Sajjala Ramakrishna Reddy: గ్రామ స్థాయి నుంచి పార్టీ బలోపేతం.. వైసీపీ కొత్త వ్యూహం
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Sajjala Ramakrishna Reddy: వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర స్థాయి కోఆర్డినేటర్ సజ్జల రామకృష్ణారెడ్డి పార్టీ సంస్థాగత బలోపేతంపై కీలక వ్యాఖ్యలు చేశారు. గ్రామ, వార్డు స్థాయి వరకు పార్టీ నిర్మాణాన్ని దాదాపు పూర్తి చేశామని తెలిపారు. అనుబంధ విభాగాలను స్వతంత్రంగా, క్రియాశీలకంగా తీర్చిదిద్దేందుకు ప్రత్యేక చర్యలు చేపడుతున్నట్లు వెల్లడించారు. ఇక, ప్రతి అనుబంధ విభాగం, వివిధ సామాజిక వర్గాల ప్రతినిధులతో వరుస సమావేశాలు నిర్వహిస్తున్నామని సజ్జల తెలిపారు. ఆయా వర్గాల అభిప్రాయాలను సేకరించి భవిష్యత్ కార్యాచరణ ప్రణాళిక రూపొందిస్తామని చెప్పారు. మళ్లీ అధికారంలోకి వస్తే ప్రతి సామాజిక వర్గ సమస్యల పరిష్కారానికి ప్రత్యేక కార్యాచరణ అమలు చేస్తామని పేర్కొన్నారు.
జగన్ పాలన విజయాలను ప్రజల్లోకి తీసుకెళ్లాలి
పార్టీలో చేసే పనికి గుర్తింపు వచ్చేలా నాయకులు బాధ్యతతో వ్యవహరించాలని సజ్జల సూచించారు సజ్జల… “ఇది నా పార్టీ” అనే భావనతో ప్రతి నాయకుడు పనిచేయాలని కోరారు. ప్రజలతో మమేకం కావడం, వారి సమస్యలను తెలుసుకోవడం విజయానికి కీలకమని అన్నారు. మాజీ సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి పాలనలో అమలైన సంక్షేమ, అభివృద్ధి కార్యక్రమాలను ప్రజలకు వివరించాలని సజ్జల పిలుపునిచ్చారు. గత ప్రభుత్వ సంక్షేమం, ప్రస్తుత ప్రభుత్వ పాలన మధ్య తేడాలను ప్రజలకు తెలియజేయాలని సూచించారు. జగన్ పాలనలో సంక్షేమం, అభివృద్ధి రెండూ సమాంతరంగా సాగాయని అన్నారు.
Also Read
- RK Roja: స్థానిక ఎన్నికలకు సిద్ధం కావాలి.. ప్రతిచోటా పోటీ చేస్తాం..
- YS Jagan: వ్యవస్థలన్నీ కుప్పకూలాయి.. ప్రతి ఇంట్లో వైసీపీ, కూటమి పాలనపై చర్చ జరుగుతోంది..
- YS Jagan: ఏకగ్రీవాలకు అంగీకరిస్తే వచ్చే ఎన్నికల్లో టికెట్లు ఉండవు.. వైసీపీ నేతలకు జగన్ హెచ్చరిక
- Supreme Court: X, ఫేస్బుక్, ఇన్‌స్టా, యూట్యూబ్ పోస్టుల తొలగింపుపై వైసీపీ పిటిషన్.. సుప్రీంకోర్టు కీలక వ్యాఖ్యలు..
రాష్ట్రాన్ని నంబర్ వన్‌గా తీర్చిదిద్దడమే లక్ష్యం
ఐబీ సిలబస్, మెడికల్ కాలేజీలు, ఆరోగ్యం, విద్య రంగాల్లో వైసీపీ ప్రభుత్వం భారీ మార్పులు తీసుకువచ్చిందని సజ్జల పేర్కొన్నారు. ఐదేళ్లలో 15 ఏళ్ల అభివృద్ధిని చూపించామని అన్నారు. పార్టీ లోపాలను సరిదిద్దుకుంటూ రాష్ట్రాన్ని దేశంలో నంబర్ వన్‌గా నిలబెట్టడమే తమ లక్ష్యమని స్పష్టం చేశారు వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర స్థాయి కోఆర్డినేటర్ సజ్జల రామకృష్ణారెడ్డి..
తాజావార్తలు
-
Nepal Floods: నేపాల్ వరదలపై తెలంగాణ ప్రభుత్వం అలర్ట్.. సీఎం రేవంత్ ఆదేశాలతో ప్రత్యేక హెల్ప్‌లైన్ ఏర్పాటు
-
Off The Record: తగ్గేదిలేదు.. స్థానిక సమరంలో జనసేన సరికొత్త వ్యూహం..!
-
Story Board : ‘లవ్ జిహాద్’ కోణంపై పోలీసుల ఫోకస్
-
Iran-Oman: హార్ముజ్ ఆదాయంపై ఇరాన్-ఒమన్ కీలక ఒప్పందం.. అమెరికాకు షాక్
-
Nepal-Tibet Flash Floods: కైలాస మానస సరోవర్ యాత్ర నిలిపివేత.. అన్ని మార్గాలు మూసివేత..? వెనక్కి వెళ్లిపోండి..!
ట్రెండింగ్
-
iPhone 18 Proలో అదిరిపోయే అప్‌గ్రేడ్స్.. రిలీజ్ డేట్, కలర్స్, బ్యాటరీ, కెమెరా, ధర పూర్తి వివరాలు ఇవే..
-
Hardik Pandya Trade: హార్దిక్ పాండ్యా ట్రేడ్ ఖరారు.. ఇద్దరు స్టార్ ఆటగాళ్లను వదులుకుంటున్న కేకేఆర్?
-
Raksha Bandhan 2026: రక్షాబంధన్ ఎప్పుడు? ఆగస్టు 27నా.. 28నా? శుభముహూర్తం, పూర్తి వివరాలు ఇవే..
-
Medhavi Bidhuri: ‘6-7’ సెలబ్రేషన్‌తో వైరల్.. ఇప్పుడు వికెట్ల వేటలో తోపు.. ఎవరు ఈ ‘మెధావి బిధూరి’.?
-
Viral Love Story: తైవాన్ అబ్బాయి.. భారత్ అమ్మాయి.. రాత్రికి రాత్రే ఇండియాలో సెన్సేషన్.. కట్‌చేస్తే..