CM Chandrababu: నదీ గర్భానికి.. నదీ పరివాహక ప్రాంతానికి తేడా తెలియదు..! జగన్‌కు సీఎం కౌంటర్..
- అమరావతి పై జగన్ మళ్లీ అసత్య ప్రచారాలు చేస్తున్నాడు..
- చాలా దేశాలు రివర్ ఫ్రంట్ లో ఉన్నాయి...
- అమరావతి పై వైసీపీ ఎప్పుడు విష ప్రచారం చేస్తూనే ఉంది..
- జగన్ కనీసం అవగాహన లేకుండా మాట్లాడుతున్నాడు..
- సింధు నాగరికత అభివృద్ధి చెందింది నదీ తీరనే...
- ఢిల్లీ సహా అనేక ప్రధాన నగరాలు నదీ తీరాల పక్కనే ఉన్నాయి..
- నదీ గర్బానికి నదీ పరివాహక ప్రాంతానికి జగన్ కు తేడా తెలియదు...
- Follow Us :
-
-
Add as a preferred
source on google
రాజధాని అమరావతిపై మరోసారి రచ్చ మొదలైంది.. వైసీపీ అధినేత, మాజీ సీఎం వైఎస్ జగన్ రాజధాని నిర్మాణం విషయంలో చేసిన వ్యాఖ్యలు.. వాటికి కూటమి మంత్రులు, నేతలు కౌంటర్ ఇవ్వడంతో.. హాట్ టాపిక్‌గా మారిపోయింది.. మరోవైపు, వైఎస్ జగన్ వ్యాఖ్యలపై కౌంటర్ ఎటాక్‌కు దిగారు సీఎం నారా చంద్రబాబు నాయుడు.. టీడీపీ ప్రధాన కార్యాలయంలో మీడియా చిట్‌చాట్‌లో ఆయన మాట్లాడుతూ.. నదీ గర్భం (River Bed)కు, నదీ పరివాహక ప్రాంతం (River Front)కు మధ్య ఉన్న తేడా కూడా వైసీపీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డికి తెలియదని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు విమర్శించారు. అమరావతి రాజధానిపై జగన్ మళ్లీ అసత్య ప్రచారాలు చేస్తున్నారని, ప్రజలు బుద్ధి చెప్పినప్పటికీ రాజధానిపై విషం చిమ్మడం మానట్లేదని ఆయన మండిపడ్డారు.
Read Also: Anil Ravipudi : ప్రకృతి వార్నింగ్’తో పుట్టిన హుక్ స్టెప్..అందుకే నా నిర్మాతలు ఎప్పుడూ హ్యాపీ!
Also Read
- YS Jagan : రాయలసీమ హార్టికల్చర్‌పై చంద్రబాబువి అంకెల గారడీలు
- Sajjala Ramakrishna Reddy : లోకల్ ఎలక్షన్స్‌కు వైసీపీ లీగల్ టీమ్ రెడీ.. సజ్జల కీలక ఆదేశాలు
- Pan IIT Summit : చంద్రబాబు చూపు ఈవీపై.. ఏపీకి కొత్త టెక్నాలజీ ప్లాన్..
- Minister Nara Lokesh: స్పీడ్.. సర్వీస్.. స్టెబిలిటీ.. ఏపీ అభివృద్ధిపై మంత్రి లోకేష్ కీలక వ్యాఖ్యలు
చిట్‌చాట్‌లో హాట్ కామెంట్లు చేశారు సీఎం చంద్రబాబు.. వైఎస్ జగన్ రాయలసీమకు తీరని ద్రోహం చేశారని ఆరోపించారు. ప్రపంచంలోని అనేక దేశాలు, ప్రధాన నగరాలు నదీ తీరాల పక్కనే అభివృద్ధి చెందాయని తెలిపారు. సింధు నాగరికత కూడా నదీ తీరంలోనే వికసించిందని గుర్తు చేశారు. ఢిల్లీ, లండన్ సహా ప్రపంచంలోని ప్రముఖ నగరాలన్నీ నదీ తీరాల్లోనే ఉన్నాయని ఉదాహరణగా పేర్కొన్నారు. అమరావతి విషయంలో వైసీపీ ఎప్పటికప్పుడు విష ప్రచారం చేస్తోందని, కనీస అవగాహన లేకుండా జగన్ మాట్లాడుతున్నారని చంద్రబాబు విమర్శించారు. మిగులు జలాలను వినియోగించుకోవడం ఎలా తప్పవుతుందో జగన్ చెప్పాలని ప్రశ్నించారు. జగన్ వ్యాఖ్యలపై మంత్రులు ఇప్పటికే ఘాటుగా స్పందించారని తెలిపారు.
