YS Jagan: ఉమ్మడి గుంటూరు జిల్లా నేతలతో భేటీ.. జగన్ సంచలన వ్యాఖ్యలు
- గుంటూరు జిల్లా వైసీపీ నేతలతో వైఎస్ జగన్ భేటీ..
- టీడీపీ నేతలు గ్రామాల్లోకి, ఇంటింటికీ వెళ్లే పరిస్థితులు లేవు..
- హామీలు నిలబెట్టుకోకపోతే చొక్కాలు పట్టుకోవాలని వాళ్లే అన్నారు..
- బాబు ష్యూరిటీ.. మోసం గ్యారంటీ అయ్యింది..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
YS Jagan: వరుసగా వివిధ జిల్లాల నేతలతో సమావేశమవుతూ వస్తున్న వైసీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్.. ఇవాళ ఉమ్మడి గుంటూరు జిల్లా వైసీపీ నేతలతో భేటీ అయ్యారు.. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. సంచలన వ్యాఖ్యలు చేశారు.. టీడీపీ నాయకులు గ్రామాల్లోకి, ఇంటింటికీ వెళ్లే పరిస్థితులు లేవని.. హామీలు నిలబెట్టుకోకపోతే చొక్కాలు పట్టుకోవాలని వాళ్లే అన్నారు.. బాబు ష్యూరిటీ, భవిష్యత్తు గ్యారంటీ అన్నారు.. ఇప్పుడు బాబు ష్యూరిటీ, మోసం గ్యారంటీ అయ్యిందని ఆరోపించారు.. ప్రజలు కాలర్ పట్టుకునే పరిస్థితి వచ్చింది.. రాష్ట్రంలో స్కాంలు తప్ప ఏమీ జరగడంలేదు.. దోచుకోవడం, దోచుకున్నది పంచుకోవడం తప్ప ఏమీ లేదు.. ఇసుక స్కాం, లిక్కర్ స్కాంలు చేస్తున్నారు.. యథేచ్ఛగా పేకా క్లబ్బులు నడుస్తున్నాయి.. తీవ్రవాదులుపెట్టే కేసులు పెట్టి వేధించి జైళ్లలో పెట్టారని మండిపడ్డారు.. అయితే, చట్టవిరుద్ధంగా, అన్యాయాలు చేసేవారెవ్వరినీ వదిలిపెట్టబోమని వార్నింగ్ ఇచ్చారు.. తప్పు చేసినవారిని చట్టంముదు నిలబెడతామని ప్రకటించారు.
Read Also: Pamban Bridge : ప్రారంభానికి సిద్ధంగా కొత్త పంబన్ బ్రిడ్జీ.. 30 నిమిషాల దూరం కేవలం 5 నిమిషాల్లోనే
Also Read
- Minister Atchannaidu: తుఫాన్ ఎఫెక్ట్.. అధికారులకు మంత్రి అచ్చెన్నాయుడు కీలక ఆదేశాలు
- CM Chandrababu Foreign Trip: ఫ్యామిలీతో సీఎం చంద్రబాబు విదేశీ టూర్.. 3 రోజుల వ్యక్తిగత పర్యటన..
- CM Chandrababu: కరవు సీమ నుంచి కలల సాకారం వైపు.. సీఎం కీలక వ్యాఖ్యలు
- Pawan Kalyan - Vangaveeti Radhakrishna Meet: ఏపీ రాజకీయాల్లో ఆసక్తికర పరిణామం.. పవన్‌తో వంగవీటి రాధా భేటీ
మన పరిపాలనలో రెండున్నర సంవత్సరాలు కోవిడ్ ఉంది.. అందుకే కార్యకర్తలకు చేయాల్సింది చేయలేకపోయాం అన్నారు వైఎస్ జగన్.. 2019-24 మధ్య జగన్ 1.O ప్రభుత్వం నడిచింది.. చరిత్రలో ఎప్పుడూ చూడనివిధంగా వైసీపీ పాలన సాగింది.. ఎలాంటి లంచాలకు తావులేకుండా 2.71 లక్షల కోట్ల డీబీటీ ద్వారా ప్రజలకు అందించాం.. కానీ, చంద్రబాబు ఎన్నికల ముందు ఇచ్చిన హామీలను ఎగరగొట్టారు.. మేనిఫెస్టోను చెత్తబుట్టలోకి విసిరేశారని విమర్శించారు.. ఇక, జగన్ 2.Oలో ప్రతి కార్యకర్తకూడా తోడుగా ఉంటాం.. వాళ్ల ఇంటి పెద్దన్నగా వారికి తోడుగా ఉంటాను అని భరోసా కల్పించారు.. మార్చి నాటికి స్థానిక సంస్థలకు నాలుగేళ్ల పదవీకాలం ముగియబోతోంది.. తమ వాళ్లని పదవుల్లో కూర్చోబెట్టడానికి ప్రభుత్వంలో ఉన్నవాళ్లు ప్రయత్నిస్తారు.. మన వాళ్లను భయపెట్టడానికి, లొంగ దీసుకోవడానికి, ప్రలోభపెట్టడానికి ప్రయత్నిస్తారు.. రాబోయే రోజుల్లో మరిన్ని దొంగకేసులు పెడతారు, అరెస్టులు చేస్తారు.. ఎల్లకాలం పరిస్థితులు ఇలాగే ఉండిపోవు.. రాబోయే మన ప్రభుత్వంలో అందరికీ దగ్గరుండి మేలు చేస్తామని తెలిపారు జగన్..
