Graduate MLC Elections: పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో బీజేపీ అభ్యర్థి అంజిరెడ్డి ఘన విజయం
- పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో బీజేపీ అభ్యర్థి అంజిరెడ్డి ఘన విజయం
- మూడు రోజుల పాటు నిర్విరామంగా జరిగిన ఓట్ల లెక్కింపు
- రెండో ప్రాధాన్యత ఓట్ల ఆధారంగా అంజిరెడ్డి గెలుపు.
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Graduate MLC Elections: తెలంగాణలో నిర్వహించిన కరీంనగర్, మెదక్, నిజామాబాద్, ఆదిలాబాద్ పట్టభద్రుల (గ్రాడ్యుయేట్) ఎమ్మెల్సీ (Graduate MLC Elections) ఎన్నికల్లో బీజేపీ అభ్యర్థి అంజిరెడ్డి (Anji Reddy) భారీ విజయం సాధించారు. మూడు రోజుల పాటు నిర్విరామంగా జరిగిన ఓట్ల లెక్కింపులో రెండో ప్రాధాన్యత ఓట్ల (Second Preference Votes) ఆధారంగా అంజిరెడ్డి గెలుపొందారు. ఈ ఎన్నికల్లో కాంగ్రెస్ అభ్యర్థి అల్ఫోన్స్ నరేందర్ రెడ్డి రెండో స్థానంలో నిలిచారు. బీఎస్పీ అభ్యర్థి ప్రసన్న హరికృష్ణ మూడో స్థానంలో నిలిచారు. ఓట్ల లెక్కింపు సమయంలో కాంగ్రెస్ అభ్యర్థి నరేందర్ రెడ్డి కేంద్రం నుంచి బయటకు వెళ్లిపోవడం చర్చనీయాంశమైంది.
Also Read
ఇక కరీంనగర్ ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఎన్నికల్లో కూడా బీజేపీకి గెలుపు లభించింది. బీజేపీ అభ్యర్థి మల్క కొమురయ్య (Malka Komuraiah) విజయం సాధించారు. ఉపాధ్యాయ కోటాలో మొత్తం 25,041 ఓట్లు ఉండగా, అందులో 897 ఓట్లు చెల్లనివిగా తేలాయి. చెల్లుబాటైన 24,144 ఓట్లలో మల్క కొమురయ్యకు 12,959 ఓట్లు దక్కాయి. పీఆర్‌టీయూ అభ్యర్థి మహేందర్ రెడ్డి (Mahender Reddy) 7,182 ఓట్లతో రెండో స్థానంలో నిలిచారు. మూడో స్థానంలో అశోక్ కుమార్ (Ashok Kumar) 2,621 ఓట్లను పొందారు. ఇక రాష్ట్రంలో రెండు ఎమ్మెల్సీ స్థానాల్లో గెలిచిన బీజేపీ మరింత ఉత్సాహంతో కనపడుతోంది. ఉపాధ్యాయ కోటా, పట్టభద్రుల కోటా రెండు చోట్లా కాషాయ జెండా ఎగరడంతో బీజేపీ శ్రేణుల్లో సంతోషం నెలకొంది.
తాజావార్తలు
-
AP Cabinet: రేపు ఏపీ కేబినెట్ అత్యవసర సమావేశం.. వాటిపైనే కీలక చర్చ..
-
Supreme Court: ‘‘రవాణాను పూర్తిగా నిలిపివేయలేరు’’.. ఢిల్లీ ఆంక్షలపై సుప్రీంకోర్టు
-
Amit Shah: రాహుల్ గాంధీ అబద్ధాల మధ్య బీజేపీ వరస విజయాలు..
-
Delhi Traffic: ఢిల్లీ ట్రాఫిక్‌పై ఆంక్షలు.. 30 ప్రాంతాల్లో వాహనాల రాకపోకలకు అంతరాయం..
-
Netanyahu: ఆమె యూదు వ్యతిరేకి.. నవీ పిళ్లైకు నోబెల్ బహుమతి ఇవ్వడంపై నెతన్యాహు తీవ్ర వ్యాఖ్యలు
ట్రెండింగ్
-
Pitod Ki Sabzi: ఇంట్లో కూరగాయలు లేవా? శనగపిండితో సింపుల్‌గా రాజస్థానీ స్టైల్లో ఈ రుచికరమైన పితోడ్ కూర చేసేయండి!
-
Bathroom Design Tips: బాత్రూమ్ ఎంత శుభ్రం చేసినా మళ్లీ తడిగానే ఉంటోందా? కారణం మీ క్లీనింగ్ కాదు.. ఈ సమస్య కావచ్చు!
-
AI Dance Video: “ప్రాంప్ట్ ఇదిగో”.. ఇద్దరు డ్యాన్స్.. కారులో నుంచి మూడో వ్యక్తి ఎంట్రీ! ఈ వైరల్ ఏఐ వీడియోను మీరే ఈజీగా చేసుకోండి..!
-
10,000mAh బ్యాటరీ, IP68/IP69-రేటెడ్ ప్రొటెక్షన్ తో రాబోతున్న Redmi Turbo 6 Max..!
-
Gen Z Side Hustles: జీతం ఒక్కటే సరిపోవడం లేదు.. అదనపు సంపాదన కోసం జెన్‌జీ కొత్త దారులు