Site icon NTV Telugu

YS Jagan: పేర్లు రాసిపెట్టుకోండి.. మన టైం వస్తుంది.. అన్యాయం చేసినవారికి సినిమా చూపిస్తాం..!

Ys Jagan

Ys Jagan

YS Jagan: అన్యాయం చేయాలనుకుంటే చేయమనండి.. కొడతానంటే.. కొట్టమనండి.. కానీ, మీరు ఏ పుస్తకంలోనైనా పేర్లు రాసుకోండి.. అన్యాయాలు చేసిన వారికి సినిమాలు చూపిస్తాం అంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు వైసీపీ అధినేత, మాజీ సీఎం వైఎస్‌ జగన్మోహన్‌రెడ్డి.. వైఎస్సార్‌సీపీ స్ధానిక సంస్ధల ప్రజాప్రతినిధులతో సమావేశమైన జగన్.. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. కూటమి సర్కార్‌, అధికారులు, పోలీసులకు సీరియస్‌ వార్నింగ్‌ ఇచ్చారు.. రాష్ట్రంలో రాక్షస పాలన కొనసాగుతోంది.. కానీ, కలియుగంలో రాజకీయాలు చేయాలంటే భయం ఉండకూడదు.. కేసులకు, జైళ్లకూ భయపడకూడదు.. అలా అయితేనే రాజకీయాలు చేయగలం.. చంద్రబాబు చేస్తున్న రాజకీయాలు అలా ఉన్నాయి అని ఫైర్‌ అయ్యారు.

Read Also: Jyoti Malhotra Case: యాంటి టెర్రర్ ఇన్వెస్టిగేషన్ కు జ్యోతి మల్హోత్రా కేసు

ఇక, చంద్రబాబు ప్రజాస్వామ్యాన్ని పట్టపగలే ఖూనీచేస్తున్నాడని దుయ్యబట్టారు వైఎస్‌ జగన్‌.. స్థానిక సంస్థల ఉప ఎన్నికల్లో ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేస్తున్నారు. తిరువూరులో సంఖ్యాబలం లేని చోటకూడా టీడీపీ పోటీకి ప్రయత్నంచేస్తోంది.. మెజార్టీ వైసీపీ ఉందంటే ఎన్నికను ఆపుతున్నారు.. పోలీసులు.. వైసీపీ వాళ్లని అరెస్టు చేస్తున్నారు. టీడీపీ వాళ్లని రోడ్డుపై విడిచిపెడుతున్నారు.. కానీ, రేపు కచ్చితంగా వైసీపీకి కార్యకర్తే నంబర్‌ వన్‌ అని పేర్కొన్నారు.. అన్యాయం చేయాలనుకుంటే చేయమనండి.. కొడతానంటే.. కొట్టమనండి.. కానీ, మీరు ఏ పుస్తకంలోనైనా పేర్లు రాసుకోండి… మనకూ టైం వస్తుంది.. అన్యాయాలు చేసిన వారికి సినిమాలు చూపిస్తాం.. రిటైర్డ్‌ అయిన వారిని కూడా లాక్కుని వస్తాం.. దేశం విడిచిపెట్టి వెళ్లినా సరే రప్పిస్తాం.. అన్యాయాలు చేసిన ఒక్కొక్కరికి సినిమాలు చూపిస్తాం అని హెచ్చరించారు.

Read Also: Damodara Raja Narsimha : సర్కార్ దవాఖానలో న్యాయమూర్తి ప్రసవం.. ప్రజల్లో ప్రభుత్వ వైద్యంపై నమ్మకానికి..!

చంద్రబాబు నాటిని విత్తనాలు.. కచ్చితంగా ఈ పరిస్థితులకు దారితీస్తాయి.. మహిళలు అని చూడకుండా నెలలతరబడి జైళ్లలో పెడుతున్నారు అని ఆగ్రహం వ్యక్తం చేశారు వైఎస్‌ జగన్‌.. ఒక కేసులో బెయిల్‌ వస్తుంది, అది రాగానే మరో కేసు పెడుతున్నారు.. ఇలా కేసులు మీదు కేసులు పెడుతున్నారు.. వల్లభనేని వంశీ విషయంలో ఇలాగే చేశారని ఆవేదన వ్యక్తం చేశారు.. దళితుడైన నందిగం సురేష్‌ విషయంలోనే ఇలాగే దారుణాలు చేస్తున్నారు.. సుమారు నెలన్నరకుపైగా జైల్లో ఉండి బయటకు వచ్చిన తర్వాత ఇప్పుడు మళ్లీ కేసుపెట్టి జైల్లో వేశారు అంటూ మండిపడ్డారు.

Exit mobile version