Read Also: Kamal Haasan: కమల్ హాసన్‌కు ప్రమోషన్.. త్వరలో రాజ్యసభలోకి ఎంట్రీ!
మొన్నటి స్థానిక సంస్థల ఉప ఎన్నికల్లో ప్రజాస్వామ్యం ఖూనీ అయ్యింది.. టీడీపీకి సభ్యులు లేకపోయినా దాడులు చేసి భయపెట్టారు, ప్రలోభ పెట్టారు.. అన్యాయాలు చేసి గెలిచామంటూ గొప్పగా చెప్పుకుంటున్నారని ఫైర్ అయ్యారు జగన్.. మన ప్రభుత్వంలో టీడీపీ రెండే రెండు మున్సిపాల్టీలు గెలిచింది.. మనం గట్టిగా తుమ్మి ఉంటే ఆ రెండు కూడా వారికి వచ్చి ఉండేవి కావని.. కానీ, మనం ప్రజాస్వామ్యానికి కట్టుబడి, ఆ ఫలితాలను గౌరవించాం.. టీడీపీ తప్పుడు సంప్రదాయాలకు పాల్పడుతోందన్నారు.. కార్యకర్తలు గొప్పగా చెప్పుకునేలా నాయకత్వం ఉండాలి.. ముసలమ్మకూడా బటన్లు నొక్కుతుందని చంద్రబాబు అన్నారు.. ఇప్పుడు ఎలా నొక్కాలో చెవిలో చెప్పాలంటున్నారు.. మొహమాటం లేకుండా నిస్సిగ్గుగా మాట్లాడుతున్నారు.. మరి ఈవ్యక్తి చీటర్ కాదా..? అని ప్రశ్నించారు.. ప్రజలను మోసం చేసిన వ్యక్తిపై 420 కేసు పెట్టకూడదా..? అని వ్యాఖ్యానించారు.. ఇక, తిరోగమనంలో విద్య, వైద్యం, వ్యవసాయం, పారిశ్రామిక రంగాలు ఉన్నాయి.. చంద్రబాబు చెప్పిన ప్రతి పథకం అబద్ధం, మోసం.. మొన్నటి ఎన్నికల్లో వైసీపీకి 40శాతం ఓట్లు వచ్చాయి.. 10శాతం ఓట్లు తగ్గటానికి కారణం వారిలా నేను అబద్ధాలు చెప్పలేకపోయాను అన్నారు.. జగన్.. కార్యకర్తలు, ప్రజలందరి మనసులో ఉన్నాడు. ప్రజల కోసం ఇన్ని బటన్లు నొక్కినా మనకే ఈ పరిస్థితి ఉంటే.. రేపు ఇచ్చిన మాటను గాలికొదిలేసిన ఈ ప్రభుత్వంలో ఉన్నవారి పరిస్థితి ఏంటి..? అని ప్రశ్నించారు వైసీపీ అధినేత వైఎస్ జగన్..
తాజావార్తలు
-
Khairatabad Ganapathi Shobha Yatra: అంగరంగ వైభవంగా ఖైరతాబాద్ మహాగణపతి శోభాయాత్ర..!
-
The Paradise Collections: నాని ఊచకోత.. కెరీర్లోనే బిగ్గెస్ట్ ఓపెనింగ్!
-
Childhood Trauma: చిన్నతనంలో జరిగిన మానసిక గాయాలు..ఆ తర్వాత డిప్రెషన్, మద్యం వ్యసనానికి దారితీస్తాయా?
-
Mahesh Babu New Look: ఏమున్నాడ్రా బాబు.. సూపర్ స్టార్ న్యూ లుక్ వైరల్!
-
Redmi 17C 5G: రెడ్ మీ 17c 5G భారత్ లో రిలీజ్ డేట్ ఫిక్స్.. 6.9 ఇంచెస్ 120Hz డిస్ప్లే, 6000mAh బ్యాటరీ, 50MP కెమెరా
-
రూ.5.49 లక్షలకే Tata Aeris.. 6 ఎయిర్‌బ్యాగ్స్, అడ్వాన్స్డ్ సెక్యూరిటీ ఫీచర్లతో బెస్ట్ ఫ్యామిలీ కారు విడుదల!
ట్రెండింగ్
-
IND vs WI: రోహిత్ శర్మ ముందు అరుదైన రికార్డులు.. సెంచరీ చేస్తే సచిన్ సరసన.!
-
Amazon నుంచి Meesho వరకు.. YouTube Shoppingలోకి కొత్త ఈ-కామర్స్ ప్లాట్‌ఫామ్స్!
-
itel ACE 4 Shine: రూ.1,059కే కొత్త ఫీచర్ ఫోన్.. టైప్-C ఛార్జింగ్‌తో పాటు అదిరిపోయే ఫీచర్లు.!
-
LIC Smart Pension Plan: రిటైర్మెంట్ తర్వాత ఆర్థిక భద్రత ఇచ్చే బెస్ట్ స్కీమ్.. జీవితాంతం నెలకు రూ. 25,000 పెన్షన్..!
-
Wall Weeds: గోడలు మొలిచే పిచ్చి మొక్కలతో భవనాలకే ముప్పు.. సింపుల్ చిట్కాలు ఇవే..!