NTV Telugu Site icon

Andhra Pradesh: ఏపీలో నామినేటెడ్ పోస్టుల సందడి.. ఆశగా ఎదురు చూస్తున్న 3 పార్టీల నేతలు..!

Tdp Bjp Janasena

Tdp Bjp Janasena

Andhra Pradesh: ఆంధ్రప్రదేశ్‌లో కూటమి ప్రభుత్వం ఏర్పడింది.. మంత్రి పదవుల పంపకం పూర్తి అయ్యింది.. ఆ తర్వాత ఎమ్మెల్సీలను కూడా షేర్‌ చేసుకున్నారు.. ఇప్పుడు ఏపీ అధికార కూటమిలో నామినేటెడ్ పోస్టుల సందడి నడుస్తోంది. ఈ రెండు నెలల్లోగా విడతల వారీగా పోస్టుల జాతర ముగించేయాలనేది హైకమాండ్‌ ప్లాన్‌. మరోవైపు భర్తీలో ఈక్వేషన్లు ఎలా ఉంటాయనేది ఇప్పుడు హాట్‌ టాపిక్‌గా మారింది. పరిపాలన పరంగా సెక్రటేరియేట్ ఎంత బిజీగా ఉంటుందో.. నామినేటెడ్ పోస్టుల విషయంలో కూటమి పార్టీల నేతలూ అంతే బిజీగా ఉంటున్నారు. గ్రామ స్థాయి నుంచి రాష్ట్ర స్థాయి వరకు నానినేటెడ్ పోస్టుల భర్తీని విడతల వారీగా చేపట్టాలని చంద్రబాబు, పవన్ కల్యాణ్‌, పురందేశ్వరి భావిస్తున్నారు. ఈ క్రమంలోనే మూడు పార్టీల్లోనూ పార్టీ కోసం పని చేసిన నేతలు, కార్యకర్తల సమాచార సేకరణ జరుగుతోంది.

Read Also: Off The Record : ఆళ్లగడ్డలో అఖిలప్రియ vs శిల్పా చక్రపాణి రెడ్డి

కొందరు ఎమ్మెల్యేలు సహా టిక్కెట్లు దక్కించుకోలేని చాలా మంది నేతలు నామినేటెడ్ పోస్టుల కోసం ఆశగా ఎదురు చూస్తున్నారు. తమకు ఎన్నికల్లో తక్కువ సీట్లే ఇచ్చినా సర్దుకుపోయామని.. నామినేటెడ్ పోస్టుల్లో కచ్చితంగా ప్రయార్టీ లభిస్తుందనేది జనసేనలో జరుగుతున్న చర్చ. ఇటు తమకు కూడా ప్రాధాన్యత ఉంటుందని బీజేపీ కూడా భావిస్తోంది. ఇలా చూసుకుంటూ పోతే ఆశావహులు భారీగానే ఉన్నారు. ఈ క్రమంలో నామినేటెడ్ పోస్టుల భర్తీ ద్వారా కూటమి పార్టీల మధ్య బంధం మరింత బలపడేలా ఉండాలనే కానీ.. బలహీనపడడానికి బీజాలు పడేలా ఉండకూడదనే భావన మూడు పార్టీల్లో ఉంది. ఓవరాల్‌గా చూస్తే నామినేటెడ్ పోస్టుల భర్తీ కోసం పార్టీల మధ్య ఓ ఈక్వేషన్ తేవాలనే ఆలోచన చేస్తున్నట్టు సమచారం. దానికి అనుగుణంగా పదవుల భర్తీ జరిగితే ఇబ్బంది ఉండదని భావిస్తోంది కూటమి. దీనికోసం ఎలాంటి కసరత్తు చేస్తారో చూడాలి.