NTV Telugu Site icon

YS Jagan: ఓటమిపై మరోసారి జగన్‌ ఆసక్తికర వ్యాఖ్యలు.. ఇన్నిచేసినా ఎందుకు ఓడిపోయాం..?

Ys Jagan

Ys Jagan

YS Jagan: గత ఎన్నికల్లో వైఎస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ ఎందుకు ఓడిపోయింది అంటూ మరోసారి ప్రశ్నించారు ఆ పార్టీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్మోహన్‌రెడ్డి.. ఉమ్మడి ప్రకాశం జిల్లా నేతలతో సమావేశమైన ఆయన.. ఈ సందర్భంగా పలు అంశాలపై స్పందించారు.. అధికారంలోకి వచ్చిన ఆరు నెలలకే ఎప్పుడూ చూడని వ్యతిరేకత కూటమి ప్రభుత్వం పట్ల కనిపిస్తోందన్నారు. మన ప్రభుత్వంలో విప్లవాత్మక మార్పులు తీసుకు వచ్చాం.. ఎన్నికల మేనిఫెస్టోను పూర్తిగా అమలు చేసి మన చరిత్రను మార్చాం.. బడ్జెట్‌ సమయంలోనే సంక్షేమ క్యాలెండర్‌ను ప్రవేశపెట్టాం.. అంత గొప్పగా మనం పాలన అందించాం.. లంచాలు లేకుండా ప్రభుత్వ పథకాలు ఇచ్చే పరిస్థితులను తీసుకొచ్చాం.. వివక్ష లేకుండా అందిచగలడం సాధ్యమే అని చూపించాం.. మన పాలనలో స్కూళ్లు మారాయి.. ప్రభుత్వ స్కూళ్లతో ప్రైవేటు స్కూళ్లు పోటీపడే పరిస్థితిని తీసుకు వచ్చాం.. వైద్యరంగంలోకూడా గొప్ప మార్పులు తీసుకువచ్చాం.. ఫ్యామిలీ డాక్టర్‌ కాన్సెప్ట్‌ను తీసువచ్చాం.. ఆర్బీకేల ద్వారా ప్రతి రైతుకూ మద్దతు ధర అందించాం.. అవినీతి లేని పాలనను అందించాం.. ఇన్నిచేసినా మనం ఓటమి పాలయ్యాం.. ఎందువల్ల అని ప్రశ్నించారు జగన్‌.. అయితే, ఈ సమావేశానికి హాజరైన ప్రజాప్రతినిధులు ఈవీఎం.. ఈవీఎం అంటూ బదులిచ్చారు..

Read Also: Manchu Vishnu: వినయ్ మా నాన్నకి మొదటి బిడ్డ లాంటి వారు.. ఎలా కొడతారు?

అయితే, ఈవీఎం ఓట్లు, వీవీపాట్లు లెక్కించాలని అడిగామని గుర్తుచేసుకున్నారు వైఎస్‌ జగన్‌.. మేం అడిగిన 12 బూత్‌ల్లో లెక్కించాలని అడిగాం.. కానీ మాక్‌ పోలింగ్‌ చేస్తామంటున్నారు. ఇది కాకుండా మరొక కారణం చంద్రబాబు ఇచ్చిన హామీలు.. మనం ప్రతి ఇంటికీ పలావు పెడితే.. చంద్రబాబు ప్రతి ఒక్కరికీ బిర్యానీ పెడతానన్నాడు.. ఇప్పుడు పలావూ పోయిందీ.. బిర్యానీ కూడా పోయిందీ అంటూ ఎద్దేవా చేశారు.. హామీల విషయంలో జగన్‌ చేయగలిగాడు, చంద్రబాబు కూడా చేస్తాడేమోనని ప్రజలు అటువైపు మొగ్గుచూపారు.. కానీ, ఎలాంటి కారణాలు చూపకుండా, కోవిడ్‌ లాంటి సంక్షోభాన్ని వచ్చినా సరే ఒక యుద్ధంచేలా చేసి మనం హామీలు నెరవేర్చాం.. మనకున్న వ్యక్తిత్వం, విశ్వసనీయత వల్లే మనం రేపు మళ్లీ అధికారంలోకి వస్తాం అనే నమ్మకాన్ని వ్యక్తం చేశారు.. అతిమంచితనం, అతి నిజాయితీతనం.. ఈ రెండింటి వల్ల రాజకీయాల్లో ఇబ్బందులు పడుతున్నామని చాలామంది నన్ను ఉద్దేశించి అంటారు.. ఈ బహుశా ఈ రెండే రేపు అధికారంలోకి రావడానికి మనకు తోడ్పడతాయి అన్నారు..

