Pawan Kalyan: ప్రపంచ ఏనుగుల దినోత్సవం.. ఏనుగుల సంరక్షణపై పవన్ కల్యాణ్ కీలక సందేశం
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Pawan Kalyan: ప్రపంచ ఏనుగుల దినోత్సవం సందర్భంగా డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ ‘ఎక్స్’ వేదికగా ఏనుగుల సంరక్షణపై కీలక సందేశం ఇచ్చారు. ఏనుగులు కేవలం అడవి జంతువులు మాత్రమే కాదని, అవి అడవులకు సంరక్షకులు, పర్యావరణ సమతుల్యతకు ప్రతీకలని పేర్కొన్నారు. ఏనుగులను తరతరాలకు ప్రకృతిని గౌరవించేలా స్ఫూర్తినిచ్చే విధంగా సంరక్షించాల్సిన బాధ్యత అందరిపై ఉందన్నారు. ఏనుగులు, వాటి ఆవాసాలు, ఏనుగు కారిడార్ల పరిరక్షణకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కట్టుబడి ఉందని పవన్ కల్యాణ్ స్పష్టం చేశారు. ‘ప్రాజెక్ట్ ఎలిఫెంట్’ ద్వారా ఏనుగుల సంరక్షణకు కేంద్ర ప్రభుత్వం చేస్తున్న కృషిని ఆయన ప్రశంసించారు. ప్రధాని నరేంద్ర మోదీ నాయకత్వంలో దేశంలో వన్యప్రాణి సంరక్షణకు మరింత ప్రాధాన్యత లభిస్తోందని అన్నారు.
ఏనుగుల సంరక్షణకు సహకరిస్తున్న కేంద్ర అటవీ, పర్యావరణ శాఖ మంత్రి భూపేందర్ యాదవ్‌కు పవన్ కల్యాణ్ కృతజ్ఞతలు తెలిపారు. ఆంధ్రప్రదేశ్‌లో కూడా వన్యప్రాణుల రక్షణకు పలు చర్యలు చేపడుతున్నామని పేర్కొన్నారు. ఇందులో భాగంగా కుంకీ ఏనుగుల వినియోగంతో పాటు H.A.N.U.M.A.N. కార్యక్రమం ద్వారా వన్యప్రాణుల సంరక్షణకు చర్యలు తీసుకుంటున్నట్లు తెలిపారు. శిక్షణ పొందిన సిబ్బంది, అత్యాధునిక రెస్క్యూ మౌలిక వసతులు, టెక్నాలజీ, ర్యాపిడ్ రెస్పాన్స్ వ్యవస్థలను ఉపయోగించి ఏనుగులు, ఇతర వన్యప్రాణులను రక్షించేందుకు చర్యలు చేపడుతున్నామని పవన్ తెలిపారు. మానవులు, వన్యప్రాణుల మధ్య ఘర్షణలను తగ్గించడంతో పాటు సమర్థవంతమైన రక్షణ చర్యలు చేపట్టడమే లక్ష్యంగా ముందుకు సాగుతున్నామని పేర్కొన్నారు.
Also Read
సురక్షిత గ్రామాలు.. రక్షిత అడవులు.. ఏనుగులకు సురక్షిత ఆవాసాలు తమ లక్ష్యమని పవన్ కల్యాణ్ స్పష్టం చేశారు. ఏనుగుల ఆవాసాలను, వాటి సహజ సంచార మార్గాలను కాపాడటం ద్వారా పర్యావరణ సమతుల్యతను పరిరక్షించవచ్చని తెలిపారు. భవిష్యత్ తరాలు ప్రకృతిని గౌరవించేలా ఏనుగుల సంరక్షణకు ప్రతి ఒక్కరూ కృషి చేయాలని పిలుపునిచ్చారు. “ఏనుగులను కాపాడండి.. అడవులను కాపాడండి.. భవిష్యత్తును కాపాడండి” అనే సందేశంతో ప్రపంచ ఏనుగుల దినోత్సవం సందర్భంగా పవన్ కల్యాణ్ తన సందేశాన్ని ముగించారు.
An elephant is not just a majestic creature of the wild; it is a guardian of our forests, a symbol of ecological balance, and an integral part of India’s natural heritage.
On World Elephant Day, I reaffirm our commitment to protecting these gentle giants and the landscapes they… pic.twitter.com/wDsERY6YXI
— Deputy CMO, Andhra Pradesh (@APDeputyCMO) August 12, 2026
తాజావార్తలు
-
MS Dhoni: రెండో టీ20 మ్యాచ్‌కు ఎంఎస్ ధోనీ.. ఆ స్టార్ ఓపెనర్ కోసమేనా?.. వైభవ్ కోసం కాదండోయ్!
-
Air India Fuel Surcharge Hike: విమాన ప్రయాణికులకు షాక్.. పెరగనున్న టికెట్ భారం..? కారణం ఇదే..
-
GV Prakash : బాలీవుడ్లో జీవీ ప్రకాష్‌కు టెస్టింగ్ టైం.. నయూ నవేలికి కంప్లీట్ మ్యూజిక్ ఇచ్చిన కంపోజర్
-
Electric Tractors: రైతులకు గుడ్‌న్యూస్.. డీజిల్ ట్రాక్టర్లతో పోలిస్తే ఈ-ట్రాక్టర్లతో 84% ఖర్చు ఆదా..!
-
Dulquer Salmaan : ఐయామ్ గేమ్ ఫెయిల్యూర్‌పై దుల్కర్ సల్మాన్ రియలైజ్
ట్రెండింగ్
-
Bathroom Design Tips: బాత్రూమ్ ఎంత శుభ్రం చేసినా మళ్లీ తడిగానే ఉంటోందా? కారణం మీ క్లీనింగ్ కాదు.. ఈ సమస్య కావచ్చు!
-
AI Dance Video: “ప్రాంప్ట్ ఇదిగో”.. ఇద్దరు డ్యాన్స్.. కారులో నుంచి మూడో వ్యక్తి ఎంట్రీ! ఈ వైరల్ ఏఐ వీడియోను మీరే ఈజీగా చేసుకోండి..!
-
10,000mAh బ్యాటరీ, IP68/IP69-రేటెడ్ ప్రొటెక్షన్ తో రాబోతున్న Redmi Turbo 6 Max..!
-
Gen Z Side Hustles: జీతం ఒక్కటే సరిపోవడం లేదు.. అదనపు సంపాదన కోసం జెన్‌జీ కొత్త దారులు
-
CM Vijay: 600 కోట్లు చూపించి 30 కోట్లు దాచారా? సీఎం విజయ్ పిటిషన్‌పై హైకోర్టు కీలక వ్యాఖ్యలు.!