Vidadala Rajini Strong Warning: మాపై దాడి చేసి తిరిగి మా పైనే కేసులా?.. రేపు అనే రోజు ఒకటి ఉంటుంది గుర్తుంచుకోండి..!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
రాష్ట్రంలో జరుగుతోన్న తాజా పరిణామాలపై సంచలన వ్యాఖ్యలు చేశారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత, మాజీ మంత్రి విడదల రజని.. తిరుమల లడ్డూ విషయంలో క్షమాపణ చెప్పమన్నందుకు సీఎం చంద్రబాబు హింసను రాజేస్తున్నారని ఆరోపించారు.. వైసీపీ మాజీ మంత్రులు అంబటి రాంబాబు, జోగి రమేష్‌ను టార్గెట్ చేసి హత్యాయత్నం చేశారని మండిపడ్డారు.. స్థానిక ఎమ్మెల్యే గల్లా మాధవి దగ్గరుండి ఆర్గనైజ్డ్ గా టీడీపీ వాళ్లతో దాడి చేయించారు.. కార్యకర్తలను అంబటి ఇంటి మీదకు తీసుకెళ్లారు.. మళ్లీ వస్తాం.. మల్లా కొడతాం అని ఎమ్మెల్యే మాధవి మరోసారి రెచ్చగొట్టేలా మాట్లాడుతున్నారు. అసలు మీ పార్టీలో మీ పరిస్థితి ఏంటో చూసుకోండి.. రేపు అనే రోజు ఒకటి ఉంటుంది అది గుర్తుంచుకోండి అని హెచ్చరించారు..
Read Also: PM Modi: వారం వ్యవధిలో మోడీ రెండు బిగ్ డీల్స్.. భారత్‌కు కలిసొచ్చేదెంత?
Also Read
- AP IAS Transfers 2026: 22 మంది IAS అధికారుల బదిలీలు.. కీలక శాఖల్లో మార్పులు.. ఆమ్రపాలికి నో పోస్టింగ్..
- YS Jagan: 'దిశ' లేకపోతే మహిళల భద్రత ఎలా?.. ‘మహిళలు, చిన్నారులకు ఇది చీకటి రోజు’
- Minister Nimmala Ramanaidu: వెలిగొండ ప్రాజెక్టుపై కీలక ఆదేశాలు.. ఈ నెలలోనే నల్లమల సాగర్‌కు కృష్ణా జలాలు
- AP DSC 2026: టీచర్ జాబ్స్ కోసం ఎదురుచూస్తున్న వారికి గుడ్‌న్యూస్.. త్వరలో కొత్త డీఎస్సీ..
ఎంపీ పెమ్మసాని 24 గంటల్లో అంబటి రాంబాబుకు సినిమా చూపిస్తామని వార్నింగ్ ఇచ్చారు.. రాష్ట్రంలో అసలు లా అండ్ ఆర్డర్ ఎటు వెళ్తుంది అని ఆవేదన వ్యక్తం చేశారు విడదల రజని.. తిరుమల లడ్డూలో యానిమల్ ఫ్యాట్ కలవలేదని సీబీఐ చెప్పింది.. ఈ విషయంలో అబద్ధాలు చెప్తున్న చంద్రబాబు బుద్ధి మారాలని పూజలు చేసేందుకు వెళ్లాం.. అక్కడ నాతో పాటు మా పార్టీ కార్యకర్తలపై చిలకలూరిపేట ఎమ్మెల్యే పత్తిపాటి పుల్లారావు దాడి చేయించారు.. మాపై దాడి చేసి తిరిగి నామీదే కేసులు పెట్టారు. గుడి దగ్గర కులాలను రెచ్చగొట్టేలా మాట్లాడి, అక్కడకు వచ్చిన వారిపై దాడి చేశామని ఫిర్యాదు చేశారు అని