YS Jagan: సాయికృష్ణ కేసులో కవర్అప్ జరిగిందా? జగన్ సంచలన ఆరోపణలు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
YS Jagan: విజయవాడ సాయికృష్ణ కేసులో పోలీసు ఉన్నతాధికారులు కిందిస్థాయి అధికారులను మాత్రమే బాధ్యులుగా చూపిస్తూ అసలు విషయాన్ని కప్పిపుచ్చే ప్రయత్నం చేస్తున్నారని మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఆరోపించారు. సాయికృష్ణ రిమాండ్ రిపోర్ట్‌ను పరిశీలిస్తే పై అధికారులను ఎలా కాపాడుతున్నారో స్పష్టంగా అర్థమవుతుందని ఆయన అన్నారు. సాయికృష్ణను మార్కాపురం నుంచి టాస్క్‌ఫోర్స్ పోలీసులు తీసుకువచ్చి కృష్ణలంక పోలీసులకు అప్పగించారని, దీనికి సంబంధించిన అక్నాలెడ్జ్మెంట్ కూడా ఉందని జగన్ పేర్కొన్నారు. సాయికృష్ణ తల్లి, బంధువులు సీపీ, డీజీపీకి ఫిర్యాదులు చేసినా స్పందించలేదని, రాష్ట్రంలో వ్యవస్థలు పూర్తిగా కుప్పకూలిపోయాయని ఆరోపించారు.
కృష్ణలంక పోలీస్ స్టేషన్‌కు సంబంధించిన సీసీటీవీ ఫుటేజ్ విషయంలోనూ అనేక సందేహాలు ఉన్నాయని జగన్ అన్నారు. ఒక రిమాండ్ రిపోర్ట్‌లో నెల రోజుల ఫుటేజ్ లేదని, మరో రిపోర్ట్‌లో 18 నెలల ఫుటేజ్ అందుబాటులో లేదని పేర్కొనడం అనుమానాలకు తావిస్తోందన్నారు. క్లౌడ్ సర్వర్లలో డేటా అందుబాటులో ఉన్నప్పటికీ దానిని ఎందుకు సేకరించలేదని, కాల్ రికార్డులు ఎందుకు పరిశీలించలేదని ప్రశ్నించారు. పోలీస్ వ్యవస్థను దుర్వినియోగం చేస్తున్నారని ఆరోపించిన జగన్, సాయికృష్ణ కేసుతో పాటు ఇతర ఘటనల్లోనూ పూర్తి స్థాయిలో విచారణ జరగాలని డిమాండ్ చేశారు. రాష్ట్రంలో న్యాయవ్యవస్థ, చట్ట అమలుపై తీవ్ర ఆందోళన వ్యక్తం చేశారు వైసీపీ అధినేత, మాజీ సీఎం వైఎస్ జగన్..
Also Read
- PG Doctors New Rules: ఏపీలో పీజీ వైద్యులకు కొత్త నిబంధనలు.. పని గంటలపై కీలక నిర్ణయం.
- AP Municipal Law Amendment: ఏపీ మున్సిపల్ చట్ట సవరణకు గవర్నర్ ఆమోదం.. కీలక మార్పులు ఇవే
- Janasena Party: స్థానిక పోరుకు జనసేన సిద్ధం.. 30 రోజుల పాటు ప్రత్యేక ప్రణాళిక
- CM Chandrababu : స్థానిక సంస్థల ఎన్నికలపై సీఎం చంద్రబాబు సంచలన వ్యాఖ్యలు
తాజావార్తలు
-
Monday Horoscope: నేడు ఆ రాశివారికి పట్టిందల్లా బంగారమే.. మీ రాశి ఫలితం ఎలా ఉందంటే.!
-
The Paradise: ఏష నాగుల సాంగ్ కి షేక్ అవుతున్న యూట్యూబ్.. 24 గంటల్లోనే 30 మిలియన్ వ్యూస్!
-
PM Modi-Putin Talks: నేడు మోడీ-పుతిన్ భేటీ.. ఎస్-400, యూపీఐ, చమురు, ఇంధనంపై కీలక చర్చలు
-
Pak Spy Network Busted: మేడ్ ఇన్ చైనా కెమెరాలు, పాక్‌కు లైవ్.. ఐఎస్ఐ గూఢచారి అరెస్ట్..
-
Bilawal Bhutto: యూరప్ యువరాణితో బిలావల్ భుట్టో పెళ్లి! సోషల్ మీడియాలో వైరల్
ట్రెండింగ్
-
Viral Video : గుండెలను పిండేస్తున్న దృశ్యం.. చెల్లెలితో చిన్నారి.. తల్లిదండ్రుల కోసం వెతుకులాట.!
-
Mouth Ulcer: చిన్న నోటిపుండే కదా అని లైట్ తీసుకుంటున్నారా? ఈ మార్పులు కనిపిస్తే తప్పక డాక్టర్‌ను సంప్రదించాల్సిందే.!
-
Rose Water: ముఖానికి ఫ్రెష్‌నెస్, హైడ్రేషన్ కావాలా.? అయితే ఇంట్లోనే రోజ్ వాటర్ ఇలా తయారు చేసుకోండి..!
-
మార్కెట్లో కిలో రూ.1500.. ఇంట్లోనే కేవలం 15 నిమిషాల్లో ‘కాజూ కట్లీ’ తయారీ చేయండి ఇలా.!
-
Hockey World Cup 2026: నెదర్లాండ్స్ ఆధిపత్యానికి చెక్.. 16 ఏళ్ల తర్వాత హాకీ ప్రపంచకప్ గెలిచిన అర్జెంటీనా!