Site icon NTV Telugu

YS Jagan: ఏడాది గడిచింది.. హనీమూన్‌ పీరియడ్‌ ముగిసింది.. ఇక యుద్ధమే..!

Ys Jagan

Ys Jagan

YS Jagan: కూటమి ప్రభుత్వానికి ఏడాది గడిచింది.. హనీమూన్‌ పీరియడ్‌ ముగిసింది.. ఇక నుంచి యుద్ధం చేయాల్సిందే.. కాబట్టి అందరినీ కలుపుకుపోవాలి.. ప్రజలకు అందుబాటులో ఉండాలని సూచించారు వైసీపీ అధినేత, మాజీ సీఎం వైఎస్‌ జగన్‌.. తాడేపల్లిలోని వైసీపీ కేంద్ర కార్యాలయంలో జరిగిన విస్తృతస్థాయి సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. ఇది ఎమ్మెల్యే అభ్యర్థులకు చాలా కీలకం.. ప్రజా సమస్యలు తెలుసుకోవాలి. వారికి అందుబాటులో ఉండాలి. ప్రజల సమస్యలపై పోరాడాలి. అప్పుడే మనం సత్తా చూపగలం అని సూచించారు.. ప్రజా సమస్యలపై మనం పోరాడాలి.. వారితో మమేకం కావాలి.. ఎందుకంటే ఇది రాక్షస రాజ్యం.. ప్రజలకు సమస్యలు పరిష్కారం కావడం లేదు. కలెక్టర్ల దగ్గరకు పోయినా, ప్రయోజనం ఉండడం లేదు. మనం ప్రతి చోటా, ప్రతి క్షణం ప్రజలతో మమేకం కావాలి. వారి సమస్యల పరిష్కారం కోసం చొరవ చూపాలి.. కృషి చేయాలని దిశానిర్దేశం చేశారు..

Read Also: Rachakonda CP: ఏనుగు దంతాలు స్మగ్లింగ్ చేస్తున్న వ్యక్తి అరెస్ట్.. రూ. 3 కోట్ల విలువ గల ఏనుగు దంతాలు సీజ్

రీకాలింగ్‌ చంద్రబాబూస్‌ మ్యానిఫెస్టో.. పేరుతో ‘చంద్రబాబు మ్యానిఫెస్టోను గుర్తుకు తెస్తూ.. వైసీపీ ఐదు వారాల బృహత్తర కార్యక్రమం నిర్వహించాలని ఆదేశించారు వైఎస్‌ జగన్.. బాబు ష్యూరిటీ.. మోసం గ్యారెంటీ… ఎన్నికల ముందు చంద్రబాబు ఇచ్చిన హామీలు.. అమలు చేయకపోవడాన్ని ప్రజల్లో ఎండగట్టాలి.. రాష్ట్రంలో ప్రభుత్వం మారి ఏడాది అవుతోంది.. ఇంత తక్కువ వ్యవధిలో ఒక ప్రభుత్వంపై వ్యతిరేకత ఈ స్థాయిలో గతంలో ఏనాడూ లేదు.. అంత తక్కువ కాలంలోనే ఇంత దారుణమైన ప్రజా ప్యతిరేకత కనిపిస్తోంది.. చంద్రబాబు ఈ వ్యతిరేకత మధ్య, ప్రజలకు మంచి చేయాల్సింది పోయి, ప్రజలను తప్పు దోవ పట్టించాలని చూస్తున్నారు. రాష్ట్రంలో డైవర్షన్‌ పాలిటిక్స్‌తో పాటు, అణిచివేత చూస్తున్నాం.. రెడ్‌బుక్‌ పాలన చూస్తున్నాం.. గత వైసీపీ ప్రభుత్వం, ప్రస్తుత ప్రభుత్వం మధ్య స్పష్టంగా తేడా కనిపిస్తోందన్నారు..

Read Also: Love: తనను ప్రేమించి మరొకరితో పెళ్లికి సిద్ధమవడంతో.. అసలు ఏం జరిగిందంటే?

మన ఐదేళ్ల పాలనలో వివక్ష లేకుండా పథకాలు అందించాం.. పార్టీ చూడకుండా మంచి చేశాం అన్నారు వైఎస్‌ జగన్‌.. ఈ ఏడాది కాలంలో కూటమి ప్రభుత్వం కేవలం రెడ్‌బుక్‌ రాజ్యాంగం అమలు చేస్తూ.. విచ్చలవిడిగా అన్యాయాలు కనిపిస్తున్నాయి. గత ప్రభుత్వంలో ఎప్పుడూ చూడని విధంగా విద్య, వైద్యం, వ్యవసాయంలో విప్లవాత్మక మార్పులతో పాటు, పాలనలో పూర్తి పారదర్శకత చూపాం. దిశ యాప్‌ ద్వారా మహిళలకు రక్షణ కల్పించాం. ఇలా ఎన్నో మార్పులు చూశాం.. కానీ, చంద్రబాబు ఈ ఏడాది పాలనలో మోసం, దగా తప్ప ఏమీ లేదు.. ఎన్నికల ముందు ఇచ్చిన ఏ ఒక్క హామీ కూడా నిలబెట్టుకోలేదు. ఈ ప్రభుత్వం వచ్చి ఏడాది పూర్తవుతుంది. ఏడాది పాలనలో చంద్రబాబు వల్ల ప్రతి కుటుంబానికి జరిగిన నష్టం ఎంత.. ఈ ఏడాది కూడా పథకాలు లేవు కాబట్టి, ఇంకా ఎంత నష్టం జరుగుతోంది. మరోవైపు వైసీపీ ప్రభుత్వం ఉండి ఉంటే, ప్రజలకు ఎన్ని ప్రయోజనాలు కలుగుతాయనేది చెప్పగలగాలి.. చంద్రబాబు మోసాలపై ప్రజలను చైతన్యం చేయాలి. చంద్రబాబు తానిచ్చిన హామీల రిబ్బన్‌ కూడా కట్‌ చేయకుండా, అన్నీ అమలు చేశామని చెబుతున్నాడు. ఎవరైనా ప్రశ్నిస్తే, నాలుక మందం అంటున్నాడు. రీకాలింగ్‌ చంద్రబాబూస్‌ మ్యానిఫెస్టో.. అదే తెలుగులో.. చంద్రబాబు మ్యానిఫెస్టోను గుర్తుకు తెస్తూ.. కార్యక్రమానికి శ్రీకారం చుడుతున్నాం అని పేర్కొన్నారు వైఎస్‌ జగన్‌..

Exit mobile version