మండిపడ్డారు.. వెంకటేశ్వర స్వామితో పెట్టుకుంటే ఏమవుతుందో అందరికీ తెలుసు.. చంద్రబాబు రెడ్ బుక్ రాజ్యాంగం అమలు చేస్తూ చట్టాలను చేతిలోకి తీసుకున్నారు. రేపు అసెంబ్లీలో వైసీపీ వాళ్లు, సామాన్యులు ఏ గుళ్లకు వెళ్లవద్దని చట్టం చేయండి.. లడ్డూలో జరగని దానిని జరిగిందని ఫ్లెక్సీలు వేసి ఈ రభసకు కారణం అయ్యారు.. ప్రతిపక్ష నాయకుల ఇళ్లపై దాడులు చేయటం, పెట్రోల్ బాంబులు వేయటం, మహిళలపై కూడా దాడులకు తెగబడుతున్నారు అని విమర్శించారు.. బీసీ మహిళను అయిన నా మీద అనేక సార్లు దాడులు చేశారు.. ఒక మహిళా మాజీ మంత్రిని అయిన నా పరిస్థితే ఇలా ఉంటే సామాన్య మహిళల పరిస్థితి ఏంటి..? రాష్ట్రంలో అంబేడ్కర్ రాజ్యాంగం లేదు..! అని ఫైర్ అయ్యారు.. మీరు ప్రజలకు మంచి పాలన ఇవ్వాలని కోరుకుంటాం.. మీరు ఆ పని చేయకపోతే ప్రశ్నిస్తాం అన్నారు.. నెయ్యి విషయంలో వైసీపీ హయంలో ఏ తప్పు చేయలేదు.. మీరే ప్రజల్లోకి అవాస్తవాలు తీసుకెళ్లి వారి మనోభావాలు దెబ్బతీశారు.. సీబీఐ ఛార్జ్ షీట్ లో మీరు చెప్పినవన్నీ అవాస్తవాలు అని తేలడంతో జీర్ణించుకోలేక పోతున్నారని ఆరోపించారు మాజీ మంత్రి విడదల రజని..
తాజావార్తలు
-
IND Vs SL Test Free Entry: భారత్ – శ్రీలంక టెస్టు సిరీస్‌కు ఉచిత ప్రవేశం.. ఎవరైనా వెళ్లి చూడొచ్చు..
-
Story Board: కమ్మేస్తున్న డ్రగ్స్ భూతం.. మన విద్యార్థుల్ని డ్రగ్స్ నుంచి ఎలా కాపాడుకోవాలి..?
-
Off The Record: సీఎం సొంత జిల్లాలో టీడీపీకి ఏమైంది? ఎమ్మెల్యేల తీరుపై చర్చ
-
Bengaluru: కుళ్లిన మాంసం, పాడైన కూరగాయలు..5-స్టార్ హోటళ్లలో కూడా అదే కంపు..
-
Dhurandhar : నెట్‌ఫ్లిక్స్‌లో ‘ధురంధర్’ ప్రపంచ రికార్డు..
ట్రెండింగ్
-
7500mAh బ్యాటరీ, 6.9 అంగుళాల 120Hz డిస్‌ప్లే, 45W ఫాస్ట్ ఛార్జింగ్‌తో REDMI 17 5G లాంచ్..!
-
Will Jacks: సూపర్‌మ్యాన్ ఫీల్డింగ్.. అయ్యా బాబోయ్..! ఏంటి జాక్ క్యాచ్ ను అలా పట్టేశావ్.!
-
John Turner Retirement: ఇంగ్లండ్ స్టార్ సంచలన నిర్ణయం.. 25 ఏళ్లకే క్రికెట్‌కు గుడ్‌బై.. కారణం తెలిస్తే షాక్!
-
Jowar Roti: ‘జొన్న రొట్టె’ విరిగిపోతుందా..? లేదా గట్టిగా అవుతుందా.? ఇలా చేస్తే మెత్తగా, బాగా పొంగే రొట్టెలు గ్యారెంటీ.!
-
10mm డైనమిక్ డ్రైవర్లు, ANC, 48 గంటల బ్యాటరీతో JBL Live Buds 4, Live Beam 4 లాంచ్..!