Read Also: Manchu Vishnu: పొట్ట చించుకుంటే.. పేగులు బయటపడతాయ్.. మంచు విష్ణు సంచలన వ్యాఖ్యలు

ఇక, చంద్రబాబు అబద్ధాలు, మోసాలపట్ల ప్రజలు ఆగ్రహంతో ఉన్నారు. ఇప్పుడు డైవర్షన్‌ పాలిటిక్స్‌ చేస్తున్నారు, గోబెల్స్‌ ప్రచారం చేస్తున్నారు. ప్రతినెలా ఒక్కో అంశాన్ని పట్టుకుని ప్రజలను తప్పుదోవ పట్టిస్తున్నారని ఆరోపించారు వైఎస్‌ జగన్‌.. వాళ్లు రాస్తున్న కథనాలు చూస్తుంటే.. ప్రభుత్వంలో ఎరున్నారు? అనే సందేహం కలుగుతుంది. ప్రభుత్వంలో మంత్రులు వాళ్లవాల్లే, అధికారులు వాళ్ల మనుషులే, చివరకు చెక్‌పోస్టులు వాళ్లు పెట్టినవే పోర్టులో కస్టమ్స్‌ వాళ్లు, భద్రతా సిబ్బంది వాళ్లే.. కేంద్రంలోనూ వాళ్లే ఉన్నారు, రాష్ట్రంలోనూ వాళ్లే ఉన్నారు. ఆర్థిక మంత్రి పయ్యావుల సొంత వియ్యంకుడు బియ్యాన్ని ఎగుమతిచేస్తున్నారు. కానీ, ఆ షిప్‌ దగ్గరకు మాత్రం వెళ్లలేదు అని ఫైర్‌ అయ్యారు… బియ్యం ఎగుమతిలో ఏపీ దేశంలోనే నంబర్‌ వన్‌. దశాబ్దాలుగా బియ్యం ఎగుమతులు ఇక్కడ నుంచే జరుగుతున్నాయి. పయ్యావుల వియ్యంకుడు బియ్యం ఎగుమతుల్లో నంబర్‌ వన్‌. అసలు వ్యవస్థీకృత నేరాలు ఎవరు చేస్తున్నారు.. అదనంగా పండించే బియ్యాన్ని ఎగుమతి చేయడంలో తప్పులేదు. కానీ, దీన్ని ఇప్పుడు ట్విస్ట్‌ చేస్తూ తప్పుడు ప్రచారం చేస్తున్నారు.

Read Also: Aqua Farmers: ఆక్వా రైతుల దారుణం.. కార్యకర్తను స్తంభానికి కట్టి..!

మన ప్రభుత్వం హయాంలో డీలర్ల వద్ద తప్పులు జరుగుతున్నాయని, దాన్ని పక్కనపెట్టి.. నేరుగా వాహనాల ద్వారా లబ్ధిదారులకు అందించాం అన్నారు వైఎస్‌ జగన్‌.. స్వర్ణ రకం తినగలిగే బియ్యాన్ని అందించాం.. సార్టెక్స్‌ చేసిన మరీ ఇచ్చాం.. రేషన్‌ బియ్యం దుర్వినియోగానికి పుల్‌స్టాప్‌ పెట్టింది మనమే.. కానీ, మళ్లీ ఈ ప్రభుత్వంలో అన్ని పద్దతులూ మార్చారు. మళ్లీ డీలర్లకు అన్నీ అప్పగించారు.. సార్టెక్స్‌ బియ్యాన్ని ఇవ్వడం లేదు.. ప్రజలకు నాసిరకం బియ్యం సరఫరా చేస్తున్నారు. ప్రజలకు సరిగ్గా బియ్యం ఇవ్వడంలేదు . దీనివల్ల మళ్లీ రేషన్‌ మాఫియా వచ్చింది. ఎమ్మెల్యేలకూ కమీషన్లు వెళ్లే పరిస్థితి వచ్చిందని విమర్శించారు. ధాన్యం కొనుగోళ్లు మన ప్రభుత్వంలో సమర్థవంతంగా అమలు జరిగింది. ఆర్బీకే వ్యవస్థ నీరుగారిపోయింది. రైతులకు గత్యంతరం లేని పరిస్థితులు కల్పిస్తున్నారు. మిల్లర్లకు తక్కువకు అమ్ముకోవాల్సిన పరిస్థితులు కల్పిస్తున్నారని ఆరోపించారు.. చంద్రబాబు వచ్చాడు.. బాదుడు ప్రారంభమైంది.. బిల్లులు చూస్తే షాక్‌లు జరుగుతున్నాయి.. రూ. 15 వేల కోట్లకుపైగా ఛార్జీలు పెంచాడు.. ఈ నెల ఇప్పటికే రూ.6వేల కోట్లకు సంబంధించి భారం మొదలైంది.. వచ్చే నెల రూ.9వేల కోట్లకు సంబంధించి భారం కూడా మొదలవుతుందని విమర్శించారు జగన్‌.

