Pawan Kalyan: పార్టీ బలోపేతంపై పవన్ కల్యాణ్ ఫోకస్.. 25 మంది పరిశీలకుల ప్రకటన
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Pawan Kalyan: జనసేన పార్టీ సంస్థాగత నిర్మాణాన్ని మరింత బలోపేతం చేసే దిశగా పార్టీ అధ్యక్షుడు పవన్ కల్యాణ్ కీలక నిర్ణయం తీసుకున్నారు. పార్టీ పదవుల కోసం దరఖాస్తుల స్వీకరణ, నాయకుల అభిప్రాయాల సేకరణ కోసం 25 పార్లమెంట్ నియోజకవర్గాలకు సమాచార సేకరణ కమిటీ పరిశీలకులను నియమించారు. పార్టీ అభివృద్ధి కోసం కృషి చేసిన నాయకులు, జనసైనికులు, వీర మహిళల నుంచి దరఖాస్తులను స్వీకరించేందుకు ఈ కమిటీలు పనిచేయనున్నాయి. పార్టీలో ఏ స్థాయి బాధ్యతలు చేపట్టాలనుకుంటున్నారో దరఖాస్తుదారుల అభిప్రాయాలను కూడా సేకరించనున్నాయి.
ప్రతి పరిశీలకుడికి ముగ్గురు సీనియర్ నాయకులు, ముగ్గురు సాధకులు, 21 మంది సమన్వయకర్తలు సహకరించనున్నారు. సేకరించిన దరఖాస్తులను పార్టీ కేంద్ర కార్యాలయానికి పంపించనుండగా, వాటిని పార్టీ అధ్యక్షుడు పవన్ కల్యాణ్ స్వయంగా పరిశీలించనున్నారు. తుది నిర్ణయం పార్టీ అధ్యక్షుడిదేనని జనసేన స్పష్టం చేసింది. ఈ నెల 29వ తేదీ నుంచి సమాచార సేకరణ ప్రక్రియ ప్రారంభం కానుంది. పార్లమెంట్ నియోజకవర్గాల వారీగా ప్రత్యేక సమావేశాలు నిర్వహించి దరఖాస్తులను స్వీకరించనున్నారు. పార్టీ నిర్మాణాన్ని క్షేత్రస్థాయిలో మరింత బలోపేతం చేయడమే ఈ కార్యక్రమం ప్రధాన ఉద్దేశమని పార్టీ వర్గాలు వెల్లడించాయి. ఇప్పటికే శ్రీకాకుళం నుంచి అనంతపురం వరకు ఉన్న 25 పార్లమెంట్ నియోజకవర్గాలకు సీనియర్ నేతలను పరిశీలకులుగా నియమించారు. వీరు స్థానిక స్థాయిలో పార్టీ కార్యకర్తల అభిప్రాయాలను సేకరించి కేంద్ర నాయకత్వానికి నివేదిక సమర్పించనున్నారు. ఈ నియామకాలతో పార్టీ క్షేత్రస్థాయిలో మరింత బలోపేతం అవుతుందని జనసేన వర్గాలు భావిస్తున్నాయి.
Also Read
- YS Jagan : రాయలసీమ హార్టికల్చర్‌పై చంద్రబాబువి అంకెల గారడీలు
- Sajjala Ramakrishna Reddy : లోకల్ ఎలక్షన్స్‌కు వైసీపీ లీగల్ టీమ్ రెడీ.. సజ్జల కీలక ఆదేశాలు
- Pan IIT Summit : చంద్రబాబు చూపు ఈవీపై.. ఏపీకి కొత్త టెక్నాలజీ ప్లాన్..
