Posani Krishna Murali: రోజుకో కేసు.. రెండు రోజులకో పోలీస్ స్టేషన్.. మూడు రోజులకో జైలు అన్నట్టుగా తయారైంది సినీ నటుడు పోసాని కృష్ణ మురళి పరిస్థితి.. వివిధ ప్రాంతాల్లో పోసానిపై వరుసగా కేసులు నమోదు అవుతున్నాయి.. ఈ నేపథ్యంలో.. ఆంధ్రప్రదేశ్ హైకోర్టును ఆశ్రయించారు పోసాని.. ఏపీ హైకోర్టులో పోసాని కృష్ణమురళి క్వాష్ పిటిషన్లు దాఖలు చే వారు.. మొత్తం 5 పిటిషన్లు వేశారు పోసాని.. చిత్తూరు, అనంతపురం, కర్నూలు, శ్రీకాకుళం, విశాఖపట్నంలో నమోదైన కేసులు క్వాష్ చేయాలని పిటిషన్‌లో పేర్కొన్నారు.. పోసాని తాజా క్వాష్ పిటిషన్‌పై రేపు విచారణ చేపట్టనుంది ఏపీ హైకోర్టు..
Read Also: Graduate MLC Elections: పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో బీజేపీ అభ్యర్థి అంజిరెడ్డి ఘన విజయం
గతంలో నారా చంద్రబాబు నాయుడు, పవన్ కల్యాణ్, నారా లోకేష్.. వారి కుటుంబంపై అనుచిత వ్యాఖ్యలకు సంబంధించి పోసానిపై వరుస కేసులు నమోదు అవుతున్నాయి.. ఈ నేపథ్యంలో.. ఆ కేసులు కొట్టివేయాలని కోరుతూ క్వాష్ పిటిషన్ దాఖలు చేశారు పోసాని కృష్ణ మురళి… అయితే, పోలీసులు తప్పుడు కేసులు బనాయించారని, వారు పెట్టిన సెక్షన్లు పోసానికి వర్తించవని ఆయన తరుఫు న్యాయవాదులు పేర్కొన్నారు.. కాగా, పోసాని కృష్ణమురళిపై ఇప్పటికే రాష్ట్ర వ్యాప్తంగా దాదాపు 20 కేసులు వివిధ పోలీసు స్టేషన్లలో కేసులు నమోదైనట్టుగా తెలుస్తోంది..