YS Jagan: చంద్రబాబుపై వైఎస్ జగన్ సంచలన ఆరోపణలు.. దేవుడిపై భక్తి లేదు.. ఆలయాలపై శ్రద్ధ కూడా లేదు..!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
YS Jagan: ముఖ్యమంత్రి నారా చంద్రబాబుపై సంచలన ఆరోపణలు చేశారు వైసీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్.. సోషల్ మీడియా వేదికగా స్పందిస్తూ.. చంద్రబాబుకు దేవుడి పట్ల భక్తీ లేదు, ఆలయాల నిర్వహణ పట్ల శ్రద్ధ లేదంటూ మాజీ సీఎం వైఎస్ జగన్ ఫైర్ అయ్యారు.. అత్యంత నిష్ఠతో, బాధ్యతతో చేయాల్సిన టీటీడీ ఛైర్మన్ పదవిలో నిష్కలంక వ్యక్తిత్వం ఉన్న వ్యక్తిని నియమించి ఆలయ ప్రతిష్టను మంటగలిపేలా చేస్తున్నారని ఎక్స్ లో ట్వీట్ చేశారు.. దేశంలోనే కాదు, ప్రపంచ వ్యాప్తంగా కోట్లాది మంది భక్తులకు కలియుగ ప్రత్యక్ష దైవం శ్రీ వేంకటేశ్వరస్వామి కొలువై ఉన్న తిరుమల, తిరుపతి ఆలయాల నిర్వహణ, పరిపాలన అత్యంత పవిత్రమైన బాధ్యత.. అత్యంత నిష్ఠతో చేయాల్సిన బాధ్యత.. అలాంటి టీటీడీ ఛైర్మన్ పదవిలో నిష్కలంక వ్యక్తిత్వం, అచంచల భక్తి, నిబద్ధత, నిష్ఠ కలిగిన వారే ఉండాలి. కానీ, చంద్రబాబు గారు ఈ పవిత్రమైన స్థానాన్ని స్వార్థ రాజకీయాలకు వేదికగా మార్చారు. ఆలయ ప్రతిష్ఠను మంటగలిపేలా వ్యవహరించారని దుయ్యబట్టారు.. చంద్రబాబుకి భక్తీ లేదు, శ్రద్ధ అంతకన్నా లేదు.. దేవుడిపట్ల భయం కూడా లేదని మరోసారి రుజువైందని విమర్శించారు..
లడ్డూ నెయ్యి వివాదం
తిరుమల లడ్డూ తయారీలో వాడిన నెయ్యి నాణ్యతపై కూడా జగన్ ఆరోపణలు చేశారు. టీటీడీ ల్యాబ్ నాణ్యత బాగోలేదని తిరస్కరించిన నెయ్యి ట్యాంకర్లు మళ్లీ వేరే పేర్లతో టీటీడీకి వచ్చాయని తెలిపారు. ఈ అంశంపై సీబీఐ-సిట్ ఛార్జిషీట్లలో కూడా ప్రస్తావన ఉందని చెప్పారు. తిరుమల లడ్డూ ప్రసాదం విషయంలో తప్పు చేసి దానిని ఇతరులపై నెట్టే ప్రయత్నం జరుగుతోందని విమర్శించారు. 2014-19 మధ్య టీటీడీ నెయ్యి కొనుగోలు ధర రూ.278 నుండి రూ.330 మధ్యలో ఉండేదని, 2019-24 మధ్య కూడా సగటు ధర దాదాపు అంతేనని తెలిపారు. అయితే హెరిటేజ్‌కు చెందిన ఇందాపూర్ డెయిరీకి కిలో నెయ్యి రూ.658కి టెండర్ కేటాయించారని ఆరోపించారు. ఇది స్కాం కాదా అని ప్రశ్నించారు.
Also Read
- Perni Nani: అమరావతిపై ప్రభుత్వానికి పేర్ని నాని సవాల్..! "లెక్కలు చెప్పండి.. చర్చకు రండి"
- Saikrishna Custodial Death Case: సాయికృష్ణ కేసులో కొత్త ట్విస్ట్.. సీసీటీవీ హార్డ్‌డిస్క్‌లు మార్చారా..?
