TTD: శ్రీవారి భక్తులకు అలర్ట్.. ఎల్లుండి నుంచి మార్చి నెల కోటా టికెట్ల విడుదల.. ఏ రోజు ఏవంటే..?
- తిరుమల శ్రీ వేంకటేశ్వరస్వామి భక్తులకు అలర్ట్..
- మార్చి నెలకు సంబంధించిన వివిధ టికెట్లకు సిద్ధమైన టీటీడీ..
- ఈ నెల 18 నుంచి 24వ తేదీ వరకు ఆన్లైన్లో దర్శన టికెట్లు విడుదల..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
TTD: కలియుగ ప్రత్యక్షదైవం తిరుమల శ్రీ వేంకటేశ్వరస్వామి భక్తులు అలర్ట్ కావాల్సిన సమయం వచ్చేసింది.. మార్చి నెలకు సంబంధించిన వివిధ టికెట్లను ఆన్లైన్లో విడుదల చేసేందుకు సిద్ధమైంది తిరుమల తిరుపతి దేవస్థానం (టీటీడీ) ఎల్లుండి నుంచి ఆన్లైన్లో మార్చి నెలకు సంబంధించిన దర్శన టికెట్లు విడుదల చేయనున్నారు.. 18వ తేదీ నుంచి 24వ తేదీ వరకు ఆన్లైన్లో దర్శన టికెట్లు విడుదల చేయనుంది టీటీడీ..
* శ్రీవారి ఆర్జిత సేవా టికెట్లకు సంబంధించిన సుప్రభాతం, తోమల, అర్చన, అష్టదళ పాదపద్మారాధన సేవల మార్చి నెల కోటాను ఈ నెల 18న ఉదయం 10 గంటలకు టీటీడీ ఆన్లైన్లో విడుదల చేయనుంది. ఈ సేవాటికెట్ల రిజిస్ట్రేషన్ కోసం 18 నుండి 20వ తేదీ ఉదయం 10 గంటల వరకు ఆన్లైన్లో నమోదు చేసుకునే అవకాశం ఉంటుంది. ఈ టికెట్లు పొందినవారికి డిసెంబర్ 20 నుండి 22వ తేదీ మధ్యాహ్నం 12 గంటల లోపు సొమ్ము చెల్లించిన వారికి లక్కీడిప్‌లో టికెట్లు మంజూరుచేస్తుంది టీటీడీ.
Also Read
- Minister Narayana: సీఆర్డీఏ సమావేశంలో కీలక నిర్ణయాలు.. అమరావతికి కొత్త ఊపు
- Nara Lokesh: మంత్రి లోకేష్‌తో చాగంటి కోటేశ్వరరావు భేటీ.. నైతిక విలువలతోనే విద్యా వికాసం
- AP Local Body Elections: స్థానిక ఎన్నికలపై ఎస్ఈసీ క్లారిటీ.. అప్పుడేనా..?
- Gudapati Srinivasa Rao: టీడీపీకి షాక్.. వైసీపీలో చేరిన గూడపాటి శ్రీనివాసరావు.. వైఎస్ జగన్ కీలక వ్యాఖ్యలు..
* డిసెంబర్ 21న ఆర్జిత సేవా టికెట్ల విడుదల చేయనుంది టీటీడీ.. కల్యాణోత్సవం, ఊంజల్ సేవ, ఆర్జిత బ్రహ్మోత్సవం, సహస్రదీపాలంకార సేవా టికెట్లను డిసెంబరు 21న ఉదయం 10 గంటలకు విడుదల చేయనున్నారు.
* డిసెంబర్ 21న వర్చువల్ సేవల కోటా విడుదల చేయనున్నారు.. వర్చువల్ సేవలు, వాటి దర్శన స్లాట్లకు సంబంధించిన మార్చి నెల కోటాను 21న మధ్యాహ్నం 3 గంటలకు టీటీడీ ఆన్లైన్లో విడుదల చేస్తుందని ప్రకటించారు.