Read Also: Champions Trophy 2025: నేడు ఛాంపియన్స్‌ ట్రోఫీ నిర్వహణపై నిర్ణయం.. టోర్నీ జరగడం కష్టమే: పాక్

చంద్రబాబు సంపద సృష్టి అంటే… బాదుడే బాదుడు అని ఎద్దేవా చేశారు జగన్.. రామాయపట్నం పోర్టు దశాబ్దాల కల.. దాన్ని కట్టింది వైయస్సార్‌సీపీ ప్రభుత్వమే.. దాదాపుగా పూర్తైంది, షిప్‌లు కూడా వచ్చే పరిస్థితి.. ఐదేళ్లలో నాలుగు పోర్టులు కట్టడంమొదలైంది.. ఇప్పుడు వాటిని శెనక్కాయలకు, బెల్లాలకు అమ్మేస్తున్నాడు అని మండిపడ్డారు.. మెడికల్ కాలేజీల రూపంలో, పోర్టుల రూపంలో మనం సంపద సృష్టించాం.. వీటిని పద్దతి ప్రకారం అమ్మే కార్యక్రమం పెట్టాడు. వెలిగొండ రెండు టన్నెల్స్‌ పూర్తిచేశాం.. నల్లమలసాగర్‌ కూడా పూర్తిచేశాం, మెయిన్‌ కెనాల్స్‌ పూర్తిచేశాం.. ఆర్‌ అండ్‌ అర్‌ కింద డబ్బులు ఇవ్వాల్సి ఉంది.. మనం అధికారంలో ఉండి ఉంటే అక్టోబరులో నీళ్లు నింపేవాళ్లం.. అయిపోయిన ఈప్రాజెక్టును ఆర్‌ అండ్‌ ఆర్‌ కూడా ఇవ్వకుండా ఆలస్యంచేస్తున్నారు.. మార్కాపురంలో మనం మెడికల్‌ కాలేజీని దాదాపుగా పూర్తిచేశాం.. ఇప్పుడు దీన్నికూడా అమ్మేయడానికి సిద్ధపడుతున్నారు.. అందుకే మనం అంతా కూడా పోరుబాటు పట్టాల్సిందే.. ప్రజలకు మనం దగ్గర కావాలి.. అలా దగ్గరగా ఉంటే మనకు సానుకూలంగా పరిస్థితి వస్తుంది.. అలా దగ్గరగా ఉన్నవాళ్లే ఎమ్మెల్యేలు కాగలుగుతారు.. ఈనెల 13న రైతు సమస్యలపైన కార్యక్రమం పెట్టాం.. ధాన్యం కనీస మద్దతు ధరకోసం కూడా చేస్తున్నాం.. ఉచిత పంటల బీమాను కూడా ఎత్తివేశాడు.. కరెంటు ఛార్జీల విషయంలో కూడా ఇలాగే చంద్రబాబు అన్నాడు.. నేనున్నా.. నేను తగ్గిస్తా.. అన్నాడు.. కానీ, అధికారంలోకి వచ్చిన 6 నెలల్లోనే రూ. 15000 కోట్లు పెంచాడు.. దీనిపైన ఈనెల 27న కార్యక్రమం పెట్టాం అని వివరించారు..

Read Also: Manchu Family: జల్‌పల్లి నివాసంలో మనోజ్, మౌనిక.. ఆస్పత్రిలో విష్ణు, మోహన్ బాబు.. విచారణకు హాజరవుతారా?

పార్టీని మరింత బలోపేతం చేయాలి.. ఆర్గనైజ్డ్‌ స్ట్రక్చర్‌లోకి తీసుకురావాలి.. దీనికోసం క్రియాశీల మార్పులు తీసుకు వచ్చాం.. ప్రతి పార్లమెంటులో రెండు రోజులు ఉంటాను.. బుధ, గురువారాలు పార్లమెంటు నియోజకవర్గంలో ఉంటాను.. అవసరాన్ని బట్టి శుక్రవారం కూడా ఉండేలా ప్లాన్‌ చేస్తున్నాను.. ఇది ప్రారంభమయ్యేలోపు జిల్లా కమిటీలు, నియోజకవర్గ కమిటీలు, మండల స్థాయి కమిటీలు పూర్తిచేయాలి.. సంక్రాంతి లోపే పూర్తిచేయాలని ఆదేశించారు వైఎస్‌ జగన్..