Turkey and Azerbaijan Tour Packages Ban: పహల్గామ్ ఉగ్రదాడికి ప్రతీకారంగా ఇండియన్ ఆర్మీ ఆపరేషన్ సిందూర్ చేపట్టింది.. దీంతో, భారత్-పాకిస్థాన్ మధ్య యుద్ధమే జరిగింది.. ఈ సమయంలో.. పాక్‌ను అండగా నిలిచిన టర్కీ మరియు అజర్ బైజాన్‌పై భారతీయులు అసంతృప్తిని వ్యక్తం చేస్తున్నారు.. ఆయా దేశాలకు పర్యటనలు రద్దు చేసుకుంటూ తమ నిరసన వ్యక్తం చేస్తున్నారు.. ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ నుంచి కూడా ఆ రెండు దేశాలకు బిగ్ షాక్ తగిలింది.. టర్కీ, అజర్ బైజాన్ కు ఝలక్ ఇస్తూ.. సంచలన నిర్ణయం తీసుకుంది టూర్స్ & ట్రావెల్స్ అసోసియేషన్ ఆఫ్ ఆంధ్ర ప్రదేశ్ .. ఆ దేశాలకు టూరిజం, ట్రావెల్ బాయికాట్ చేస్తూ టూర్స్ & ట్రావెల్స్ అసోసియేషన్ ఆఫ్ ఏపీ నిర్ణయం తీసుకుంది..
Read Also: Supreme Court: వక్ఫ్ చట్టం పిటిషన్లపై మే 20న సుప్రీం విచారణ..
అందులో భాగంగా రేపటి నుంచి ఇస్తాంబుల్ టూర్ ప్యాకేజీలు రద్దు చేస్తున్నట్టు ఏపీ టూర్స్ & ట్రావెల్స్ అసోసియేషన్ ప్రకటించింది.. అయితే, ఆంధ్రప్రదేశ్ నుంచి 12 వేల మందికిపైగా పర్యాటకులు అక్కడి వెళ్తారు.. ఈ ప్యాకేజీ ద్వారా దాదాపు వెయ్యి కోట్లు ఆదాయం ఇస్తున్నారు ఏపీ టూరిస్టులు… కానీ, ఇప్పుడు టర్కీ మరియు అజర్ బైజాన్‌కు షాకిస్తూ ఈ నిర్ణయం తీసుకున్నారు.. భారత్ ప్రభుత్వం తరుపున సానుకూల సంకేతాలు వచ్చే వరకు ఈ బ్యాన్ కొనసాగుతుంది అని స్పష్టం చేశారు టూర్స్ & ట్రావెల్స్ అసోసియేషన్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ అధ్యక్షుడు విజయ్ మోహన్..