* 23న అంగప్రదక్షిణం టోకెన్లు విడుదల చేయనున్న టీటీడీ.. మార్చి నెలకు సంబంధించిన అంగప్రదక్షిణం టోకెన్ల కోటాను 23న ఉదయం 10 గంటలకు టీటీడీ ఆన్లైన్లో విడుదల చేయనుంది.
* శ్రీవాణి ట్రస్టు టికెట్లకు సంబంధించిన మార్చి నెల కోటాను 23వ తేదీ ఉదయం 11 గంటలకు టీటీడీ ఆన్లైన్లో పెట్టనుంది.
* వృద్ధులు, దివ్యాంగుల దర్శన కోటాను కూడా 23వ తేదీన విడుదల చేస్తారు.. వయోవృద్ధులు, దివ్యాంగులు, దీర్ఘకాలిక వ్యాధులున్నవారు శ్రీవారిని దర్శించుకునేందుకు వీలుగా మార్చి నెల ఉచిత ప్రత్యేక దర్శనం టోకెన్ల కోటాను 23వ తేదీన మధ్యాహ్నం 3 గంటలకు ఆన్లైన్లో విడుదల చేయనుంది టీటీడీ.
* 24న ప్రత్యేక ప్రవేశ దర్శన టికెట్ల కోటా విడుదలకు సిద్ధమైన టీటీడీ.. మార్చి నెలకు సంబంధించిన ప్రత్యేక ప్రవేశ దర్శన టికెట్ల కోటాను 24న ఉదయం 10 గంటలకు ఆన్లైన్లో విడుదల చేయనున్న టీటీడీ.
* తిరుమల, తిరుపతిలలో గదులకు సంబంధించిన మార్చి నెల కోటాను 24న మధ్యాహ్నం 3 గంటలకు ఆన్లైన్లో విడుదల చేయనున్నారు.. ఇక, https://ttdevasthanams.ap.gov.in వెబ్సైట్ ద్వారా శ్రీవారి ఆర్జితసేవలు, దర్శన టికెట్లు బుక్ చేసుకోవాల్సి ఉంటుందని టీటీడీ ప్రకటించింది..
తాజావార్తలు
-
CM Revanth Reddy: పోలీస్ ఉద్యోగ పరీక్షలపై ప్రత్యేక నిఘా.. కోచింగ్ సెంటర్లపై కూడా ఫోకస్.. సీఎం రేవంత్ కీలక ఆదేశాలు
-
Ajit Agarkar: టీమిండియాలో షమీ భవిష్యత్తుపై సందిగ్ధం.. సెలెక్టర్ల నిర్ణయం ఇదే
-
Udhayanidhi Stalin: విజయ్ ప్రభుత్వం ఉగ్రవాదిలా చూసింది.. ఉదయనిధి కీలక వ్యాఖ్యలు
-
India-Pakistan: చైనా హోవిట్జర్లను మోహరించిన పాకిస్థాన్.. ‘అవసరమైతే ఏదైనా చేస్తాం’ అన్న భారత్
-
Karthi: నయనతార లేదా త్రిష.. కార్తీ కొత్త సినిమాలో హీరోయిన్ ఎవరు?
ట్రెండింగ్
-
Baba Vanga Prediction 2026: బాబా వంగా జోస్యం.. ఈ 5 రాశులకు కోటీశ్వర యోగం.!
-
Jowar Dry Fruits Laddu: ప్రోటీన్ రిచ్ ‘జొన్న డ్రై ఫ్రూప్ట్స్ లడ్డు’.. సులువుగా ఇంట్లోనే చేసేయండి ఇలా..!
-
Zodiac Predictions : ఆగస్టు 5న బుధ-గురు మహాయోగం.. ఈ 4 రాశులకు డబ్బే డబ్బు.!
-
Kitchen Hacks : అరటి తొక్కతో ఈ మ్యాజిక్ తెలుసా? బేకింగ్ సోడా కలిపితే సూపర్ రిజల్ట్.!
-
IndiGo Offer : ఇండిగో బంపర్ ఆఫర్.. 20 వేల ఉచిత టికెట్లు.!