Undavalli Arun Kumar: రేపు ఉపరాష్ట్రపతి ఎన్నిక నేపథ్యంలో మాజీ ఎంపీ ఉండవల్లి అరుణ్ కుమార్ సంచలన వ్యాఖ్యలు చేశారు. మీడియాతో మాట్లాడిన ఆయన.. తెలుగు రాష్ట్రాలకు చెందిన టీడీపీ, వైసీపీ, జనసేన, బీఆర్ఎస్ ఎంపీలు.. తెలుగు వ్యక్తి, యూపీఏ అభ్యర్థి సుదర్శన్ రెడ్డికి ఓటు వేయాలని విజ్ఞప్తి చేశారు. తెలుగువారి ఆత్మగౌరవం కోసం టీడీపీ ఎంపీలు సుదర్శన్ రెడ్డికి ఓటు వేయవచ్చన్న ఆయన.. తనను ఓడించిన కూటమి అభ్యర్థికి వైఎస్ జగన్ ఎందుకు మద్దతు తెలుపుతున్నారో అర్థం కావడంలేదన్నారు.. ప్రధాని నరేంద్ర మోడీ, కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా ఉన్న ఉపరాష్ట్రపతిని పారిపోయేలా చేసి.. మళ్లీ ఎందుకు తీసుకొచ్చారని విమర్శించారు. ఎన్డీఏ అభ్యర్థికి ఓటు వేస్తే ఆర్ఎస్ఎస్ భావజాలం అంగీకరించినట్లే అవుతుందన్నారు.. బీజేపీకి చెక్ పెట్టాలంటే ఇదే రైట్ టైం అని తెలుగు ఎంపీలకు సూచించారు ఉండవల్లి..
Read Also: Jerusalem: జెరూసలేంలో రక్తపాతం .. హమాస్ కాల్పుల్లో ఇజ్రాయెల్ పౌరులు మృతి
భారతదేశ చరిత్రలో తొలిసారి ఇలాంటి ఎన్నిక జరుగుతుంది.. జగదీష్ దన్‌ఖడ్ ఎందుకు రాజీనామా చేశారో తెలియకుండా పదవి నుంచి తప్పుకున్నారు అన్నారు ఉండవల్లి.. ఇప్పుడు, ఆర్ఎస్ఎస్ కు చెందిన రాధాకృష్ణన్ ను బీజేపీ ఉపరాష్ట్రపతి అభ్యర్థిగా తీసుకువచ్చింది.. తమను వ్యతిరేకించే వారిని ఎవరినైనా బీజేపీ శిరస్సు చేదనం చేస్తారన్నారు.. ఇప్పుడున్న రాజ్యాంగం మీద, సెక్యులర్ వ్యవస్థ మీద బీజేపీకి నమ్మకం లేదన్న ఆయన.. బీజేపీ విధానాలకు వ్యతిరేకిస్తూ ఎన్డీఏ అభ్యర్థికి ఓటేస్తే ద్రోహులుగా మిగిలిపోతారని హెచ్చరించారు.. యూపీఏ అభ్యర్థి సుదర్శన్ రెడ్డి.. తెలుగు వ్యక్తి.. సెక్యులర్ – సోషలిస్ట్ భావాలు గల వ్యక్తి.. ఏపీకి చెందిన టీడీపీ, వైసీపీ ఎంపీలు నిరభ్యంతరంగా మన రాష్ట్రానికి చెందిన వ్యక్తికి ఓటు వేయాలని సూచించారు.. టీడీపీ ఎంపీలు సీక్రెట్ ఓటింగ్ లో సుదర్శన్ రెడ్డికి ఓటు వేయాలన్నారు.. సీఎం చంద్రబాబులా ఇప్పటివరకు ప్రధాని మోడీని ఎవరు విమర్శించలేదు.. వచ్చిన అవకాశాన్ని చంద్రబాబు సద్వినియోగం చేసుకోవాలన్నారు.. తనను ఓడించిన కూటమి అభ్యర్థికి జగన్ మద్దతు తెలుపుతున్నారు.. అసలు ఎన్డీఏ అభ్యర్థికి జగన్ ఎందుకు మద్దతు తెలుపుతున్నారో నాకు అర్థం కావడం లేదు.. తనపై కేసులు పెట్టిన కాంగ్రెస్ అంటే జగన్ కి ఇష్టం లేకపోవచ్చు.. కానీ, సుదర్శన్ రెడ్డి రాజ్యాంగాన్ని నిలబెట్టగలరు అన్నారు ఉండవల్లి..
Read Also: Srikakulam : శ్రీకాకుళంలో యూరియా కోసం రైతుల అవస్థలు
ఇక, సల్వాజుడుంకి అనుకూలంగా తీర్పించిన సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తిని హోం మంత్రి అమిత్ షా నక్సలైట్ అన్నారు.. అసలు, భారతదేశం ఎటు వెళ్తుందో అర్థం కావడం లేదన్నారు ఉండవల్లి.. రేపు జరగబోయేది చిన్న ఎన్నిక కాదు.. ఈ తరహాలో ఎన్నిక ఎప్పుడు భారతదేశంలో జరగలేదు.. రాజ్యాంగం ఉండాలా…? బీజేపీ ఉండాలా…? అని ప్రశ్నించారు.. ఈడీ కేసులు ప్రయోగిస్తూ బీజేపీ ట్రిక్ ప్లే చేస్తుంది.. గజినీ, ఘోరీ, బ్రిటిషర్ల తరహాలో బీజేపీ దేశాన్ని ఆక్రమిస్తుంది ఏమో అని నా అనుమానం అన్నారు.. బీజేపీని ఆపాలంటే ఇదే రైట్ టైం, ప్లీజ్ ఆలోచించండి అంటూ విజ్ఞప్తి చేశారు సీనియర్ పొలిటీషన్, రాజమండ్రి మాజీ ఎంపీ ఉండవల్లి అరుణ్ కుమార్..
