Sajjala Ramakrishna Reddy: పులివెందుల చరిత్రలో వైసీపీ ఓడిపోలేదు.. జడ్పీటీసీ ఉప ఎన్నికలపై న్యాయ పోరాటం కొనసాగుతుందని ప్రకటించారు వైసీపీ స్టేట్ కో-ఆర్డినేటర్ సజ్జల రామకృష్ణారెడ్డి .. వైసీపీ కేంద్ర కార్యాలయంలో జరిగిన స్వాతంత్య్ర దినోత్సవ వేడుకల్లో ఆయన మాట్లాడుతూ.. రాజకీయ పార్టీల్లో జవాబుదారీతనం తగ్గుతోంది.. వైఎస్ జగన్ విలువలు విశ్వసనీయత కలిగిన వ్యక్తి.. ఇచ్చిన హామీలను పట్టించుకోకుండా ప్రజలను మోసం చేయటం రాజకీయ పార్టీలకు అలవాటుగా మారింది.. ఈవీఎంలతో మోసం చేసి గెలుపు సాధించారు.. 12.5 శాతం ఓట్లు ఎలా పెరిగాయో ఎవరూ సమాధానం చెప్పటం లేదన్నారు. జడ్పీటీసీ ఉప ఎన్నికలలో వ్యవస్థలను నిర్వీర్యం చేసారు.. ఎన్నికల్లో జగన్ సంయమనంతో వ్యవహరించారు.. కానీ, ఎన్నికల వ్యవస్థ గుడ్డిగా వ్యవహరించింది.. సీసీ పుటేజీ, వెబ్ కాస్టింగ్ ఇవ్వమంటే ఇవ్వలేదు… ఎన్నికలు పారదర్శకంగా జరిగితే ఎందుకు భయపడతారు.. వీటన్నిటిపై న్యాయస్థానాల్లో పోరాటం చేస్తాం అని పేర్కొన్నారు.
Read Also: Day 2 : రజినీకాంత్ ‘కూలీ’ని దాటేసిన ఎన్టీఆర్ ‘వార్ 2’
వ్యవస్థలు యాంత్రికంగా పనిచేసే ప్రజాస్వామ్యం ఏం అవుతుంది? అని ప్రశ్నించారు సజ్జల.. తటస్థంగా ఉండేవారు ఎవరైనా ఆ 15 గ్రామాలకు వచ్చి ఓట్లు వేస్తే వాళ్ల చేతులకు వేలు చుక్కలు ఉన్నాయో లేదో చూడాలి. స్వేచ్ఛ, స్వాతంత్ర్యం నిలబడాలని కోరుకునే వారు ఎవరైనా రావచ్చు.. పులివెందుల చరిత్రలో వైసీపీ ఓడిపోలేదు. ఎన్నికలు శాంతి యుతంగా జరగాలని జగన్ మోహన్ రెడ్డి సూచించారు. మేం కూడా తలపడి ఉంటే ఎన్నికలు ఫలితం ఎలా ఉండేదో.. కానీ, ప్రజల ప్రాణాలకు ప్రమాదం రాకూడదని భావించాం అన్నారు. పోలింగ్ బూతుల్లో వైసీపీ ఏజెంట్లు లేకుండా పోలింగ్ నిర్వహించారు. పదిహేను పోలింగ్ బూతులకు రెండు వేల మంది పోలీసులను పెట్టారని మండిపడ్డారు… జడ్పీటీసీ ఎన్నికల పై మా పోరాటం కొనసాగుతుంది. న్యాయ వ్యవస్థ రక్షిస్తుందని జగన్ నమ్ముతున్నారు. జడ్పీటీసీ ఉప ఎన్నికలపై ఇంటింటికీ తిరిగి చూస్తే ఎంత మంది వెలికి సిరా చుక్క ఉందో తెలుస్తుంది. ఎవరు వచ్చినా మేం అక్కడ జరిగిన విషయాలను చూపిస్తాం. మన ప్రజా స్వామ్యాన్ని మనం రక్షించుకుందాం అని పిలుపునిచ్చారు సజ్జల రామకృష్ణారెడ్డి..