- AP Gold Mining: ఏపీలో గోల్డ్ మైనింగ్‌కు గ్రీన్ సిగ్నల్.. నాలుగు దశల్లో సర్వేలు, తవ్వకాలు
- AP Education Fee Hike: ఉన్నత విద్యా ఫీజులపై సర్కార్ కీలక నిర్ణయం...
దేవుడి పట్ల భక్తి ఉంటే ఇలాంటి నిర్ణయాలు తీసుకోరని, ఆలయ పవిత్రతను కాపాడే ఉద్దేశం ఉంటే ఇలాంటి నియామకాలు, కొనుగోళ్లు జరగవని జగన్ వ్యాఖ్యానించారు. ఆలయాల నిర్వహణలో భక్తి, నిష్ఠ, నిజాయితీ అవసరమని, అవి లేకపోవడం వల్లే ఈ వివాదాలు తలెత్తుతున్నాయని అన్నారు వైసీపీ అధినేత, మాజీ సీఎం వైఎస్ జగన్..
దేశంలోనే కాదు, ప్రపంచవ్యాప్తంగా కోట్లాది మంది భక్తులకు కలియుగ ప్రత్యక్ష దైవం, వేంకటేశ్వరస్వామి కొలువై ఉన్న తిరుమల, తిరుపతి ఆలయాల నిర్వహణ, పరిపాలన అత్యంత పవిత్రమైన బాధ్యత, అత్యంత నిష్ఠతో చేయాల్సిన బాధ్యత. అలాంటి టీటీడీ ఛైర్మన్ పదవిలో నిష్కలంక వ్యక్తిత్వం, అచంచల భక్తి, నిబద్ధత,…
— YS Jagan Mohan Reddy (@ysjagan) March 4, 2026
తాజావార్తలు
-
Donald Trump: ట్రంప్ కీలక ప్రకటన.. బాస్ ఎవరో నెతన్యాహుకు తెలుసు..!
-
Bhadra Rajyoga 2026: జూలై 7 నుంచి ఈ మూడు రాశుల అదృష్టం మారనుందా? బుధుడి సంచారం వల్ల ఎవరికి ఎక్కువ లాభం?
-
Medigadda Barrage : మేడిగడ్డ లక్ష్మీ బ్యారేజీకి పెరుగుతున్న వరద.. 85 గేట్లు ఎత్తివేత
-
Shreyas Iyer: ఓటమికి కారణం అతడే.. శ్రేయస్ అయ్యర్ ఆవేదన.. గెలిచే మ్యాచ్ ఓడిపోవాల్సి వచ్చింది..
-
IND Vs ENG: ఒకే ఓవర్లో 6, 6, 2, 4, 6, 2.. జాకబ్ బెథెల్ ఊచకోత.. భారత్ ఘోర ఓటమి..
ట్రెండింగ్
-
Rainy Season Tips : వర్షాకాలంలో ఆకుకూరలు తింటున్నారా? ఈ జాగ్రత్తలు తీసుకోకపోతే ప్రమాదమే.!
-
Rainy Season Tips : వర్షాకాలంలో తేమతో సరుకులు పాడవ్వకుండా ఇలా కాపాడుకోండి.!
-
పైరసీ సినిమాలు, ఓటీటీ కంటెంట్‌పై ‘Telegram’కు కేంద్రం నోటీసు జారీ.. 3,142 పైరసీ ఛానళ్ల గుర్తింపు.!
-
IND Playing XI: సంజు శాంసన్, తిలక్ అవుట్ ఆఫ్ ఫామ్.. ‘వైభవ్’ అరగ్రేటం.? రెండో టీ20 భారత్ ప్లేయింగ్ XI ఇదే.!
-
England Players: ఇంగ్లండ్ ఆటగాళ్లకు ‘వయాగ్రా’ అనుమతి.. అసలు కారణం ఇదే!