ తుఫాన్ బీభత్సం.. ఇళ్లలోకి సముద్రపు నీరు, అష్టదిగ్బంధంలో అమలాపురం!
-
Venkatesh : గతంలో ప్రేమించా.. కానీ ఇప్పుడు నా ఫ్యామిలీ జోలికొస్తే వదలను!
-
Train Accident: చెవిలో ఇయర్‌ఫోన్స్.. వెనుక రైలు.. క్షణాల్లో ప్రాణం బలి!
-
Trivikram : కుటుంబం.. ఒక పద్మవ్యూహం
ట్రెండింగ్
-
Bloating Before Periods: పీరియడ్స్ ముందు కడుపు ఉబ్బరంగా ఉంటోందా? ఈ లక్షణాలను లైట్ తీసుకోవద్దు..
-
How Do Parrots Talk : చిలుకలు మనుషుల్లా ఎలా మాట్లాడతాయో తెలుసా? జంతువులకూ యాసలు
-
Karwa Chauth 2026 : కర్వా చౌత్ 2026.. తేదీ, పూజా ముహూర్తం ఇదే.!
-
Ayush Badoni: వరుసగా రెండో డబుల్ సెంచరీ.. కోహ్లీ, గంభీర్ సరసన ఆయుష్ బదోని..!
-
IND vs NZ: డారిల్ మిచెల్ విధ్వంసం.. భారత్ ముందు భారీ లక్ష్యం..!