YS Jagan Digital Book: ‘డిజిటల్ బుక్’ పేరుతో ప్రత్యేక పోర్టల్‌ను ప్రారంభించారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత, మాజీ సీఎం వైఎస్ జగన్మోహన్‌రెడ్డి.. ఎలాంటి అన్యాయం జరిగిన అప్‌లోడ్ చేయండి అని పిలుపునిచ్చారు.. Digitalbook.weysrcp.com పేరుతో పోర్టల్ లాంచ్ చేశారు జగన్.. అన్యాయం మరియు రాజకీయ బాధితులను ఎదుర్కొన్న వైఎస్ఆర్సీపీ కార్యకర్తలు మరియు నాయకులకు అండగా నిలిచేందుకు.. ప్రత్యేక పోర్టల్ తెస్తామంటూ గత కొంతకాలంగా చెబుతూ వచ్చిన వైఎస్ జగన్ మోహన్ రెడ్డి.. ఈరోజు పార్టీ అధికారిక వేదికపై ఒక అద్భుతమైన డిజిటల్ బుక్‌ను ప్రారంభించారు. ఇది https://digitalbook.weysrcp.com/auth/phoneలో ఆన్‌లైన్‌లో అందుబాటులో ఉంది. దీని ద్వారా ఎవరైనా తాము ఎదుర్కొన్న అన్యాయానికి సంబంధించిన వివరాలను నేరుగా అప్‌లోడ్ చేయవచ్చు, ప్రతి సంఘటనను శాశ్వత డిజిటల్ డైరీలో నమోదు చేసి భద్రపరుస్తారు. వెబ్‌సైట్‌తో పాటు, 040-49171718 ద్వారా IVRS కాల్ సౌకర్యం ఏర్పాటు చేసింది వైసీపీ.. దీని ద్వారా కార్మికులు మరియు బాధితులు ఫోన్ ద్వారా తమ ఫిర్యాదులను నమోదు చేసుకోవచ్చు.
Read Also: Saiyaara: ‘సైయారా’ హిట్ తో 200 మంది కష్టం వృధా – అనుపమ్ ఖేర్
ఇక, డిజిటల్ బుక్ కు సంబంధించిన ఓ క్యూఆర్ కోడ్‌ను కూడా రూపొందించారు.. పోర్టల్‌కు వెళ్లి.. సమస్యలు రాయడం.. దానికి సంబంధించిన వీడియోలు అప్‌లోడ్ చేయడం ఇబ్బందిగా ఉంటే.. నేరుగా క్యూఆర్ కోడ్ స్కాన్ చేసి కూడా తమ సమస్యకు సంబంధించిన వీడియోలు అప్‌లోడ్ చేసి.. దానికి సంబంధించిన వివరాలు రాయాల్సి ఉంటుంది.. కాగా, కూటమి సర్కార్‌లో వైసీపీ నేతలను, శ్రేణులను ఇబ్బందులు పెడుతున్నారు.. మన ప్రభుత్వంలో వడ్డితో సహా చెల్లిస్తామంటూ పలు సందర్భాల్లో వైఎస్ జగన్ హెచ్చరించారు.. జగన్ 2.0లో మనల్ని ఇబ్బంది పెట్టిన వారిని.. అన్యాయంగా వ్యవహరించినవారిని వదిలేది లేదని పలు సందర్భాల్లో వార్నింగ్ ఇచ్చారు వైఎస్ జగన్..