Deputy CM Pawan Kalyan: గోదావరి కాలుష్యంలో సగం ఆంధ్రా పేపర్స్‌దే.. కఠిన చర్యలకు పవన్ కల్యాణ్ ఆదేశాలు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Deputy CM Pawan Kalyan: రాజమండ్రిలో గోదావరి కాలుష్యంపై డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆంధ్రా పేపర్స్ లిమిటెడ్ కాలుష్యం చేస్తూనే స్థానిక సంస్థలకు పన్నులు చెల్లించకుండా కాలయాపన చేస్తోందని ఆయన మండిపడ్డారు. దాదాపు రూ.21.34 కోట్ల పన్ను బకాయిలు ఉన్నప్పటికీ, పన్ను చెల్లించమని నోటీసులు ఇచ్చిన ప్రతిసారీ కోర్టులను ఆశ్రయిస్తూ ఆలస్యం చేస్తున్నారని పవన్ ప్రశ్నించారు.
2016 తర్వాత పన్ను చెల్లించలేదా?
ఆంధ్రా పేపర్స్ 2016 తర్వాత కాతేరు గ్రామ పంచాయతీకి గానీ, రాజమహేంద్రవరం మున్సిపల్ కార్పొరేషన్‌కు గానీ ఒక్క రూపాయి పన్ను కూడా చెల్లించలేదని పవన్ కల్యాణ్ పేర్కొన్నారు. ప్రభుత్వంతో సంబంధం లేకుండా సంస్థ తనకు తానే పన్ను మినహాయింపు ఇచ్చుకున్నట్టుగా వ్యవహరించడం ఎలా సాధ్యమని ప్రశ్నించారు. తప్పును సరిదిద్దుకునే అవకాశం ఇచ్చినా సంస్థ నుంచి స్పందన రాలేదని అన్నారు.
Also Read
- AP DSC 2026 Notification: టీచర్ ఉద్యోగార్థులకు గుడ్ న్యూస్.. DSC నోటిఫికేషన్ విడుదల
- AP Local Body Elections Schedule: స్థానిక ఎన్నికల సందడి.. మున్సిపల్, ఎంపీటీసీ, పంచాయతీ షెడ్యూల్ వివరాలివే..!
- AP ZP Chairperson Reservations: ఏపీలో జడ్పీ చైర్మన్ రిజర్వేషన్లు ఖరారు.. జిల్లాల వారీగా పూర్తి జాబితా ఇదే..!
- Chandrababu-Vijay Meeting: గోదావరి–కావేరీ అనుసంధానంపై ముందడుగు..? చంద్రబాబు, విజయ్ కీలక భేటీ
రాజమండ్రి కాలుష్యంలో సగం ఆంధ్రా పేపర్స్‌దే
రాజమండ్రి మొత్తం దాదాపు 70 మిలియన్ లీటర్ల ద్రవ వ్యర్థాలు ఉత్పత్తి అవుతుంటే, అందులో సుమారు 35 మిలియన్ లీటర్లు ఆంధ్రా పేపర్స్ నుంచే వెలువడుతున్నాయని పవన్ తెలిపారు. దీంతో గోదావరి నది సహజ పర్యావరణ వ్యవస్థ తీవ్రంగా దెబ్బతింటోందని ఆందోళన వ్యక్తం చేశారు. ఆంధ్రా పేపర్స్ లగూన్స్ వద్ద సేకరించిన నమూనాలను పరీక్షించగా లీటర్ నీటికి 36 మిల్లీగ్రాముల బయో కెమికల్ ఆక్సిజన్ డిమాండ్ (BOD) నమోదైందని పవన్ వెల్లడించారు. ఇది నిర్ణీత ప్రమాణాల కంటే 20 శాతం అధికమని తెలిపారు. ఫాస్ఫేట్ 5.3 మిల్లీగ్రాములు ఉండగా, ఇది 6 శాతం అధికమని, సల్ఫైడ్స్ 3.4 మిల్లీగ్రాములు ఉన్నాయని పేర్కొన్నారు. కేంద్ర కాలుష్య నియంత్రణ మండలి ప్రమాణాలతో పోలిస్తే సల్ఫైడ్స్ స్థాయి 70 శాతం అధికంగా ఉందని తెలిపారు.