- Minister Nara Lokesh: స్పీడ్.. సర్వీస్.. స్టెబిలిటీ.. ఏపీ అభివృద్ధిపై మంత్రి లోకేష్ కీలక వ్యాఖ్యలు
సమాచార సేకరణ కమిటీ పరిశీలకులు – పార్లమెంటు నియోజక వర్గం
1. సీహెచ్ వంశీకృష్ణ శ్రీనివాస్ – శ్రీకాకుళం
2. కొరికాన రవికుమార్ – విజయనగరం
3. కొణతాల రామకృష్ణ – విశాఖపట్నం
4. కొణిదల నాగబాబు – అరకు
5. పెండెం దొరబాబు – అనకాపల్లి
6. పంచకర్ల రమేష్ బాబు – అమలాపురం
7. సామినేని ఉదయభాను – కాకినాడ
8. కొటికలపూడి గోవిందరావు – రాజమహేంద్రవరం
9. బత్తుల బలరామకృష్ణ – ఏలూరు
10. పంతం వెంకటేశ్వరరావు (నానాజీ) – నరసాపురం
11. కందుల దుర్గేష్ – విజయవాడ
12. పిడుగు హరిప్రసాద్ – మచిలీపట్నం
13. బొలిశెట్టి శ్రీనివాస్ – గుంటూరు
14. బాలినేని శ్రీనివాసరెడ్డి – నర్సరావుపేట
15. దేవ వరప్రసాద్ – బాపట్ల
16. కిలారు వెంకట రోశయ్య – ఒంగోలు
17. బొమ్మిడి నాయకర్ – నెల్లూరు
18. లోకం నాగ మాధవి – తిరుపతి
19. పత్సమట్ల ధర్మరాజు – చిత్తూరు
20. కళ్యాణం శివ శ్రీనివాస్ – రాజంపేట
21. చిలకం మధుసూదన్ రెడ్డి – కడప
22. టి.ఉదయ్ శ్రీనివాస్ – కర్నూలు
23. వల్లభనేని బాలశౌరి – నంద్యాల
24. చిల్లపల్లి శ్రీనివాసరావు – హిందూపురం
25. వేములపాటి అజయ కుమార్ – అనంతపురం
తాజావార్తలు
-
Vijay Deverakonda: క్యారెక్టర్ కోసం ఇంత రిస్కా? ‘రణబాలి’ సెట్లో చావు అంచుల దాకా వెళ్లిన విజయ్ దేవరకొండ!
-
VIVO Smart Phones: 6.59 అంగుళాల OLED డిస్ప్లే, 7000mAh బ్యాటరీ, 90W ఫాస్ట్ ఛార్జింగ్.. VIVO నుంచి రెండు స్మార్ట్ ఫోన్స్..
-
Telangana Rain Alert: తెలంగాణలో వాన మోత.. ఈ జిల్లాలకు పిడుగుల ముప్పు
-
Oppo F35 Series: 8000mAh బ్యాటరీ, 80W ఫాస్ట్ ఛార్జింగ్.. మార్కెట్లోకి Oppo నుంచి రెండు స్మార్ట్ ఫోన్స్..
-
Adarsha Kutumbam: రూ.300 కోట్ల హీరో.. తోపు డైరెక్టర్.. అయినా ‘ఆదర్శ కుటుంబం’పై ఇంత సైలెన్స్ ఏంటి?
ట్రెండింగ్
-
Shreyas Iyer: పాకిస్థాన్ బ్యాటర్లు భయపెట్టారు.. గోల్డ్ మెడల్ పోతుందనుకున్నా.. అతడే కాపాడాడు!
-
National Boyfriend Day: మీ ప్రేమను మరింత స్పెషల్‌గా మార్చే సింపుల్ టిప్స్.!
-
Viral: అదనపు ఆదాయం కోసం ఆటో కొన్న సాఫ్ట్వేర్ ఉద్యోగి.. చివరికి ఏం జరిగిందో తెలుసా..
-
India Playing 11: ఇద్దరు హైదరాబాద్ ఆటగాళ్లకు ఛాన్స్.. వెస్టిండీస్‌తో చివరి వన్డేకు భారత్ తుది జట్టు ఇదే!
-
India vs Pakistan Final: భారత్, పాకిస్థాన్ ఫైనల్.. మ్యాచ్ రద్దయితే గోల్డ్ మెడల్ ఎవరికి?.. కీలక రూల్ ఇదే!