రాష్ట్రంలో వచ్చే రెండేళ్లలో నీటి కొరత లేకుండా సమగ్ర ప్రణాళికతో ముందుకు వెళ్తున్నామని చంద్రబాబు స్పష్టం చేశారు. నీటి సద్వినియోగం వల్లే రాయలసీమలో ఉద్యాన వన పంటలు అభివృద్ధి చెందాయని, దేశ ఉద్యాన వన రంగంలో ఆంధ్రప్రదేశ్ తొలి స్థానంలో నిలిచిందని చెప్పారు. నీటి విషయంలో వివాదాలు ఏర్పడితే నష్టపోయేది తెలుగు ప్రజలేనని, రెండు తెలుగు రాష్ట్రాలు బాగుండేలా చూడడం తప్పేమీ కాదని అన్నారు. మిగులు జలాల సద్వినియోగంతోనే రాష్ట్రాలు సుభిక్షంగా మారుతాయని చంద్రబాబు పేర్కొన్నారు. రాయలసీమకు నీరిచ్చామనే విషయానికి పట్టిసీమ ప్రాజెక్టే నిదర్శనమని చెప్పారు సీఎం చంద్రబాబు… పట్టిసీమ ద్వారా రాయలసీమపై తమ చిత్తశుద్ధిని చాటుకున్నామని, ఆ ప్రాజెక్ట్ వల్ల ఉద్యాన వన పంటలు గణనీయంగా పెరిగాయని తెలిపారు. అయితే, 2020లో రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్ట్‌ను నిలిపివేసి స్వార్థ రాజకీయాలు చేశారని జగన్ ప్రభుత్వంపై చంద్రబాబు ఆరోపించారు. కేవలం పట్టిసీమలో మట్టి పనులు చేసి రూ.900 కోట్ల బిల్లులు చేసుకున్నారని విమర్శించారు. రాష్ట్ర ప్రయోజనాలే తమకు ప్రధానం అని, నీటి విషయంలో ఎలాంటి రాజీ ఉండదని చంద్రబాబు నాయుడు స్పష్టం చేశారు.
తాజావార్తలు
-
Singeetam Srinivasa Rao: టాలీవుడ్లో విషాదం.. ప్రముఖ దర్శకుడు సింగీతం శ్రీనివాసరావు కన్నుమూత
-
Story Board : తెలుగు రాష్ట్రాల్లో కమ్ముకొస్తున్న తాగునీటి కొరత
-
Akbaruddin Owaisi : వచ్చే ఎన్నికల్లో పోటీ చేయను.. ఎంఐఎం ఎమ్మెల్యే అక్బరుద్దీన్ ఓవైసీ సంచలన వ్యాఖ్యలు
-
OTR: కౌన్ బనేగా ఎమ్మెల్సీ? ఆ లక్కీ లీడర్ ఎవరు?
-
Mad Sandhu: ప్రముఖ పంజాబీ ఇన్ఫ్లుయెన్సర్ దారుణహత్య.. నడిరోడ్డుపై కాల్చి చంపిన దుండగులు..
ట్రెండింగ్
-
National Boyfriend Day: మీ ప్రేమను మరింత స్పెషల్‌గా మార్చే సింపుల్ టిప్స్.!
-
Viral: అదనపు ఆదాయం కోసం ఆటో కొన్న సాఫ్ట్‌వేర్ ఉద్యోగి.. చివరికి ఏం జరిగిందో తెలుసా..
-
India Playing 11: ఇద్దరు హైదరాబాద్ ఆటగాళ్లకు ఛాన్స్.. వెస్టిండీస్‌తో చివరి వన్డేకు భారత్ తుది జట్టు ఇదే!
-
India vs Pakistan Final: భారత్, పాకిస్థాన్ ఫైనల్.. మ్యాచ్ రద్దయితే గోల్డ్ మెడల్ ఎవరికి?.. కీలక రూల్ ఇదే!
-
Rajasthani Dal Baati: నోట్లో వేస్తే కరిగిపోయే నెయ్యి బాటీలు, ఘాటైన దాల్ కాంబినేషన్ ఇలా చేయండి..!