కఠిన చర్యలకు ఆదేశాలు
కాలుష్య నియంత్రణ మండలి నిబంధనల ప్రకారం ఉల్లంఘనలకు పాల్పడితే పరిశ్రమ కార్యకలాపాలను నిలిపివేయడం, పెనాల్టీలు విధించడం, కంపెనీని సీజ్ చేయడం, అవసరమైతే లైసెన్స్ రద్దు చేయడం వంటి చర్యలు తీసుకునే అవకాశం ఉందని పవన్ కల్యాణ్ హెచ్చరించారు. కాలుష్య నియంత్రణ మండలి తక్షణమే ఆంధ్రా పేపర్స్ లిమిటెడ్‌కు సమన్లు జారీ చేసి, నిబంధనల ప్రకారం తగిన చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. అలాగే ప్రభుత్వం తరఫున అడ్వకేట్ జనరల్, అదనపు అడ్వకేట్ జనరల్‌తో పాటు ప్రభుత్వ న్యాయవాదులు, స్టాండింగ్ కౌన్సిళ్లు ఇటువంటి ఉల్లంఘనలకు సంబంధించిన కేసుల విచారణను త్వరితగతిన పూర్తి చేసేలా అవసరమైన చర్యలు తీసుకోవాలని సూచించారు.
పన్ను బకాయిలపై పవన్ ప్రశ్నలు
ఆంధ్రా పేపర్స్ పన్ను చెల్లించి దాదాపు పుష్కరకాలం పూర్తయిందని పవన్ వ్యాఖ్యానించారు. పన్ను చెల్లించమంటే కోర్టులను ఆశ్రయిస్తూ కాలయాపన చేయడం ఎందుకని ప్రశ్నించారు. స్థానిక సంస్థలకు దాదాపు రూ.21.34 కోట్ల వరకు పన్నులు చెల్లించాల్సి ఉందని తెలిపారు. కాలుష్యం కారణంగా గోదావరి నది సహజ పర్యావరణ వ్యవస్థ దెబ్బతింటోందని, దీనిపై ప్రభుత్వం కఠినంగా వ్యవహరిస్తుందని స్పష్టం చేశారు డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్..
రాజమండ్రి గోదావరి కాలుష్యంలో సగం ఆంధ్రా పేపర్ లిమిటెడ్‌దే
•కాలుష్యం చేస్తూ ఉత్పత్తి చేస్తున్నారు.. పన్ను మాత్రం ఎగ్గొడుతున్నారు..
•ఆంధ్రా పేపర్ మిల్స్ పన్ను కట్టి దాదాపు పుష్కరకాలం పూర్తయ్యింది
•పన్ను చెల్లించమంటే కోర్టులకెళ్లి కాలయాపన చేస్తారా? ఇంత బాధ్యతారాహిత్యం ఎందుకు?… pic.twitter.com/UDMipMrFJh— Deputy CMO, Andhra Pradesh (@APDeputyCMO) September 4, 2026
తాజావార్తలు
-
Harish Shankar: నన్ను మించి ట్రోల్ అయ్యారా? విజయ్ కు ధైర్యం చెప్పిన హరీష్ శంకర్
-
India Inflation Shock: ఆహారం నుంచి ఇంధనం వరకు ధరల మంటలు.. 11.39 శాతానికి చేరిన టోకు ద్రవ్యోల్బణం!
-
Saudi Arabia: మహ్మద్ ప్రవక్తపై వ్యాఖ్యలు.. హిందూ వ్యక్తికి మరణశిక్ష నుంచి ఊరట..
-
Ambati Rambabu: వైసీపీ కేడర్‌ను భయపెడుతున్నారు.. రౌడీషీట్లపై అంబటి ఆగ్రహం
-
Vijayawada Drugs: బెజవాడలో మరోసారి డ్రగ్స్ కలకలం.. ఎంబీఏ విద్యార్థిని అరెస్ట్!
ట్రెండింగ్
-
రూ.14,999కే itel 5G ఫోన్.. 120Hz డిస్ప్లే, 5000mAh బ్యాటరీతో City 300 లాంచ్..!
-
Dussehra Special Recipes: కరకరలాడే జంతికల నుంచి స్వీట్ షాప్ స్టైల్ చిక్కీ వరకు పిండివంటలు ట్రై చేయండి..!
-
Qais Ahmad: మాములు యాక్టింగ్ కాదయ్యా.. నీ పెర్ఫార్మన్స్‌కు ఆస్కార్ కూడా పనికిరాదేమో.! వీడియో వైరల్..
-
టాటా.. బైబై.. గయా.. WCL 2026 లీగ్ స్టేజీలోనే ఇండియా చాంపియన్స్ ఔట్..!
-
How To Grow Tej Patta In Pots: మార్కెట్ నుంచి తెచ్చే పని లేదు.. ఇంట్లోనే ఈజీగా బిర్యానీ ఆకు మొక్కను పెంచండి..