YS Jagan: పీఎస్‌కు వెళ్లాలంటే భయపడే పరిస్థితి.. జగన్ సంచలన వ్యాఖ్యలు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
YS Jagan: ఆంధ్రప్రదేశ్‌లో చట్టవ్యవస్థ పూర్తిగా దిగజారిపోయిందని మాజీ ముఖ్యమంత్రి, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఆరోపించారు. గతంలో రాష్ట్ర అభివృద్ధిపై చర్చ జరిగేదని, ఇప్పుడు మాత్రం “రెడ్‌బుక్ రాజ్యాంగం”, పోలీస్ స్టేషన్లలో జరుగుతున్న లాకప్ మరణాలపై చర్చ జరుగుతోందని విమర్శించారు. రాష్ట్రంలో పోలీస్ స్టేషన్‌కు వెళ్లాలంటే ప్రజలు భయపడే పరిస్థితి ఏర్పడిందన్నారు. ప్రభుత్వాన్ని ప్రశ్నించిన వారి గొంతులు నొక్కే ప్రయత్నాలు జరుగుతున్నాయని, చట్టాన్ని చేతుల్లోకి తీసుకుని విభేదించే స్వరాలను అణచివేస్తున్నారని జగన్ ఆరోపించారు. విజయవాడ సాయికృష్ణ కేసు, క్రాంతికుమార్ ఆత్మహత్య, కర్నూలు గంగమ్మ ఘటన వంటి సంఘటనలు రాష్ట్రంలో నెలకొన్న పరిస్థితులకు అద్దం పడుతున్నాయని పేర్కొన్నారు.
సాయికృష్ణ కేసును ప్రస్తావిస్తూ, కస్టడీలో ఒక వ్యక్తిని హింసించి హత్య చేసి, ఆధారాలను మాయం చేశారని ఆరోపించారు. కుటుంబ సభ్యులకు కనీసం అస్థికలు కూడా ఇవ్వలేదని అన్నారు. ఈ ఘటనపై దేశవ్యాప్తంగా ఆందోళన వ్యక్తమైన తర్వాత ప్రభుత్వం వైఖరి మార్చుకుందని, తొలుత బాధితుడిని రౌడీషీటర్‌గా చిత్రీకరించి, తర్వాత కుటుంబాన్ని పిలిచి న్యాయం చేస్తామని చెప్పడం విరుద్ధ వైఖరికి నిదర్శనమని విమర్శించారు. రాష్ట్రంలో చట్టం, న్యాయం అమలు కావడం లేదని, బాధితులకు మద్దతు తెలిపిన వారిపైనా విమర్శలు చేస్తున్నారని జగన్ ఆరోపించారు. ప్రభుత్వ చర్యలపై ప్రజలు అప్రమత్తంగా ఉండాలని ఆయన పిలుపునిచ్చారు.
Also Read
- 108 Ambulances at District Courts: జిల్లా కోర్టుల వద్ద 108 అంబులెన్సులు.. ఏపీ ప్రభుత్వ కీలక నిర్ణయం
- AP Government: భూ కేటాయింపు విధానంలో కీలక సంస్కరణలు.. ఏపీ ప్రభుత్వ సంచలన నిర్ణయం
- Andhra Pradesh Ranks No.1: మహిళా పారిశ్రామికవేత్తలకు అండగా ఏపీ.. దేశంలోనే అగ్రస్థానం
- Pawan Kalyan Meets Devendra Fadnavis: పవన్ – ఫడ్నవీస్ భేటీ.. పులుల సంరక్షణపై కీలక నిర్ణయం
తాజావార్తలు
-
KTR-Prabhas: రచ్చ రచ్చే.. లైవ్‌లో రెబల్ స్టార్ ప్రభాస్‌కు ఫోన్ చేసిన కేటీఆర్ (వీడియో)
-
YS Jagan: పీఎస్‌కు వెళ్లాలంటే భయపడే పరిస్థితి.. జగన్ సంచలన వ్యాఖ్యలు
-
UK Roads Melt at 40°C: 40°Cకే UK రోడ్లు కరుగుతుంటే.. 45°C దాటినా తట్టుకుంటున్న భారతీయ రోడ్లు.. ఆసక్తికరమైన కారణాలు
-
Varanasi : ‘వారణాసి’ వార్ సీన్స్.. మైండ్ బ్లోయింగ్ అంతే
-
Ayodhya: “వాష్‌రూమ్‌లలో డబ్బు దాచాం”.. అయోధ్య కేసులో నిందితుడు బయటపెట్టిన సంచలన నిజాలు
ట్రెండింగ్
-
Harry Brook: మా ప్లాన్స్ మాకున్నాయి.. దాచాం చాలా.. వైభవ్‌ను ఈజీగా బుట్టలో వేస్తాం!
-
Vaibhav Sooryavanshi: వైభవ్ సూర్యవంశీకి ఛాన్స్ రాకపోవడమే మంచిది.. అసలు కారణం..!
-
IND vs ENG 1st T20: ఇంగ్లండ్ తుది జట్టు ప్రకటన.. ఆ ఇద్దరు స్టార్లకు నో ప్లేస్.. టీమిండియా హ్యాపీ!
-
Farmer Job Offer: జాబ్ ఆఫర్ చేసిన మహిళా రైతు.. ఉదయం 6 నుంచి 2 గంటల వరకు పని.. టీ, బ్రేక్‌ఫాస్ట్ ఫ్రీ..
-
Bread Pakoda Recipe: కరకరలాడే స్ట్రీట్ స్టైల్ ‘బ్రెడ్ పకోడా’.. సులువుగా ఇంట్లోనే చేసేయండి ఇలా.!